what Migraine Headache

what Migraine Headache: మైగ్రేన్ త‌ల‌నొప్పి అంటే ఏమిటి? ఎందువ‌ల్ల వ‌స్తుంది?

Health News

what Migraine Headache: మైగ్రేన్ వ‌ల్ల భరించ‌లేని నొప్పి వ‌స్తుంది. మైగ్రేన్ రావ‌డానికి ఒత్తిడీ, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి అనేక కార‌ణాలున్నాయి. మైగ్రేన్‌ని పూర్తిగా తొల‌గించుకోలేక‌పోవ‌చ్చు. కానీ అదుపులో ఉంచుకోవ‌చ్చు. శ‌రీరానికి స‌రిపడా విట‌మిన్లు అంద‌క‌పోతే మైగ్రేన్ త‌ల‌నొప్పి వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ట‌. డీ,రైబో ప్లేవిన్‌, కోఎంజైమ్ వంటి విట‌మిన్ల లోపంతో శ‌రీరంలో క‌ణాల వృద్ధి స‌రిగా ఉండ‌ద‌ని దీంతో త‌ల‌నొప్పి వ‌చ్చే అవ‌కాశా లున్నాయ‌ని తాజా అధ్య‌యా నాల్లో తేలింది. దీన్ని బారిన‌ప‌డ‌కుండా ఉండేందుకు విట‌మిన్లు పుష్క‌ళంగా ఉండే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాల‌ని వైద్య నిపుణులు(what Migraine Headache) సూచిస్తున్నారు.

భోజ‌నం మానేయొద్దు..!

మైగ్రేన్ రావ‌డానికి కార‌ణాల్లో ఇది మొద‌టిది. ప‌నిలో ప‌డి భోంచేయ‌డం మ‌ర్చి పోతుంటారు. దీని వ‌ల్ల వచ్చే బాధ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే ఎంత తీరిక లేకుండా ఉన్నా మూడు పూట‌లా భోంచేయ‌డాన్ని మ‌ర్చిపోవ‌ద్దు. ఒక వేళ తిన‌డం వీలు కాక‌పోతే ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌ని మ‌ధ్య మ‌ధ్య‌లో తీసుకోవ‌డం మ‌ర్చిపోవ‌ద్దు.

వ్యాయామం!

మైగ్రేన్ త‌ల‌నొప్పి

వ్యాయామం శ‌రీరం చురుగ్గా ఉండటానికే కాదు. మైగ్రేన్ నుంచీ ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది. రోజూ మీకు వీలైన స‌మ‌యంలోనే ఇరువై నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మంచిది.అలా వీలు కాక‌పోతే కాసేపు న‌డిచినా చాలు ఫ‌లితం ఉంటుంది.

కీడు చేసే కెఫీన్‌!

తీసుకునే ప‌దార్థాల్లో కెఫీన్ ఎక్కువ‌గా లేకుండా జాగ్ర‌త్త ప‌డండి. రోజువారీ దిన‌చ‌ర్య‌లో కాఫీ భాగ‌మై ఉంటే, త‌క్కువ‌గా తీసుకునే ప్ర‌య‌త్నం చేయండి. పూర్తిగా మానేయడం ఉత్త‌మం. కాఫీ తీసుకోవ‌డానికి బ‌దులుగా నీళ్లు కానీ, ప‌ళ్ల ర‌సాలు కానీ తీసుకోండి.

మైగ్రేన్ త‌ల‌నొప్పి
అధిక వెలుతురికి దూరంగా!

కాంతి నేరుగా ముఖం మీద ప‌డ‌టం వ‌ల్ల మైగ్రేన్ వ‌స్తుంది. అందుకే రంగురంగులూ, స‌న్న‌గా ఉండే కాంతికి దూరంగా ఉండండి. మండుటెండ‌లో బ‌య‌టికెళ్లే స‌మ‌యంలో స‌న్‌గ్లాసెస్ ధ‌రించండి. వీటితో పాటూ రోజూ ఒకే స‌మ‌యంలో ప్ర‌శాంతంగా నిద్ర‌పోయేలా చూసుకోండి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *