Uttarayan 2023: సూర్యగమనం దక్షిణం నుండి ఉత్తరం వైపుకు మరలడాన్ని ఉత్తరాయణం అంటారు. అదే మకర సంక్రాంతి. భోగి పండుగ వరకూ సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. దక్షిణదిశగా ప్రయాణిస్తాడు. దక్షిణాయణంలో ఇదే చివరి రోజు. భోగి పండుగకు మరునాటి నుంచి ఆయన ప్రయాణించే దిశ దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు మారుతుంది. అంటే దక్షిణ దిశ ఉంచి క్రమంగా సూర్యుడు వెనక్కు ప్రయాణిస్తాడన్న మాట. క్రమంగా రోజుకు ఒక డిగ్రీ చొప్పున తగ్గుతూ వెనక్కి వస్తూ ఉంటాడు. దీన్నే ఉత్తరాయణం Uttarayan 2023, అంటారు.
సూర్య గమనాన్ని గురించి యజుర్వేదంలో తస్మాదాదిత్య ష్షణ్మాసో దక్షిణేనేతి షడుత్తరేణేతి అని దక్షిణ మార్గంలో ప్రయాణిస్తాడు. మళ్లీ ఆరు మాసాలు ఉత్తర మార్గంలో ప్రయాణం చేస్తాడంటోంది వేదం. సూర్య సిద్ధాందం – భానోర్మకర సంక్రాంతేః షణ్మాసా ఉత్తరాయణం సూర్యుడు మకర సంక్రాంతి నుండి ఆరు మాసాలు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణ మంటారని చెప్పంది. ఈ ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం అన్నారు.
Uttarayan 2023: దేవతలకు సూర్యోదయం!
దేవతలకు మకర సంక్రమణంతో రోజు ప్రారంభమవుతుంది. తెల్లవారు జాము కాలంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం వస్తుంది. ఆ తరువాత వచ్చే ఉత్తరాయణంతో సూర్యోదయమవుతుంది. మకర సంక్రాంతి రోజున చేసే దాన, స్నాన, జప తర్ఫణాదులు శ్రేష్టమైన ఫలితాన్నిస్తాయి. మాఘమాసం Maghamasam, నుంచి శుభకార్యాలు జోరందుకుంటాయి. ప్రధానంగా ఉపనయనం వంటి శుభకార్యాలు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేస్తారు.
భవగద్గీత 8వ అధ్యాయంలో…
అగ్నిర్జ్యోతి రహః శుక్లః
షణ్మాసా ఉత్తరాయణం
బ్రహ్మ బ్రహ్మవిదో జనాః
ఉత్తరాయణం Uttarayan 2023,లో గతించిన వారికి ముక్తి లభిస్తుంది. ఆ పరబ్రహ్మను ఎరిగినవారై వారు మళ్లీ జన్మిస్తారు అన్నాడు భగవానుడు. ఉత్తరాయణం ఆరు మాసాలుంటుంది. ఇది దేవతలకు సంబంధించింది. మకర రాశి శ్రీహరి నక్షత్రమైన శ్రవణంతో కూడి ఉండటం ఒక విశేషం. మకరంలోని ఉత్తరాషాఢ రెండో పాదంలోకి రవి ప్రవేశించి దక్షిణాపధ్నాన్నుంచి సూర్యుడు ఒక్క సారిగా తన రథాన్ని ఉత్తరం వైపుకు మళ్లిస్తాడు.
అందుకే మకర సంక్రాంతి Makar Sankranti, కి రథం ముగ్గు వేసి మన వారు ఉత్తర గమనాన్ని చూపిస్తారు. రథ సప్తమి నుండి సూర్య గమనంలో వేగం పెరుగుతుంది. ఉత్తరం అంటే ఎత్తయిన మార్గంలో ప్రయాణం. రథ సప్తమి నుండి క్రమంగా వెలుగు పెరుగుతుంది. వెచ్చనికాలం మొదలవుతుంది. దీనికి సూచనగా ఉత్తరాయణం ప్రారంభాన్ని గొప్ప పండుగగా దేవతలను కోలుస్తాం. మన సంవత్సరం మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో మొదలవుతుంది.
మేరౌ మేషాది స కార్ధే పశ్యంతి భాస్కరం
సకృదేవోదితం తద్వద సురాశ్చ తులాదిగమ్..
మేరుగిరిపై అంటే ఉత్తర ధృవంపై నివసించే వారికి ఉగాదితో సూర్యోదయమవుతుంది. ఉత్తర, దక్షిణ ధృవాలపై ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉంటాయి.