Core Web Vitals Assessment: IPC Section 323: ఇరుగు పొరుగు వారితో త‌రుచూ

IPC Section 323: ఇరుగు పొరుగు వారితో త‌రుచూ గొడ‌వ‌ల‌కు దిగుతున్నారా? అయితే జాగ్ర‌త్తా!

IPC Section 323: మ‌నం నివ‌సించే ప్రాంతాల్లో త‌రుచుగా మ‌న ఇంటి ప‌క్క వాళ్ల‌తోనూ, ఎదురింటి వాళ్ల‌తోనో, లేక వెనుక ఇంటి వారితోనో గొడ‌వ జ‌రిగే అవ‌కాశాలు, గొడ‌వ జ‌రిగిన సంద‌ర్భాలూ చాలానే ఉంటాయి. అంతే కాకుండా వెరొక ఇంటి వారు మ‌రొక‌రి ప‌క్క ఇంటి వారితో గొడ‌వ ప‌డిన సంద‌ర్భాలూ చూస్తూనే ఉంటాం. కొంత మంది అయితే వారి ఇంటి ప‌క్క‌న ఉన్న ఎవ‌రితోనైనా ఏదో ఒక సంద‌ర్భంలో ఏదో ఒక వంక‌తో చీటికి మాటికి గొడ‌వ‌కు దిగుతారు. దూర్ఫ‌ష‌లాడుతుంటారు. చివ‌ర‌కు ఆ ఇంటివారు, ఇంటి వారు కొట్టుకునే స్థాయికి వెళుతుంది క‌దా!.

అయితే ఇలా గొడ‌వ‌లు జ‌రిగిన‌ప్పుడు పోలీసు స్టేష‌న్‌లో ఒక సెక్ష‌న్ ద్వారా కేసు న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని లాయ‌ర్లు చెబుతున్నారు. ఎవ‌రైనా మ‌న ఇంటి చుట్టు ప్ర‌క్క‌ల ఉన్న వారు మ‌న‌పై ఏ కార‌ణం లేకుండా గొడ‌వ‌ల‌కు, వాద‌న‌ల‌కు పాల్ప‌డితే క‌చ్చితంగా వారిపై కేసు న‌మోదు చేయ‌వ‌చ్చు అంటున్నారు న్యాయ నిపుణులు. ఆ సెక్ష‌న్ పేరే ఐపీసీ సెక్ష‌న్ 323 (IPC Section 323). ఈ సెక్ష‌న్ ద్వారా మ‌న ఇంటి వ‌ద్ద మ‌న‌పై బ‌య‌ట వారు(చుట్టు ప్ర‌క్క‌ల వారు) ఎవ‌రైనా దురుసుగా మాట్లాడినా, గొడ‌వ‌కు దిగినా కేసు న‌మోదు చేయ‌వ‌చ్చు.

అస‌లు ఏఏ గొడ‌వ‌లు ఉంటాయి?

మ‌నం నివ‌సించే ప్రాంతంలో ముఖ్యంగా రోడ్డు మీద న‌ల్లా వ‌ద్ద బిందెల వ‌ద్ద‌, ఆ ఇంటి వారు వినియోగించిన నీరు మ‌రొక‌రి ఇంటి మీదుగా వెళుతున్నందున‌, వేరే వారి బైకు మ‌న ఇంటి ఎదుట పార్కింగ్ చేశార‌ని, మ‌న అపార్ట్ మెంట్ మీద బ‌ట్ట‌లు ఆర‌వేయ‌గా అవి గాలికి వెళ్లి వేరే వారి ఇంటిపై ప‌డినా, పెద్ద పెద్ద స్పీక‌ర్లు పెట్టి ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగించినా, వేరే వారు ఇల్లు క‌ట్టుకుంటున్న‌ప్పుడు వారి పైపులు మ‌రో ఇంటి లోప‌ల‌కి వ‌చ్చినా, వేరే వారు కిటీకి మ‌రొక‌రి ఇంటి వైపు తెరిచార‌నో ఇలా ఏదైనా గొడ‌వ‌కు దారితీసి మ‌రొక ఇంటి వారికి ఇబ్బంది క‌లిగితే ఖ‌చ్చితంగా ఈ ఐపీసీ సెక్ష‌న్ 323 మీద అవ‌త‌లి వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

చిన్న గొడ‌వ‌ల‌కి అంత పెద్ద కేసులా?

సాధార‌ణంగా ఈ గొడ‌వ‌లు ధ‌న‌వంతులు ఉండే ప్ర‌దేశాల్లోనో, లేక అత్యంత పేద‌రికంలో ఉండే ప్ర‌దేశాల్లోనో రావు. కేవ‌లం మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు ఉండే ప్రాంత‌ల్లోనే పైన చెప్పిన గొడ‌వ‌లు వ‌స్తుంటాయి. ఏ కార‌ణం చేత‌నైనా మ‌నం గొడ‌వ‌కు వెళ్లినా, మ‌న‌పై ఎవ‌రైనా గొడ‌వ‌కు దిగినా పెద్ద‌గా కేసులు పెట్టుకునేంత వ‌ర‌కూ వెళ్ల‌వు. కానీ కొంత మంది చ‌దువుకున్న‌వారు, ఈ సెక్ష‌న్ల గురించి తెలిసిన వారు క‌చ్చితంగా ఈ సెక్ష‌న్ 323 కింద కేసు న‌మోదు చేసే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఇంత చిన్న గొడ‌వ‌కు కేసులు దాకా పోవాలా? అని అనుకోవ‌ద్దు. దీనికి ఒక సెక్ష‌న్ ఉంటుంది. ఈ గొడ‌వ‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌వ‌చ్చు. జైలుకు వెళ్లాల్సి వ‌స్తుందేమోన‌నే విష‌యాలు పాపం మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల వారికి తెలియ‌వు.

ఈ సెక్ష‌న్ పై కేసు న‌మోదు అయితే?


సెక్ష‌న్ 323 కింద మ‌న‌పై ఎవ‌రైనా చుట్టుప్ర‌క్క‌ల వారు 100 కు డెయిల్ చేసి కేసు న‌మోదు చేస్తే. పోలీసులు క‌చ్చితంగా అరెస్టు చేసి తీసుకెళ్తారు. ఈ కేసు న‌మోదైతే ఏడాది పాటు జైలు శిక్ష ఉంటుంది. రూ.1,000 జ‌రిమానా కూడా ప‌డుతుంది. ఒక వేళ ఆ డ‌బ్బులు క‌ట్ట‌క‌పోతే మ‌ళ్లీ ఆరు నెల‌ల పాటు జైలు శిక్షను కోర్టు పొడిగిస్తుంది.

ఈ కేసుకు బెయిల్ రాదా?

ఈ సెక్ష‌న్ కింద కేసు న‌మోదు అయితే బెయిల్ దొర‌కుతుంది. అదే విధంగా అవ‌త‌లి వ్య‌క్తి సామ‌ర్థ్యాల‌ను బ‌ట్టి బెయిల్ కూడా రాకుండా కేసు కోర్టు వ‌ర‌కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ఈ కేసు విష‌యంలో ఇరు ప‌క్షాలు కూర్చొని కేసు కొట్టివేయించుకోవ‌డం మంచిది. ఒక వేళ కోర్టు వ‌ర‌కు వెళితే మాత్రం జైలు శిక్ష త‌ప్ప‌దు.

కాబ‌ట్టి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సెక్ష‌న్ల గురించి తెలియ‌వారు బ‌హుశా ఉండ‌రేమో! అన‌వ‌స‌రంగా పొరుగువారితో గొడ‌వ‌ల‌కు వెళ్లి , కేసులు న‌మోదు అయ్యి ఆయా కుటుంబాల్లో చ‌దువ‌కున్న పిల్ల‌ల జీవితాలు నాశ‌నం చేసుకోవ‌ద్దు. ఒక వేళ గొడ‌వ జ‌రిగితే, ఆ గొడ‌వ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, సాధ్య‌మైనంత వ‌ర‌కు స్థానిక పెద్ద‌ల స‌మ‌క్షంలోనే చ‌ర్చించుకుంటేనే మంచిది. ఒక వేళ మ‌న త‌ప్పు ఉంటే ఎదుట వారిని క్ష‌మించ‌మ‌ని అడిగే గుణం ఉంటే అక్క‌డితో ఈ గొడ‌వ స‌ద్ధుమ‌ణుగుతుంది. ఒక వేళ అన్యాయంగా నిత్యం వేధిస్తూ గొడ‌వ‌కు పాల్ప‌డితే మాత్రం ఈ సెక్ష‌న్ ప‌రంగా కేసు న‌మోదు చేసుకోవ‌చ్చు. కాబ‌ట్టి సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇరుగుపొరుగు వారితో మంచిగా మ‌లుచుకోవ‌డం, మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా చూసుకోవ‌డం చాలా ఉత్త‌మం.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *