stock and share సాధారణమైన భాషలో చెప్పాలంటే ఒక కంపెనీ యొక్క యాజమాన్యం ను చిన్న చిన్న విభాగాలుగా విభజించగా వచ్చే వాటాలను స్టాక్ లేదా షేర్ అంటారు. ఈ స్టాక్ ని ఈక్విటీ, బాండ్స్ ఫైనాన్సియల్ సెక్యురిటీ అని వివిధ రకాలుగా పిలుస్తారు. గరిష్ట వాటాలను తీసుకున్న వ్యక్తి గరిష్ట యాజమాన్య హక్కులను కలిగి ఉంటాడు. అతను కంపెనీ ఛైర్మన్ లేదా డైరెక్టర్ కావచ్చు. మీరు షేర్ లేదా స్టాక్ కొనడం వల్ల ఆ కంపెనీ లో మీరు కూడా భాగస్వాములు అవుతారు. ఉదాహరణకు కంపెనీ సేకరించదలచిన 2,00,00,000 రూపాయలను 10 విలువ గలిగిన 20,00,000ల యూనిట్లుగా విభజిస్తే ప్రతి యూనిట్ లేదా షేర్ 10 రూపాయల విలువ కలిగి ఉంటుంది. ఈ యూనిట్లు లేదా షేర్ ని కంపెనీ నియమ నిబంధనల ప్రకారం వారు నిర్ణయించిన ధర ప్రకారం కొనవలసి ఉంటుంది. మీరు కంపెనీలో పెట్టిన మూల ధనాన్ని అనుసరించి మీ యొక్క యాజమాన్యం వాటా శాతం (stock and share)నిర్ణయిస్తారు.

వాటాదారులకు కంపెనీ లాభాల్లో వాటా చెల్లించబడుతుంది. కంపెనీ తీసుకునే నిర్ణయాలలో వాటాదారులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. కంపెనీ తన లాభాలను వాటాదారులకు వారి వాటా ప్రకారం పంపిణీ చేస్తుంది. ఈ పంపిణీని డివిడెండ్ (లాభ వాటా) అంటారు. ఈ డివిడెండ్లను ఆ కంపెనీ యొక్క లాభాల ఆధారంగా చెల్లిస్తారు. కంపెనీ తన లాభాలను మొత్తం వాటాదారులకు ఇవ్వదు. కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం రిజర్వుగా ఉంచుతుంది. కొంత కాలానికి ఈ రిజర్వుల మొత్తం అధికమైతే ఈ రిజర్వులను కంపెనీ తన వాటాదారులకు బోనస్ రూపంలో పంచుతుంది.
వాటాదారుల ప్రయోజనాలు

మీరు కంపెనీలో వాటా దారులు కావడం వల్ల కంపెనీ లాభాల్లో వాటా కలిగి ఉంటారు. కంపెనీ ఆర్థిక విజయాలను సాధిస్తుంటే మీ యొక్క స్టాక్ విలువ పెరిగి మీకు లాభాన్ని అందిస్తుంది. మీరు 10 విలువ కలిగిన ఒక కంపెనీ యొక్క 100 వాటాలను కొనుగోలు చేయడానికి 1,000 పెట్టుబడి పెడితే కంపెనీ వృద్ధి వల్ల ఆ స్టాక్ 13కు పెరగడంతో 300 లాభం పొందారు. అనగా మీ లాభం 30% అంతే కాకుండా మీరు డివిడెండ్, బోనస్, రైట్ ఇష్యూ, ప్రిపరేన్సియల్ షేర్లు మొదలగు రూపాలలో కూడా ప్రతిఫలం ఉంటుంది.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?