What is Self Confidence: నమ్మకం!. ఈ పదం చాలా చిన్నది అయినా ఇది ప్రభావితం చేస్తే పేదవారు ధనవంతులు అవుతారు. డబ్బు లేని వారు డబ్బును సంపాదిస్తారు. ఇతరులను నమ్మించాలంటే చాలా ధైర్యం ఉండాలి. వాళ్లు చెప్పేది కరెక్టు కాదు. నేను చెప్పేది మాత్రమే కరెక్ట్ అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అందుకు వాళ్ల మీద వాళ్లకు ఉన్న నమ్మకం. నమ్మకం ఉంటేనే ఏ పనైనా ఇతరుల వద్ద చేయగలం. మనకు మనం డబ్బు సంపాదించగలం. నమ్మకం(What is Self Confidence) అంటే ఎలా ఉంటుందో కింద రెండు స్టోరీల ద్వారా తెలుసుకోండి!.
What is Self Confidence | నమ్మకానికి ప్రాణం అర్పించిన గెలీలియో!
ఐరోపా ఖండాన్ని మొత్తం చర్చి ఫాదర్లు పరోక్షంగా పాలిస్తున్న కాలం అది. దీనినే ఇంగ్లీషులో Christendom అని అంటారు.Galilee అనే వ్యక్తి ఉన్నాడు. తన మీద తనకి నమ్మకం ఎక్కువ. అయితే తనకి నమ్మకం ఉండబట్టే బైబిల్‌కి వ్యతిరేకంగా భూమి గుండ్రంగా ఉంటుందని ప్రకటించగలిగాడు. టెలిస్కోప్ కనిపెట్టిన మహామేధావి. అంతరిక్షంలో అన్ని గుండ్రంగా ఉన్నాయి కాబట్టి, భూమి కూడా గుండ్రంగా ఉండాలని ఊహించిన మొదటి వ్యక్తి.


సముద్రలో దూరంగా ప్రయాణిస్తున్న షిప్, పొగ గొట్టం ముందు కనపడి తరువాత మెల్లిగా షిప్ మొత్తం కనబడే ప్రయోగం మన స్కూల్ పుస్తకాలలో ఈ రోజుకీ ఉన్నది. అది తెలీలియా సూచించినదే. భూమి బల్లపరుపుగా ఉందని Bibleలో రాసుంది కాబట్టి, గుండ్రంగా ఉందన్న నీ వాదనని మార్చుకో అని చర్చి ఫాదర్లు గెలీలియోను హెచ్చరించారు. ( ఈ రోజుకీ ఆధునిక నగరమై లండన్‌లో బైబిల్ బిలీవర్స్ అసోసియేషన్ స్థాపించి, బైబిల్ ప్రకారం భూమి బల్లపరుపుగా ఉందని వాధిస్తారు.)
వారికి ఎన్ని ఫొటోలు, సాక్ష్యాలు చూపినా ఒప్పుకోరు. నా ప్రాణం తీసినా నా నమ్మకం హేతుబద్ధమని వాధించాడు గెలీలియో. అయితే అతని వాదనను తప్పుగా భావించి ఎండుగడ్డితో కాలిస్తే సుళువుగా చనిపోతాడని, పచ్చగడ్డితో ఆ మేధావిని కాల్చి చంపారు మత ఛాందసులు. తన సిద్ధాంతం మీద నమ్మకంతో గెలీలియో చనిపోతూ ఉచ్చరించిన ఆఖరి మాటలు Still is is round.
What is Self Confidence | నమ్మకం కోసం చేతి గీత చెక్కుకున్నాడు!
ఒకసారి ఫ్రాన్స్ దేశంలో ఓ గ్రామానికి ఓ జ్యోతిష్యుడు వచ్చి, అందరికీ భవిష్యత్తు చెబుతున్నాడు. ఓ కుర్రవాడు తాను ప్రపంచ అధినేత అవుతానా అని అడిగాడు. నీకు చేతిలో ఫలానా విధంగా గీత లేదన్నాడు ఆ జ్యోతిష్యుడు. వెంటనే ఆ కుర్రవాడు ఇంటికి వెళ్లి కత్తితో చేతిలో ఆ గీత చెక్కుకున్నాడు. మరునాడు ఆ కుర్రవాడు జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చి, చెయ్యిజాపి ఇప్పుడు చెప్పు నేను ప్రపంచ అధినేత అవుతానా అని తన మీద తనకు నమ్మకంతో అడిగాడు. ఆ కుర్రవాడి పేరే Napoleon Bona Parte.


What is Self Confidence | నెట్‌వర్క్ బిజినెస్ వ్యక్తి స్టోరీ!
ఒక Network Business చేసే వ్యక్తి లా అనుకున్నాడు. ఏముంది కొంచెం డబ్బే కదా ప్రతి ఒక్కరూ కట్టి జాయిన్ అయిపోతారు. తద్వారా వాళ్లూ నెలకు కనీసం ఓ అయిదు వేలైనా సంపాదించగలరు అని అనుకున్నాడు. కాని ఆశ్చర్యం ఏమిటంటే ఒక్కరు కూడా జాయిన్ కాలేదు. కారణం ఎంత ఆలోచించినా బోధపడలేదు. అందరికీ నెట్‌వర్క్ Business plan అంతా చాలా అద్భుతంగా చెప్పేవాడు. స్లోగా డబ్బు మన పాకెట్‌లోకి ఎలా వస్తుందోనని చాలా హేతుబద్ధంగా చెప్పేవాడు. అంతా విని సరే ఆలోచించుకొని జాయిన్ అవుతాము అని సమాధానం చెప్పేవారు. మళ్లీ వాళ్లు కనబడేవారు కాదు. అప్పుడు అతనికి అర్థం అయ్యింది. మనలో చాలా మందికి తమపై తమకు నమ్మకం లేదని.