Section 29: సాధారణంగా ఇటీవల పలు సందర్భాల్లో ఎలాంటి అరెస్టులు చేయకుండా పోలీసులు కొన్ని కొన్ని సందర్భాల్లో సామాన్య వ్యక్తులను కొట్టడం, దీంతో వారు పై అధికారులకు ఫిర్యాదు చేయడం లేదా ధర్నాలు చేయడం, ఆత్మహత్యలకు పాల్పడటం లాంటివి వార్తల్లో, పేపర్లో చూస్తూనే ఉన్నాం. అసలు పోలీసులు వారు కొట్టే అధికారం ఉందా? ఉంటే ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి వ్యక్తులను కొట్టే అవకాశం ఉంది. ఒక వేల కొడితే ఆ అధికారులపై ఎలాంటి పిటిషన్ వేయవచ్చు.చట్టం(Section 29) ఏం చెబుతుంది? పరిశీలిస్తే..
అరెస్ట్ చేసిన తర్వాత పోలీసువారికి ప్రజలను కొట్టే అధికారం లేదు. ఒక వేళ మిమ్మల్ని కొడితే పోలీసు వారు కొడితే యాక్ట్ 1891 సెక్షన్ 29(Section 29) ప్రకారం ఆ పోలీసు అధికారికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా తో కూడిన శిక్ష వేయవచ్చని చట్టంలో ఉన్న నిబంధనలు చెబుతున్నాయి. అరెస్ట్ చేసిన క్షణం నుంచి కోర్టులో ప్రవేశ పెట్టే దాకా మీ పూర్తి బాధ్యత రక్షణ ఒక వేళ మీకు ఏమి జరిగినా పూర్తి బాధ్యత పోలీసు వారిదే. అందుకే అరెస్టు చేసే సమయంలోనే మెమో ఆప్ అరెస్ట్ (పేపర్)రాపించాలి.
CRPC SECTION 41 B, C, D ప్రకారం పేపర్ మీద రాయమని అని అడగాలి. ఎలాం అంటే? నఏను పలానా పోలీసు అధికారిని పలానా వ్యక్తిని పలానా నేరం కింద అరెస్టు చేస్తున్నాను. అని అధికారి పేరు అతని ర్యాంక్ కానిస్టేబుల్, ఎస్ఐ మొదలగు వారి సిబ్బంది, తేదీ స్థలం ఏ స్టేషన్ కింద అరెస్టు జరుగుతుంది. ఆ సమయంలో అరెస్టు చేయబడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి అతనికి ఏమైనా స్వల్ప లేదా తీవ్ర గాయాలు ఉన్నాయా అతని దగ్గర ఉండే వస్తువులు మొత్తం పేపర్ లో రాసి అతని బంధువులు లేదా శ్రేయోభిలాషులు లేదా సమయంలో మంచి పేరు ఉన్న వ్యక్తి సంతకం, అరెస్టు చేసే పోలీసు అధికారి సంతకం, అరెస్టు చేసిన వ్యక్తం యొక్క సంతకం కూడా కచ్చితంగా పేపర్ లో రాయలి. దీన్నే మెమో ఆప్ అరెస్ట్ అంటారు. అరెస్ట్ చేసిన 24 గంటలలోపే మెజిస్ట్రేట్ లేదా కోర్టులో కచ్చితంగా ప్రవేశ పెట్టాలి.

ఏ పోలీసు అయినా మిమ్మల్ని స్టేషన్ కి రండి.. అని ఫోన్ చేస్తే ముందు ఆ అధికారిని ఇలా అడగండి. CRPS సెక్షన్ 169, 170, 50 ల ప్రకారం నోటీసులు సర్వ్ చేయవలెనని వినయంగా కోరుచున్నాను. అని చెప్పండి . లేదా వారు ఫోన్‌చేసిన మొబైల్ నెంబర్ కు మెస్సేజ్ చెయ్యండి. వివిధ హైకోర్టు లలో అరెస్టు సమయంలో సంబంధిత పోలీసు అధికారులు దాడి చేయడంతో వారి మీద రిట్స్ వేయడం జరిగింది. వివిధ కోర్టులు శిక్ష వేయడం జరిగింది.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?