Sampoorna Shiva Darshan శివాలయంలో ఎనిమిది రూపాల్లో శివుడు ప్రకాశిస్తుంటాడు. మొదటిగా మనకు కనిపించే బయటి ప్రాకారం లేదా శివాలయం గోడ. రెండోవది రాజగోపురం. అది దాటి లోపలికి ప్రవేశిస్తే లోపలి ప్రాకారంలో ధ్వజస్థంభం కనిపిస్తుంది. గర్భాలయంపై ప్రకాశించే త్రిశూల కలశమూ శివస్వరూపమే. గర్భాలయంలోని లింగ స్వరూపమే కాదు విమానంపై కనిపించేది కూడా స్థూల లింగమే. అర్చక స్వామి సాక్షాత్తూ శివుడే. చండీశ్వరుడు, బలిపీఠం కూడా శివ (Sampoorna Shiva Darshan)స్వరూపాలే.
సంపూర్ణ శివ దర్శనం ఇదే!
వీటిలో ఏది కనిపించినా శివదర్శనమైనట్టే లెక్కించాలి. అన్నింటినీ చూడగలిగితే సంపూర్ణ శివదర్శనమైనట్టుగా భావించాలి. మహాశివరాత్రి నాడు శివాలయం దర్శనం చేసి అభిషేకాన్ని చూస్తున్నప్పుడు ఏం చేయాలి? అంటే శివనామం మనస్సులో ధ్యానం చేయాలి. ధ్యాయేత్ ఈ ప్సిత సిద్ధయే- ధ్యానం చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు. రుద్రమంత్రాలు కంఠగతమైతే మౌనంగా మంత్రాన్ని స్వరంతో రమించి చదువుకున్నా, జపం చేసినా అభిషేకం చేసినా ఫలితమే వస్తుంది. ఉచ్చస్వరంతో రుద్రమంత్రాలతో అభిషేకం చేస్తుంటే లక్షరెట్లు శక్తి పైకి విస్పోటనం అవుతుంది. ఆ శక్తి ప్రసారాలు అభిషేకంలో పాల్గొన్న వారందరికీ చేరుతాయి.
జన్మకో శివరాత్రి!
ఆపాతాళ నభోపర్యంతం నిండిపోయిన శుద్ధస్పటిక సంకాశ లింగమూర్తి రూపం గుండ్రనిది. అది బ్రహ్మాండాలను సైతం అధిగమించినది. రుద్రాభిషేకం వల్ల బ్రహ్మాండం చల్లబడుతుంది. చందనోదకంతో అభిషేకం పూర్తి చేసి తిర్యక్ పుండ్రాలను తీర్చి దిద్దుతారు. మంగళకరంగా కాహళీ వాయిస్తారు. చల్లని చంద్రుని నుంచి అమృతబిందువులు బొట్టుబొట్టుగా రాలిపడుతున్నట్టుగా ధారపాత్ర నుంచి ఒక్కోబొట్టు పడుతుండగా శివదర్శనం చేసి జాగరణ పరమార్థం తెలుసుకోవాలి. శివరాత్రి వైభవాన్ని వేలవిధాలుగా అభివర్ణించినా తనివి తీరదు. అందుకే పెద్దలు జన్మకో శివరాత్రి అని ఒక్క మాటలో చెప్పారు. మహాశివరాత్రి నాడైనా తనివితీరా శివనామం చెప్పాలి. శివాభిషేకం చూడాలి. ఉపవాస జాగరరణలతో జన్మసార్థకం చేసుకోవాలి.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్