what is Plastic Surgery Definition ప్లాస్టిక్ అంటే ఆకారాన్ని పునర్ నిర్మించడం అని అర్థం. ఇది గ్రీకు పదం. 1909 లో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ప్రారంభమైంది. అంతకుముందెప్పుడో 1598 నాటికే ఈ పదాన్ని కనుగొన్నారు. మన దేశంలో క్రీ.పూ.800 నాటికే శూత్రుడు ఈ పునర్మిణ శస్త్ర చికిత్సను చేయడం ప్రారంభించాడు. చరకుడు ప్లాస్టిక్ సర్జరీ విద్యను సంస్కృతం నుంచి అరబిక్లోకి అనువదించాడు. అ్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు విస్తరించింది. 1815లో కార్ప్యూ మొట్టమొదటిసారి పాశ్చాత్య దేశాలలో ప్లాస్టిక్ సర్జరీని చేశారు. సర్ వారోల్ గిల్లీని ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీగా భావిస్తున్నారు. ముఖానికి సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీలో ఎన్నో విచిత్రాలను ఆయన (what is Plastic Surgery Definition)చేశారు.
ప్లాస్టిక్ సర్జరీ వైద్య విభాగాన్ని ప్రధానంగా ఆరు భాగాలుగా చెప్పకోవచ్చు. ఈస్టటిక్ సర్జరీ-లో ముఖం, శరీరం అందంగా ఉండేట్లు తీర్చిదిద్దుతారు. అందుకే మనకు ప్లాస్టిక్ సర్జరీ అనగానే కాస్మోటిక్ సర్జరీ అనిపిస్తుంటుంది. బర్న్సర్జరీ– ఇది ప్రధానంగా రెండు రకాలు. కాలిన వెంటనే చేసే చికిత్స ఒకటి. ఆ తర్వాత అంద వికారంగా కనిపించే చర్మం, అవయవాల్ని సరిచేయడం, మూడో విభాగం క్రేనియో ఫెషియల్ సర్జరీ. పెద్దలకి పిల్లలకి కూడా ముఖం మొత్తం లేదా ముఖంలోని కొన్ని భాగాల పునర్మిణ శస్త్ర చికిత్సలు ఈ విభాగంలోకి వస్తాయి. పిల్లల్లో పుట్టుకతో వచ్చే ముఖ లోపాల్ని సరిదిద్దవచ్చు. కెప్ట్లిప్ లాంటివి అందుకు ఉదాహరణలు. పెద్దల్లో కూడా చెవి, ముక్కు, కన్ను, గడ్డం, బుగ్గలు లాంటి వాటిని కావాల్సిన విధంగా పునర్ నిర్మాణం చేయవచ్చు. హ్యాండ్ సర్జరీ– వేళ్లు, చేయ లాంటివి తెగినా వాటిని ఈ సర్జరీ ద్వారా కలపవచ్చు. మైక్రో సర్జరీ నాల్గొవది ముఖ్యమైనది. తెగిన అవయవాల్ని తిరిగి అతికించేటప్పుడు నరాలు, రక్తనాళాలు లాంటి స్మూక్షమైన వాటిని మైక్రో స్కోప్ ద్వారా చూస్తూ కలుపుతారు. పీడియాట్రిక్ సర్జరీ- పిల్లలకు చేసే ప్లాస్టిక్ సర్జరీ ఇది.


- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?