OPEC Meeting ఒపెక్ అంటే ద ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్(ఓపీఈసీ)(The Organization of the Petroleum Exporting Countries). ఇది 1960 లో బాగ్దాద్‌లో జరిగిన సదస్సులో ఏర్పాటయ్యింది. ఒపెక్ వ్యవస్థాప సభ్య దేశాలు ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనుజులా, సభ్య దేశాల్లో చమురును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం సౌదీ అరేబియా! ఒపెక్ యేతర దేశాల్లో చమురును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం రష్యా!!. ఒపెక్ మొట్టమొదటిగా 1960లో ఏర్పాటైంది. ప్రపంచ చమురు అవసరాల్లో ఒపెక్ సరఫరా వాటా 40 శాతం ఉంది. రోజుకు ప్రపంచ చమురు డిమాండ్ 80 మిలియన్ల బ్యారేళ్లు. ఒపెక్ యేతర దేశాల్లో చమురును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం రష్యాగా (OPEC Meeting) చెప్పవచ్చు.

ఒపెక్‌లో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనుజువెలా, కతార్, ఇండోనేషియా, లిబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అల్జీరియా, నైజీరియాలకు సభ్యత్వం ఉంది. మొత్తం సభ్య దేశాల్లో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేస్తున్న సౌదీ అరేబియాదే నిర్ణయాత్మక పాత్రగా చెప్పవచ్చు. ప్రపంచ అవసరాల్లో ఒపెక్ 40 శాతం చమురును సరఫరా చేస్తోంది. మొత్తం చమురు నిల్వల్లో 75 శాతం నిల్వలు ఈ దేశాల్లోనే ఉన్నాయి. ఇరాక్‌ను మినహాయిస్తే ఒపెక్ దేశాలు ప్రతిరోజూ 28.7 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే ప్రపంచ డిమాండ్ రోజుకు 80 మిలియన్ బ్యారెళ్లుగా ఉండటం గమనార్హం.
చమురు ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఒపెక్ దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ధరలు తక్కువుగా ఉన్నాయని ఒపెక్ భావించినప్పుడు సభ్య దేశాల పెట్రోలియం మంత్రులు సమావేశమై ఉత్పత్తిపై గరిష్ట పరిమితి (సీలింగ్) ని ప్రకటిస్తున్నారు. దీంతో సరఫరా తగ్గి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. చమురు ఉత్పత్తిపై ఒపెక్ పరిమితి కారణంగా 1973 లో ఒక్క రోజులోనే పెట్రోలియం ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. చమురు ఉత్పత్తిపై పరిమితికి సంబంధించి ఒపెక్ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. కొన్ని దేశాలు ఉత్పత్పిని బాగా నియంత్రించి, ధరల పెంపును ప్రతిపాదిస్తే మరికొన్ని దేశాలు ఉత్పత్తిని పెంచి, ధరలు తగ్గించాలని పేర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు హఠాత్తుగా పెరగడం, ఒపెక్ దేశాల పరిమితులు తేటతెల్లం చేసింది. ఉత్పత్తిని పెంచి, ధరల స్థిరీకరణకు తోడ్పడటం అటుంచి పలు సభ్య దేశాలు తమ కోటాలను కూడా భర్తీ చేయలేకపోతున్నాయి.

ఒపెక్ యేతర దేశాలు ఏవి?
ఒపెక్ సభ్యదేశాలు కానీవి రష్యా, మెక్సికో, అంగోలా, ఒమన్, నార్వే, బ్రిటన్‌లలోనూ చమురు ఉత్పత్తుల నిల్వలు భారీగానే ఉన్నాయి. 1997 నుంచి రష్యాలో చమురు ఉత్పత్తి ఊపందుకుంది. అదే స్థాయిలో ఆ దేశం నుంచి చమురు ఉత్పత్తులు ఎగుమతులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లో ఒపెక్ యేతర దేశాల వాటా కూడా పెరగడం ప్రారంభమైంది. ఒపెక్ యేతర దేశాల్లో రష్యా అత్యధికంగా చమురు ఉత్పత్తి చేస్తోంది.
పెరుగుతున్న ధరలు
గత కొన్నేళ్లుగా చమురు ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. 2002లో ముడి చమురు ధర బ్యారెల్‌కు సగటున 21.74 డాలర్లుగా ఉంటే అది 2007 లో 72 డాలర్లకు చేరుకుంది. ప్రపంచీవ్యాప్తంగా ఇటీవల కాలంలో చమురు ధరలు గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణంగా అమెరికా, చైనాల్లో వినియోగం అధిగమవడం. వేగంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న చైనాలో చమురు వినియోగం అధిగమవడంతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. చమరు ధరలకు బెంచ్ మార్క్‌గా ఉన్న డాలర్ కొద్దికాలంగా బలహీనమవుతోంది. డాలర్ విలువ పడిపోవడం, దాని కొనుగోలు శక్తిని బాగా తగ్గించింది. మరోవైపు ఒపెక్ దేశాలు తమ ఆదాయాలను డాలర్ విలువతోనే పరిగణలోకి తీసుకుంటాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలపై ఒపెక్ దేశాలు నింపాదిగా స్పందిస్తున్నాయి.
అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికాలో ఇరాన్ ఘర్షణ తెలిసిందే. అమెరికాతో వివాదం కారణంగా ఇరాన్ నుంచి చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. చమురు నిల్వలు గణనీయంగా ఉన్న ఇరాన్ నుంచి సరఫరా ఆగిపోతే భవిష్యత్తులో చమురు ధరలు మరింతగా పెరుగుతాయనే ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. యుద్ధం, అంతర్గత ఘర్షణలు, ఆంక్షలు, పెట్టుబడులు పడిపోవడం తదితర కారణాల వల్ల ఇరాక్‌తో ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేదు. నైజీరియాలో ఆయిల్ పరిశ్రమపై ఉగ్రవాదుల దాడుల కారణంగా 2006, ఫిబ్రవరి నుంచి ఆ దేశం చమురు ఉత్పత్తుల్లో కోతపడింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
చమురు ధరల పెరుగుదల ప్రపంచంలోని పలు దేశాల్లోద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. చమురు ధరల కారణంగా ప్రభుత్వ సబ్సిడీలు, అప్పులు పెరగక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది వడ్డీ రేట్లపై ఒత్తిడి పెంచి, వడ్డీ రేట్లు తగ్గేలా చేస్తుందని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఉత్పాదక రంగాలకు పెట్టుబడులు అందుబాటులోలేకుండా పోతాయని వారు అభిప్రాయపడుతున్నారు. చమురు ధరల్లో పెరుగుదల ద్రవ్యోల్భణానికి దారితీసి, అంతిమంగా ఆర్థిక ప్రగతి కుంటుపడేలా చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ద్రవ్యోల్భణం పెరుగుతున్న దేశాల్లో జీడీపీ రేట్లను ప్రపంచ బ్యాంకు ఇప్పటికే సమీక్షిస్తుంది. ఆయా దేశాల్లో ఒక్కో శాతం మేర ఆర్థిక రేటును తగ్గించింది. 1970, 1980 లలో చమురు సంక్షోభంతో పోల్చుకుంటే ప్రస్తుతం పరిస్థితిని పూర్తిస్థాయి సంక్షోభంగా భావించనవసరం లేదని విశ్లేషుకులు చెబుతున్నారు. ఎందుకంటే 1979తో పోల్చుకుంటే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు తర్వాతి సంవత్సరం 1980లో చమురు ధర బ్యారెల్ కు 101.70 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఆ స్థితి లేకపోవడం కూడా పరిస్థితిని సజావుగానే ఉందనడానికి నిదర్శనమని వారు అంటున్నారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి