Mission Karmayogi: మిషన్ కర్మయోగి పేరున Civil సర్వీసుల ప్రక్షాళనకు, సివిల్ సర్వీసుల సామర్థ్యం పెంపు కోసం జాతీయ కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం Mission కర్మయోగిని చేపట్టింది. దీని ఉద్దేశ్యం ఏమిటంటే? భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని తీర్చిదిద్దుతూ వారి సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు అధునాతనమైన హంగులతో వారి సత్తాన్ని పెంపొందించడం చేస్తారు. పారదర్శకత, సాంకేతికతల మేళవింపుతో నిర్మాణాత్మకంగా, నవ్య ఆవిష్కరణల దిశగా వారిని సాన పెట్టడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది.
Mission Karmayogi ఏర్పాటుకు కారణాలు!
ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడానికి ఉద్యోగ వ్యవస్థే కీలకం అని అందరికీ తెలిసిందే. కావున ప్రభుత్వ ఉద్యోగుల్లో నిర్లక్ష్యం, అలసత్వం తొలగించడానికి ఈ Mission Karmayogi తీసుకువచ్చారు. ప్రస్తుతం bureaucracy ఎదుర్కొంటున్న రాజకీయ జోక్యం, ప్రమోషన్లలో అసమర్థత వంటి సవాళ్లను అధిగమించడానికి దోహద పడుతుంది.
PM- HR కౌన్సిల్ : శిక్షణ కార్యక్రమం పర్యవేక్షణకు ప్రధానమంత్రి మానవ వనరుల మండలి పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రధాని(PM) అధ్యక్షుడుగా ఉంటారు. కేంద్ర cabinet మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, విభిన్న రంగాల దేశ, విదేశ నిపుణులు, సివిల్ సర్వీసెస్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో సమన్వయ విభాగం ఉంటుంది. ఇది వ్యూహాత్మక దిశానిర్థేశం చేస్తుంది.
Capacity building కమిషన్ : మిషన్ కర్మయోగి నిర్వహణ కోసం స్వయం ప్రతిపత్తి తో పనిచేసే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు. ఇది ప్రామాణిక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. దేశంలోని అన్ని శిక్షణ సంస్థలు దీని పరిధిలోకి వస్తాయి. వాటి ఆర్థిక, మానవ వనరులను ఇదే పర్యవేక్షిస్తుంది. అభివృద్ధి ఆకాంక్షలు లక్ష్యాలు జాతీయ ప్రాధాన్యాలు, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఒకే విధానం అనుసరించేలా మార్గనిర్దేశం చేస్తుంది.


SPV: డిజిటల్ వనరుల నిర్వహణకు ఆన్లైన్ శిక్షణకు కంపెనీల చట్టం కింద ఏర్పాటయ్యే ఎస్పీవీ ద్వారా ప్రపంచంలో అత్యుత్తమ స్థాయి కంటెంట్ సేకరించి ప్రభుత్వంలో అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వానికి మరియు ప్రజలకి మధ్య దూరం తగ్గిస్తూ పౌరుల జీవన సౌలభ్యం మిషన్ కర్మయోగి యొక్క అంతిమ లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం, సివిల్ సర్వెంట్లు సమన్వయం, పారదర్శకతతో పనిచేయడం అవసరం.