manspreading meaning మగవాళ్ల అతిపై ఎప్పటికప్పుడు కొత్త పదాలు అమెరికా మహిళలు సృష్టిస్తూనే ఉన్నారంట. పురుషాధిక్యత ప్రదర్శించే మగవాళ్ల ప్రవర్తనపై అక్షరాలా మాటల యుద్ధం చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట అక్కడ స్త్రీ వాదులు సృష్టించిన మాన్స్ప్లెయినింగ్ అనే పదాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ స్వీకరించిందట. నీకేం తెలియదు ఊర్కో.. అంటూ చీటికీ మాటికి ఉచిత సలహాలిచ్చే మగవాళ్ల తీరును వ్యంగ్యంగా చెప్పే పదం ఇది. తాజాగా మరో రెండు పదాలు అక్కడ సంచలనం సృష్టస్తున్నాయిట. మ్యాన్స్ప్రెడింగ్( manspreading) అమెరికా ప్రజా రవాణా(American Public Transport)కి చెందిన బస్సులూ, మెట్రో రైళ్లలో మహిళలకంటూ ప్రత్యేకంగీ సీట్లుండవట. అక్కడందరూ కలగలిసి కూర్చోవాల్సిందే. అయితే కొందరు మగవాళ్లూ సీట్లో కూర్చున్నాక తమ పక్కన ఎవరూ కూర్చోలేని విధంగా కాళ్లు బార్లా చాపుకుంటారు. అడిగినా మాట వినరు. అలాంటి తీరును ఎండగట్టేదే మ్యాన్స్ప్రెడింగ్(manspreading). ఈ మా ట అన్ని పత్రికల్లోనూ వ్యాపించడంతో అమెరికాలో మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ (ఎంటీఎ) రంగంలోకి దిగింది.

మగవాళ్లు కాస్త ఒద్దిగ్గా కూర్చోవాలని ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం మొదలు పెట్టింది ఎంటీఎ. ఈ సంచలనం తగ్గక ముందే మ్యాన్స్లామింగ్(manslamming) అనే కొత్త పదం పుట్టుకొచ్చింది. బాగా రద్దీ ప్రాంతంలో మీరు నడుస్తున్నారనుకుందాం. మీకు ఎదురుగా ఎవరో ఓ వ్యక్తి వచ్చాడు. అతను తప్పుకోలేదు. మీకు తప్పుకునే వ్యవధి లేదు. ఆ వ్యక్తి తాను తప్పుకోకుండా మిమ్మల్ని ఢీకొని, అలా జరిగినందుకు కనీసం సారీ చెప్పకుండా వెళ్లాడనుకోండి అదే మ్యాన్స్లామింగ్. ఈ పదం పుట్టుక వెనుక కొంత నేపథ్యమూ ఉంది. నగర వీధుల్లో ఎంతవరకూ మహిళల్ని గౌరవిస్తున్నారో తెలుసుకుందామని.. బెత్ బ్రెస్మా కార్మిక సంఘం నేత న్యూయార్క్(New York) నగరంలోని రద్దీ ప్రాంతాల్లో నడవడం మొదలు పెట్టారంట. 90 శాతం మంది మగవారు ఇలా ఢీకొట్టి… అసలేమీ జరగనట్టే వెళ్లిపోయారట. దీని వెనుకున్న పురుషాధిక్యతను విశ్లేషిస్తూ జెస్సికా రాయ్ అనే పాత్రికేయురాలు అప్పట్లో మ్యాన్స్లామింగ్(manslamming) అనే ఈ కొత్త పద ప్రయోగం చేశారట.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి