Janapadam : భారతదేశంలో జానపదం ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. ఇప్పటికీ కూడా జానపదం రూపంలో అనేక పాటలు యూట్యూబ్‌లో వచ్చాయి. నిత్యం రోజూ ఏదో ఒకటి జానపద పాట వింటూనే ఉంటున్నాం. కొన్ని శతాబ్ధాల క్రితం ఉన్న ఈ జానపద సంస్కృతి ఇప్పటికీ ఆచరణలో ఉన్నది.
Janapadam : జానపద(Janapadam) సంగీతం భారత దేశంలోని గ్రామీణ ప్రజలు మొట్టమొదటిగా ఉపయోగించిన సంగీతం. ఇంగ్లీష్‌లో దీనిని Folk Music అని అంటారు. పల్లె ప్రజలకు జానపదులు అంటే ఇష్టం. వారు ఎక్కువుగా జానపదం పాటలే పాడుతుంటారు. భారతదేశంలో జానపద కొన్ని శతాబ్ధాల నుంచి ప్రత్యేక స్థానముంది. ఈ జానపద సంగీతం గ్రామీణ పల్లె ప్రజల హృదయాల్లో నుంచి అప్పటికప్పుడు పుట్టిన స్వేచ్ఛ గీతం. దీనికి నియమనిబంధనలు లేవు. ఇది ఎవరైనా పాడవచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆధునిక శాస్త్రీయ సంగీతం అభివృద్ధి చెందిన రోజుల్లో వ్యవసాయం లాంటి శారీరక శ్రమ చేసే రైతుల కుటుంబాలు తమ శ్రమలో ఉపశమనం పొందేందుకు రకరకాలుగా జానపద పాటలు పాడేవారు. పొలం గట్లుపైన, నాట్లే వేసే సమయంలోనూ, పంట నూర్చే సమయంలో, కోత కోసే సమయంలో అప్పటికప్పుడు పదాలను అల్లి పాట రూపంలో పాడేవారు.
ఇప్పుడు వచ్చే ఎటువంటి అర్థం పర్థం లేని పాటల్లా కాకుండా, ఒక లయబద్ధంగా జానపద పాటలు ఉండేవి. ఈ పాటల లక్ష్యం కేవలం వినోదం, ఉల్లాసం అందించడమే కాదు సాటి మనిషిలో మానవీయ కోణాన్ని, సంస్కారాన్ని ప్రతిభను కనపర్చేది.ఈ పాటల్లో ప్రత్యేక లయ అనే ఏమీ ఉండదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు రాగానుసారంగా పాట పాడేవారు. పాట సాగుతుండగానే అందులో లయ, రాగం వినిపించేవి. ఈ జానపద పాటల్లో పండుగల పాటలు, పశువుల పాటలు, వాన పాటలు, పడవ పాటలు, గొబ్బిళ్ల పాటలు ఇలా వారికి ఆనందాన్ని కలిగించే ప్రతి సందర్భంలోనూ వారి భాషల్లో పాడుకునేవారు. ఈ జానపదంలో ప్రకృతి సజీవ త్యాగం, పూల గుబాళింపును అనుసంధానిస్తూ బతుకమ్మను కేంద్రంగా చేసుకుని కొన్ని వేల పాటలు వచ్చాయి.
జానపద పాటలు, కళలు ద్వారా పల్లెల్లో ఉండే ప్రజలకు ఆహారం, నీరు విలువ తెలుసుకునేవారు. వాటిని పాట రూపంలో తలుచుకుంటూ ఆరాధించేవారు. పల్లెల్లో ఈ పాటలు పాడుకుంటూ సన్నిహిత సంబంధాలను పెంచుకునేవారు.తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలం నుండి ఉన్నాయి. ఈ జానపద గీతాలలో కొన్నిసార్లు మంచి ఛందస్సు కూడా ఉంటుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ఆ కాలంలో ప్రసిద్ధమైన జానపద బాణీలలో చాలా పదములు రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒగ్గు కథ, బుర్రకథ, కోలాటం, తొలుబొమ్మలాట, తప్పెటగుళ్లు, శారదగాండ్రు, చెంచుబాగోతం, కొమ్ముకథ, వీధినాటకం, పిచ్చుకకుంట, వీరముష్టి, దొమ్మరాట, కొఱవంజి, గొల్లసుద్దులు, జంగం కథ, జక్కుల కథ, కాటిపాపల కథ, దాసరి కథ, చెక్క భజన, యక్షగానం, పులివేషాలను తెలుగువారి జానపద కళారూపాలు అనే పుస్తకంలో మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి విపులంగా చర్చించారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!