IPC 499 | ఒక వ్యక్తిని మాటల ద్వారా గానీ, రచనల ద్వారా గానీ, సంజ్ననల ద్వాగా గానీ, ప్రచురుణల ద్వారా గానీ దూషించినా, వ్యంగమాడుతూ వ్యాఖ్యలు చేసినా, పరుష పదజాలం వాడినా కూడా అది పరువు నష్టం కిందకు వస్తుంది. పబ్లిక్‌గా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడినప్పుడు సదరు వ్యక్తి పరువు ప్రతిష్టతలు పోతాయి కాబట్టి ఇది పరువు నష్టం(Defamation) కిందకు వస్తుంది. పరువు నష్టం కేసు(IPC 499)లో నాలుగు ముఖ్య అంశాలు ఉంటాయి.
1.ఒక వ్యక్తి అంతకు ముందే చనిపోయి ఉండవచ్చు. చనిపోయిన వ్యక్తి గురించి దుర్బాషలాడటం, బహిరంగంగా అతని గురించి సమాజంలో చెడ్డగా చెప్పడం లాంటివి చేశారనుకుందాం. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి పరువు, ప్రతిష్టతలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి తరపున వారి కుటుంబీకులు సదరు వ్యక్తిపై పరువు నష్టం కేసు వేయవచ్చు. 2. కొందరు వ్యక్తులు గ్రూపుగా లేదా ఒక సమూహంగా ఏర్పడి ఒక సంస్థను ఏర్పాటు చేశారనుకుందాం. ఆ సంస్థపై మీడియాలో నిజనిజాలు తెలియకుండా ఇష్టారీతిగా చెడు ప్రచురణాలు చేశారనుకోండి. ఆ మీడియా సంస్థపైన, వార్తా కథనం రాసిన సదరు విలేకరిపైనా కూడా పరువు నష్టం కేసులు వేయవచ్చు. ఇప్పటికే ఇలాంటివి మనం చాలా సార్లు చూసి ఉన్నాం.
3.ఒక వ్యక్తి గురించి వ్యంగ్యంగా మాట్లాడటం, వ్యంగ్య రచన చేయకూడదు. ఇలా వ్యంగంగా మాట్లాడి ఎదుట వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టతలు తీసి వారికి ఇబ్బంది కలిగించారనుకోండి. అలాంటి వ్యాఖ్యలు చేసే వారిపైనా కూడా ఎదుట వ్యక్తి పరువు నష్టం కింద కేసు పెట్టే అవకాశం ఉంది. 4. ఒక వ్యక్తి గురించి ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా ఇతరులలో వారి యొక్క మర్యాద తగ్గించడం, వారిని అవమానం కల్పించడం లాంటివి చేసినా కూడా వారిపై ఈ సెక్షన్ కింద యాక్షన్ తీసుకోవచ్చు. అయితే ప్రతి వ్యక్తికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అయినప్పటికీ దాని పరిమితి మించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకునే క్రమంలో ఈ సెక్షన్ తోడ్పడుతుంది.
పరువు నష్టం దావా ఎలా వేయాలి?
పరువు నష్టం దావా వేయాలంటే సంబంధిత సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ పరువు నష్టం దావా వేయడం కాస్త ఖర్చుతో కూడుకున్న పని. పరువు నష్టం దావా అనేది ఎవరైతే వేయనున్నారో ఆ వ్యక్తి కి సమాజంలో పేరు, పలుకుపడి పైన ఆధారపడి ఉంటుంది. అతని విలువ కోటి రూపాయలు అయితే కోటి పరువు నష్టం దావా వేయవచ్చు. కానీ 10% మాత్రం కోర్టుకు చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ అతను పరువు నష్టం దావా వేసిన వ్యక్తి దగ్గర ఆధారాలు ఉండి, రుజువు చేస్తే, దావా వేసిన వ్యక్తి ఓడిపోతే కోర్టుకు చెల్లించిన డబ్బులు తిరిగి రావు. సదరు వ్యక్తి ఎటువంటి ఆధారాలు చూపించ లేకపోతే పరువు నష్టం దావా వేసిన వ్యక్తి కోర్టులో గెలిస్తే మాత్రం అతనికి నష్టం మొత్తం విలువ వస్తుంది.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్