Initial Public Offering ipo పబ్లిక్ అవడం వల్ల, కంపెనీలకు ప్రాజెక్టులను స్థాపించడానికి, లేదా నవీకరణ, విస్తారణ చేయడానికి, లేదా కొన్ని సమయాలలో మూలధనం సేకరించడానికి లేదా అప్పులను తీర్చడానికి అవకాశం కలుగుతుంది. దీనిని మూలధనం యొక్క కొత్త ఇష్యూ అంటారు. ఈ ఇష్యూ యొక్క రాబడులు కంపెనీకి వెళ్తాయి. కంపెనీలో ఉన్న మూలధన పెట్టుబడిదారులు కంపెనీ షేర్ హోల్డింగు నుండి పూర్తిగా లేదా పాక్షికంగా నిష్క్రమించడం కోసం లేదా పెట్టుబడిదారులు వాళ్ల వాటాలను తగ్గించుకోవడం కోసం ఒక మార్గం ఏర్పరచుకోవడానికి, కంపెనీలు పబ్లిక్ అవుతాయి. దీనిని అమ్మక ప్రతిపాదన అంటారు. దీనిలో వచ్చిన లాభాలు షేర్ హోల్డరులకు వెళ్లతాయి. కానీ కంపెనీకి (Initial Public Offering ipo)కాదు.
ఐ.పి.ఓ కొరకు నిబంధనలు
పబ్లిక్‌లో పాల్గొనడం వల్ల, అటువంటి కంపెనీలు, సరియైన మరియు సముచితమైన చర్యలు తీసుకుంటున్నాయా లేదా అని సెబి పరిశీలిస్తుంది. ముఖ్యంగా చిన్న వాటాదారుల విషయంలో అటువంటి కంపెనీలకు మంచి బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఉండాలి. అందులో కనీసం సగం సభ్యులు వ్యవస్థాపకులు లేదా కంపెనీకి నిబంధించిన వాళ్ళై ఉండాలి. అంతేకాకుండ, కంపెనీలు జాబితాలో చేర్చడానికి ఉన్న ఒప్పందాలను పాటించాలి. అంటే, ఇతర విషయాలతో పాటు, నిర్ణయించిన విధంగా నిర్థిష్టమైన నిబంధనలు అన్ని పాటించాలి.


ధర నిర్ణయించడంలో ఏదైనా నిర్భంధాలు ఉన్నాయా?
1992 నుండి కంపెనీలు తమ ఇష్యూలకు ధర నిర్ణయించడంలో స్వేచ్ఛ ఇవ్వబడింది. ధర నిర్ణయంలో సెబికి ఎటువంటి పాత్ర లేదు. అందువల్ల, నిర్జీత ధర ఇష్యూలలో ఏకైక ధరను మరియు బుక్బిల్డింగ్ ఇష్యూలలో ధర బ్యాండ్‌ను కంపెనీనే నిర్ణయిస్తుంది. ఐతే ధర నిర్ణయం వెనుక ఉన్న పూర్తి న్యాయమైన కారణాలను ఆఫర్ పత్రములో కంపెనీలు వెల్లడించాలి. ఇష్యూ ధర ఏ ఆధారము మీద నిర్ణయించబడిందో ఆఫర్ పత్రములో వెల్లడించాలి. ఇష్యూ ధర నిర్ణయానికి గల అన్ని లెక్కలను వివరించాలి.