healthy home foodభోజనవేళకు ఖచ్చితంగా భోజనం చేయడం మరచిపోవద్దు వేళకు తినకపోతే శక్తి తగ్గి నరాలు నిస్సత్తువగా మారతాయి. ఆపిల్, జామ, బంగాళదుంప, తోటకూర, క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే ఎంత నిద్ర పట్టనివారికైనా నిద్ర పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు తక్కువుగా ఉండే పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు ఆకలివేస్తే దోసకాయలు, కేరెట్ తినండి. ఉప్పు తక్కువుగా ఉండే ఆహార పదార్థాలకు ఎక్కువుగా(healthy home food) ప్రాధాన్యమివ్వండి.
ప్రతిరోజు ఒక కప్పు ఉడకబెట్టిన బీన్స్ లేదా పప్పు ధాన్యాలు ఖచ్చితంగా తీసుకోండి. ఖర్జూరంలో మలబద్దకం నివారణ గుణమే కాకుండా యవ్వనాన్ని రక్షించి మంచి శక్తినిస్తుంది. ఎలర్జీ వల్ల శరీరంపై దుద్దుర్లు ఏర్పడితే ధనియాల కషాయం తాగుతుంటే క్రమంగా తగ్గిపోతుంది. మధుమేహంతో బాధపడేవారు నిత్య ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే మేలు. వెల్లుల్లి గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.
దానిమ్మకాయపై తోలును నీళ్లలో అరగదీసి కొద్దిగా మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిపి తాగితే విరోచనాలు తగ్గుతాయి. నిమ్మ ఆకులను రెండు కప్పుల నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో పుక్కిలిస్కే పంటినొప్పి తగ్గిపోతుంది. బాడీ పెయిన్స్ ఉండే వేడి నీటిలో జామాయిల్ ఆకులను వేసి 2,3 నిమిషాలు ఉంచి ఆ నీటితో స్నానం చేయాలి. అరగ్లాసు తులసి రసంలో ఒక టీ స్పూను తేనె కలుపుకుని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్లు కరుగుతాయి. రోజుకోసారి చొప్పున ఆరు నెలలు తప్పకుండా తాగాలి.


ఖర్జూర పండు గుజ్జు తేనెలో కలిపి చంటి పిల్లలకు తినిపిస్తే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది. పళ్లు వచ్చే సమయంలో తినిపిస్తే చిగుళ్లు గట్టిపడతాయి. తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువుగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటిని సమపాళ్లలో తీసుకోవాలి. నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం, పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!