Core Web Vitals Assessment: Firewall security: మీ ఫోన్‌కు ఇది అవ‌స‌ర‌మా? తెలుసుకోండి!

Firewall security: మీ ఫోన్‌కు ఇది అవ‌స‌ర‌మా? తెలుసుకోండి!

Firewall security: డెస్క్‌టాప్ కంప్యూట‌ర్ నుండి అంద‌రి దృష్టి మెల్ల‌గా మొబైల్ వైపు మ‌ళ్లుతోంది. పీసీల్లో కేవ‌లం యాంటీవైర‌స్ లే కాకుండా Firewall security స‌దుపాయంతో కూడిన ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ సూట్ల‌ని గ‌త కొన్నేళ్లుగా ప్ర‌తీ ఒక్క‌రూ వాడ‌టం మొద‌లు పెట్టారు.

అయితే నిన్న మొన్న‌టి వ‌ర‌కు మొబైల్ యూజ‌ర్లు స‌రైన యాంటీవైర‌స్ సాఫ్ట్‌వేర్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోకుండా గ‌డుపుతూ వ‌స్తున్న త‌రుణంలో తాజాగా యాంటీవైర‌స్‌నై వాడుతున్నారు. గానీ Firewall కూడా వాడొచ్చ‌న్న విష‌యం తెలిసిన వారు చాలా త‌క్కువ. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఫైర్‌వాల్ ప‌లు ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

ఫైర్‌వాల్ ఏం చేస్తుంది?

మ‌నం ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకునే ర‌క‌ర‌కాల యాప్స్ విచ్ఛ‌ల‌విడిగా ఇంట‌ర్నెట్‌కి క‌నెక్ట్ అయి త‌మ‌కు అవ‌స‌రం అయిన‌దీ, అవ‌స‌రం లేనిదీ డేటాని స‌ర్వ‌ర్‌కి చేర‌వేస్తుంటాయి. ఈ నేప‌థ్యంలో మ‌న ఫోన్ల‌లో ఇన్‌స్టాల్ అయిన వాటిలో అనుమాన‌స్ప‌దం అయిన యాప్స్‌కి ఇంట‌ర్నెట్‌ని తాత్కాలికంగా నిలుపుద‌ల చేసుకోవాడానికి ఫైర్‌వాల్ ఫ్రోగ్రాములు వీలు క‌ల్పిస్తుంటాయి.

వాస్త‌వానికి ఆండ్రాయిడ్‌లోని hosts ఫైల్‌లో మార్పులు చెయ్య‌డం ద్వారా కొన్ని యాప్స్ నెట్‌ని వాడుకోలేని విధంగా ఈ ఫైర్‌వాల్ అడ్డుకుంటూ ఉంటుంది. ఈ hosts ఫైల్‌లో మార్పులు చేయాలంటే ఫోన్‌ని త‌ప్ప‌నిస‌రిగా రూట్ చేసి ఉండాలి. అయితే రూట్ చెయ్య‌క‌పోయినా ప‌నిచేసే ప్రోగ్రాములూ ఉన్నాయి.

Net Guard

ఫోన్‌ని రూట్ చెయ్యాల‌సిన ప‌నిలేకుండా ప‌నిచేసే ఆండ్రాయిడ్ ఫైర్ వాల్ ప్రోగ్రాము ల్లో Net Guard, NoRoot ఫైర్ వాల్ అనేవి అతి ముఖ్య‌మైన‌వి. ఈ ప్రోగ్రామ్ తాత్కాలికంగా ఫోన్లోనే ఓ VPN క‌నెక్ష‌న్‌ని క్రియేట్ చేయ‌డం వ‌ల్ల ప్రోగ్రాముల‌కు ఇంట‌ర్నెట్ చెయ్య‌డం ద్వారా ప్రోగ్రాముల‌కు ఇంట‌ర్నెట్ యాక్సెస్‌ని అడ్డుకుంటూ ఉంటుంది.

ఈ యాప్‌ని ఓపెన్ చేసిన వెంట‌నే అన్ని యాప్స్‌కీ ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ డీఫాల్డ్‌గా నిలిపి వేయ‌బ‌డి ఉంటుంది. అన్నింటినీ ఆన్ చేసి, మీరు ఏ యాప్‌కైతే నెట్ ఆపేయాల‌నుకుంటున్నారో ఆ యాప్ ప‌క్క‌నే కన్పించే Cellular, Wifi ఆప్ష‌న్ల‌లో కావాల్సిన దాన్ని tap చేస్తే అది రెడ్ క‌ల‌ర్ లోకి మారుతుంది.

అంటే ఇక నెట్ ఆ యాప్‌కి అంద‌దు అన్న‌మాట‌. ఇదే విధంగా ఇత‌ర మోడ్‌ల‌లోకి అది మారుతుంది. ఫోన్‌ని వాడేట‌ప్పుడు మాత్ర‌మే నెట్ వెళ్లేలాగూ సెట్ చేసుకోవ‌చ్చు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *