Charge Sheet in Telugu | మనం పోలీసు స్టేషన్లో ఛార్జిషీట్ పేరును ఎక్కువుగా వింటుంటాం కదా!. కేసు ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయ్యింది… ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జిషీట్ చేశారు అని… పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారి నోట వినే పదం ఇది. ఛార్జిషీట్ అంటే ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ కేసు విషయంలో నిజంగా ఎవరు చేశారు? అనే కోణంలో ఆలోచించి, దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి బ్రీఫ్ గా ఫైల్ తయారు చేసేదాన్నే ఛార్జిషీట్ అంటారు. ఇది CrPC Section 173 సెక్షన్ కిందీ ఈ ఛార్జిషీట్‌ను ఫైల్ చేయడం (Charge Sheet in Telugu) జరుగుతుంది.
ఈ ఛార్జిషీట్ మామూలు కేసులే కాకుండా, క్రిమినెల్ కేసుల్లోనూ ఛార్జిషీట్ ఫైలు చేయడం జరుగుతుంది. ఈ ఛార్జిషీట్‌కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్(I.O) ఎవరైతే ఉన్నారో వారు ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు దానికి సంబంధిన ఛార్జిషీటులో కేసు వివరాలు, విట్నెస్ల పేర్లు, అదే విధంగా కేసుకు సంబంధించి ఎక్కడ జరిగింది, ఏ కోణంలో జరిగిందో వీలైతే ఒక స్కెచ్ గానీ, ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధారాలు గానీ ఇవ్వన్నీ కూడా సేకరిస్తారు ఈ ఛార్జిషీట్ లో. ఇలా సేకరించిన తర్వాత ఎవరైతే విట్నెస్లు ఉన్నారో, వారి వద్ద నుండి 161 స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఈ నేరం జరిగింది అనే వివరాలు సేకరించి ఈ ఛార్జిషీట్లో పొందు పరుస్తారు.
ఛార్జిషీట్‌కు నిర్థిష్టమైన సమయం అంటూ ఏమీ లేదు కానీ, సుమారుగా 19 రోజుల్లో ఛార్జిషీట్ చేయాలని కాల వ్యవధి ఉంటుంది. ఛార్జిషీట్ ఫైల్ అయిన తర్వాత ఇక కేసు మూతపడినట్టు కాదు. కావాలంటే అడిషనల్ ఛార్జిషీట్ కూడా ఇన్వెస్ట్‌గేషన్ ఆఫీసర్ వేసే అవకాశం ఉంటుంది. ఛార్జీషీట్ ఇన్వెస్ట్‌గేషన్ ఆఫీసర్ తనంతట తాను తయారు చేసే అవకాశం ఉండదు. కేసు నమోదు అయిన తర్వాత విచారణలో నిజనిజాలు తేలిన తర్వాత ఛార్జిషీట్ తయారు అవుతుంది. ఈ ఛార్జిషీట్‌ను చాలా క్లియర్‌గా ఫైల్ చేయాలి. ఛార్జిషీట్లో ఉన్న కాలమ్స్‌ను వాటికి సంబంధించిన సరైన వివరాలతో నింపాల్సి ఉంటుంది.

ఒక వేళ ఛార్జిషీటు దాఖలు చేసే స్థానంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఒక ఎస్సై ఉంటే, వారు అతను పైన ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఒక వేళ కేసు తీవ్రత ఎక్కువుగా ఉండి, పెద్ద కేసులు అయితే లీగల్ అడ్వజర్ సలహాలు కూడా తీసుకోవచ్చు. అదే విధంగా ఒక కేసు విషయంలో ఛార్జిషీట్ ఫైల్ అయిన తర్వాత అందులో మీ పేరు నేరస్తుల కింద నమోదు అయిన తర్వాత, ఇన్వెస్టిగేషన్లో కేసుకు మీకు ఎలాంటి సంబంధం లేకపోతే మీ పేరు తొలగించే అధికారం ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉంటుంది. అదే విధంగా కొత్త కేసులో ఉండి విచారణలో వారు నిర్థారణ అయితే వారి పేర్లు నమోదు చేయవచ్చు. ఛార్జిషీట్ ఫైల్ చేయాల్సింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రమే. ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి అధికారం లేదు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!