what is capital budgeting: మీరు స్వంతంగా ఐస్క్రీం వ్యాపారం ప్రారంభించాలి అంటే దానికి మూలధనం (కాపిటల్) కావాలి. మీరు ఆ మూలధనాన్ని వ్యాపారం ప్రారంభించడానికి కావాల్సిన బిల్డింగ్, యంత్ర పరికరాలు, ముడిసరుకు కొరకు వినియోగించి వ్యాపారం ప్రారంభిస్తారు ఒక వేళ మీ దగ్గర సరిపడా మూలధనం లేనప్పుడు దానిని సమకూర్చుకోవడానికి మీరు రెండు మార్గాలు కలవు(what is capital budgeting).
మొదటిది మీరు బ్యాంకుల నుండి లేదా ఇతర మార్గాల ద్వారా అప్పు తీసుకోవాలి. ఐతే మీరు ఈ విధంగా అప్పు తీసుకోవడంతో మీరు ప్రతి నెల వడ్డీ చెల్లించడంతో పాటు తీసుకున్న అప్పు కూడా చెల్లించాలి. ఇక రెండవది తన సంస్థలో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా ఆసక్తి కలిగిన ప్రజల నుండి కావాల్సిన ధనాన్ని సేకరించడం వల్ల కంపెనీ ప్రారంభించడానికి కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుకోవడం. ఈ విధంగా సేకరించిన ధనంతో మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఈ విధంగా వాటా (షేర్) ఇవ్వడం వల్ల కలిగే లాభాలు ఏమిటంటే ఈ విధంగా వాటా ఇవ్వడం వలన కంపెనీ తనకు కావాల్సిన మూలధనం కంటె అధిక ధనాన్ని సమకూర్చుకోవడం, అప్పుల వాళ్లకు లేదా బ్యాంకులకు చెల్లించే విధంగా ప్రతి నెలా చెల్లిం చాల్సిన వడ్డీ భారం దీని వలన ఉండదు. సేకరించిన అసలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.వాటా ఇవ్వడం వల్ల కలిగే నష్టాలేమిటంటే.. ప్రధాన యాజమాన్యంతో పాటు వాటాదారులు కూడా యాజమాన్య హక్కును కలిగి ఉంటారు. వాటాదారులు సంస్థ కార్యకలాపాలను ప్రభావితం చేసి హక్కును కలిగి ఉంటారు.

- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి