best fruit for lungs రక్తహీనతతో బాధపడేవారికి తరుచూ నీరసం, నిస్సత్తువతో ఇబ్బంది పడేవారికీ బీట్‌రూట్ మంచి మందుగా పనిచేస్తుందన్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఈ బీట్‌రూట్ కొన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యల నుంచి కాపాడుతుందన్న విషయం ఇటీవల బ్రిటన్‌లో నిర్వహించిన పరిశోదనలో వెల్లడైంది. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారికి బీట్‌రూట్ మంచి మందుగా ఉపయోపడుతుంది అంటున్నారు(best fruit for lungs) బ్రిటన్ పరిశోధకులు.
ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఓ గ్లాసు బీట్‌రూట్(beetroot)రసం తాగినట్టయితే త్వరగా ఉపశమనం లభిస్తుందని వారు చెబుతున్నారు. బీట్‌రూట్‌లోని విటమిన్లు రక్తానికి త్వరితగతిన ఆక్సిజన్‌ను అందిస్తాయని అంటున్నారు. ఊపిరితిత్తులతో బాధపడేవారు తరుచూ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారనీ, బీట్‌రూట్ రసం తీసుకోవడం వల్ల వీటినుంచి కూడా తప్పించుకోవచ్చనీ స్పష్టం చేస్తున్నారు. ఊపిరితిత్తులతో బాధపడే కొందరికి ప్రతిరోజూ ఓ గ్లాసు బీట్ రూట్ (beetroot juice)రసం కొన్ని నెలల పాటు ఇచ్చారు. అనంతరం వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. బీట్‌రూట్ రసం తాగిన వారికి శ్వాసకోశ ప్రక్రియ సక్రమంగా జరుగుతున్న విషయాన్ని గుర్తించారు. బీట్‌రూట్‌ను రసంలాగానే కాకుండా ముక్కలుగా కూడా తీసుకున్నా మంచి ఫలితాన్నే పొందుతారని వారు చెబుతున్నారు.
Yoga for Lungs
తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు ఉపశమనం పొందడానికి యోగా చక్కటి చవకైన మార్గమని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. 12 వారాల శిక్షణ తీసుకున్నాక, సీఓపీడీ తీవ్రమైన ఊపిరితిత్తల వ్యాధితో బాధపడేవారిలో పనితీరు మెరుగుపడిందని, శ్వాస ఇబ్బందులు చాలా వరకు తగ్గాయని గుర్తించారు.

ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు షికాగోలో జరిగిన ఓ సదస్సులో తమ అధ్యయన వివరాలు వెల్లడించారు. వ్యాధిని పూర్తిగా నయం చేయలేకపోయినప్పటికీ వారికి శ్వాసలో ఎదురయ్యే సమస్యలను యోగా(Yoga for Lungs)గణనీయంగా తగ్గిస్తుందని వైద్యులు ధీమా వ్యక్తం చేశారు. 29 మంది వ్యాధిగ్రస్థులను ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, శవాసనం తదితర ప్రక్రియలు చేయించడం ద్వారా సత్ఫలితాలు సాధించినట్టు అధ్యయనకర్తల్లో ఒకరైన రణ్‌దీప్ గులేరియా తెలిపారు.