What is Bail | ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా కేసులో అరెస్టయితే వారిని నిందితులుగా భావించి పోలీసులు కోర్టులో హాజరు పరుస్తారు. సదరు వ్యక్తులను న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీ(రిమాండ్) కు తరలించడం పరిపాటి. రిమాండ్ నుంచి నిందితులకు మినహాయింపు ఇచ్చే సదుపాయాలన్నే బెయిల్ అంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 436,437,438ని అనుసరించి నిందితులను కోర్టు నుంచి బెయిల్ ఇస్తారు. బెయి ల్లో నాలుగు రకాలున్నాయి. అవి బెయిలబుల్ బెయిల్, నాన్ బెయిల్, స్టేషన్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్.
What is Bail | బెయిలబుల్ బెయిల్
బెయిలబుల్ బెయిల్ అంటే నేరం చేసిన వ్యక్తికి స్థానిక న్యాయస్థానాల్లో సులభంగా దొరికే బెయిల్‌గా పేర్కొన వచ్చు. ఎవరినైనా కొట్టి గాయపర్చడం, వరకట్నం వేధింపులు, చిన్నపాటి తగవులు, ప్రమాదాలు, మహిలలపై వేధింపులు, జూదాలు, ఆస్తి తగాదాల వంటి నేరాల్లో నిందితులకు బెయిలబుల్ బెయిల్ వస్తుంది. ఈ నేరాల కింద అరెస్టయిన వ్యక్తులు న్యాయవాది సహాయంతో కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. దానిపై కోర్టులో వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి సంతృప్తి చెందితే బెయిల్ మంజూరు చేస్తారు.
ఇద్దరు జామీనుదారుల హామీపై బెయిల్ ఇస్తారు. జామీనుదారులు తమ ఇల్లు, స్థలం, పొలం వంటి ఆస్తులను హామీగా పెట్టాల్సి ఉంటుంది. నిందితుడు కోర్టు వాయిదాలకు హాజరు కాకపోతే, జామీను దారులు బెయిల్ ఇచ్చే సమయంలో న్యాయమూర్తి విధించే పూచీకత్తు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
నాన్ బెయిల్(non bailable) అంటే?
బెయిల్ ఇవ్వదగని నేరాల్లో అరెస్టై, రిమాండ్‌లో ఉన్న నిందితులకు స్థానిక న్యాయస్థానాల్లో బెయిల్ దొరక్కపో వడమే నాన్ బెయిల్ అంటారు. హత్య, హత్యాయత్నం, వరకట్నం వేధింపుల్లో చనిపోవడం, దోపిడీ, చంపి దోచుకోవడం, దొంగతనం, మోసం వంటి నేరాలు నాన్‌బెయిల్ కిందకు వస్తాయి. ఈ తరహా నేరాలకు పాల్పడిన నిందితులకు నేర తీవ్రతను బట్టి స్థానిక న్యాయ స్థానాలు, జిల్లా కోర్టులో మాత్రమే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
నిందితులు బెయిల్ వచ్చే వరకూ రిమాండ్‌లో ఉంటారు. నిందితుడు తరపు న్యాయవాదులు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి తమ వాదనలు వినిపిస్తారు. బాధితుడు పెట్టిన కేసు, అతడికి జరిగిన అన్యాయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నిందితునికి షరతులతో కూడిన బెయిల్ ను న్యాయమూర్తి మంజూరు చేస్తారు. ఈ బెయిల్‌కు కూడా ఇద్దరు జామీనుదారులు హామీగా ఉండాలి. ఇల్లు, స్థలం, పొలం వంటి వాటిని హామీగా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
స్టేషన్ బెయిల్ (station bail)అంటే ఏమిటి?
జూదాలు, ప్రమాదాల కేసుల్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు పోలీసు స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేరుగా ఇచ్చే బెయిల్‌ను స్టేషన్ బెయిల్ అంటారు. సీఆర్పీసీ నూతనంగా చేసిన సవరణలు ప్రకారం ఏడు సంవత్సరాలలోపు శిక్షలు పడే నేరాలన్నింటిలోనూ స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చని పేర్కొన్నారు. దొంగతనం, దోపిడీల వంటి తీవ్ర నేరాల్లో నిందితుడు సాక్షులను బెదిరిస్తాడని లేదా తప్పించుకు పోతాడని పోలీసులు భావిస్తే వారికి న్యాయ స్థానాల్లో రిమాండ్ విధిస్తారు. ఈ బెయిల్ పొందిన వారికి పోలీసులు నోటీసులు ఇచ్చి కోర్టుకు హాజరు కావాలని సూచిస్తారు.

ముందస్తు బెయిల్ అంటే?
యాంటిసిపేటరీ(ముందస్తు) బెయిల్ అంటే ఏదైనా నేరం చేసినవారు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచేలోగా అరెస్టు కాకుండా ఉండేందుకు కోర్టు ద్వారా పొందే బెయిల్‌ను ముందస్తు బెయిల్ అంటారు. నేరం చేయడం లేదా నేరంలో ఇరుక్కుని అరెస్టు కావాల్సిన వచ్చిన సమయంలో జామీను దారుల్ని ఏర్పాటు చేసుకుని కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందవచ్చు. అన్ని నేరాల్లో ముందస్తు బెయిల్ రాదు. న్యాయమూర్తి కేసు తీవ్ర తను బట్టి ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటారు. ఒక్కొక్కసారి నిందితుడు పోలీసులకు కానీ, కోర్టులో కానీ లొంగిపోయి, వారి ద్వారా కోర్టుకు హాజరైతే బెయిల్ ఇచ్చే నిబంధనలు కూడా ఉంటాయి.
స్టోమత లేక పోయినా!
ఏదైనా నేరంలో పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచిన తర్వాత రిమాండ్ విధించబడి, బెయిల్ పొందడానికి స్థోమత లేనివారు ప్రభుత్వ న్యాయవాది సహాయంతో కోర్టులో వాదనలు వినిపించి బెయిల్ పొందే అవకాశం ఉంది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!