asthma food: ఆస్థ‌మాకు పీచు బంధం! ప్ర‌యోగాత్మ‌కంగా వెల్ల‌డి!

0
18

asthma food: పండ్లు, కూర‌గాయ‌ల‌ను త‌రుచుగా తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. వీటిల్లోనూ పీచు మ‌ల‌బ‌ద్ధ‌కం, పెద్ద పేగు క్యాన్స‌ర్ వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది. పీచుతో కూడిన ప‌దార్థాలు ఆల‌స్యంగా జీర్ణ‌మ‌వుతాయి. దీంతో ర‌క్తంలోకి గ్లూకోజు కూడా నెమ్మ‌దిగా విడుద‌ల‌వుతోంది. కాబ‌ట్టి మ‌ధుమేహుల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అలాగే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ అతిగా స్పందించ‌డం మూలంగా త‌లెత్తే ఇరిట‌బుల్ బ‌వెల్ సిండ్రోమ్‌(IBS), క్రాన్స్ డిసీజ్ వంటి జ‌బ్బులు ఉధృతం కాంకుండా చూస్తుంది. పీచుతో మ‌రో ప్ర‌యోజ‌న‌మూ ఉంద‌ని కొత్త‌గా గుర్తించారు. ఇది కొన్ని ర‌కాల రోగ‌నిరోధ‌క క‌ణాల ఉత్ప‌త్తిని పెంచుతూ ఆస్థ‌మానూ నివారిస్తున్న‌ట్టు వెల్ల‌డైంది.

పండ్లు, కూర‌గాయ‌ల‌ను ( asthma foo )తిన్న‌ప్పుడు వాటిల్లోని పెక్టిన్ వంటి క‌రిగే పీచును మ‌న పేగుల్లోని బ్యాక్టీరియా గ్ర‌హించి, పులిసేలా చేస్తుంది. అనంత‌రం దాన్ని రోగ‌నిరోధ‌క క‌ణాల‌తో చ‌ర్య జ‌రిపే కొన్ని ర‌కాల కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. ఇలా పేగుల్లో వాపు త‌లెత్త‌కుండా కాపాడుతుంద‌న్న‌మాట‌. అయితే ఈ వాపు నివార‌ణ ప్ర‌క్రియ పేగుల‌కే ప‌రిమితం కావ‌డం లేదు. ర‌క్తం ద్వారా శ‌రీర‌మంతా విస్త‌రిస్తున్న‌ట్టూ ప‌రిశోధ‌కులు గుర్తించారు.

ఈ క్ర‌మంలో ఆస్థ‌మా బారిన ప‌డ‌కుండానూ కాపాడుతున్న‌ట్టు తేల‌డం విశేషం. సాధార‌ణంగా అల‌ర్జీ, ఆస్థ‌మాల్లో ఈస్నోఫిల్స్ అనే రోగ నిరోధ‌క క‌ణాలు, ఇమ్యూనిటీ గ్లోబులిన్‌-ఈ అనే యాంటీబోడీల స్థాయులు పెరుగుతుంటాయి. అయితే పీచు నుంచి పుట్టుకొచ్చే కొవ్వు ఆమ్లాల ప్ర‌భావంతో వీటి మోతాదులు స‌గం వ‌ర‌కు త‌గ్గుతున్న‌ట్టు వెల్ల‌డైంది. అయితే ఇది ఆస్థ‌మా నివార‌ణ‌కు తోడ్ప‌డే స్థాయిలో ఉంటుందో లేదోన‌ని తెలుసుకోవ‌డానికి ప‌రిశోధ‌కులు ప్రొప‌యోనేట్ అనే కొవ్వు ఆమ్లాన్ని ఎలుక‌ల్లో ప్ర‌వేశ‌పెట్టి ప‌రిశీలించారు.

ఆస్థ‌మా నివార‌ణ‌కు తోడ్ప‌డే రోగ‌నిరోధ‌క క‌ణాల ఉత్ప‌త్తి గ‌ణనీయంగా పెర‌గ‌డం గ‌మ‌నార్హం. మ‌నం తీసుకునే ఆహారం ఎముక‌మ‌జ్జ‌లో రోగ నిరోధ‌క క‌ణాల ఉత్ప‌త్తినీ ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ద‌ని బ‌య‌ట‌ప‌డ‌టం ఇదే తొలిసారి అని స్విట్జ‌ర్లాండ్‌లోని లావ్‌సానే విశ్వ‌విద్యాల‌యానికి చెందిన బెంజ‌మిన్ మార్స‌లాండ్ పేర్కొన్నారు. అందువ‌ల్ల పీచు ఎక్కువుగా గ‌ల ఆహారం తీసుకుంటే ఆస్థ‌మా వంటి వాపు సంబంధ జ‌బ్బులు బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు.

Latest Post  Maha Annadanam: ఖ‌మ్మం న‌గ‌రంలో Saibaba mandirలో మ‌హా అన్న‌దాన కార్య‌క్ర‌మం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here