architecture elements: వాస్తు శాస్త్రం వల్ల ప్రయోజనాలు ఏమిటి? | నియమాలు.. నిబంధనలు తెలుసుకోండి!
architecture elements: ఎవరైనా కొత్తగా ఇల్లు కొన్నప్పుడు గానీ, నిర్మించుకున్నప్పుడు గానీ వాస్తు నియమాలను తు.చ తప్పకుండా పాటిస్తుంటారు. వాస్తు చూపుంచుకునేందుకు ప్రత్యేకంగా సిద్ధాంతులను గానీ, వాస్తు శాస్త్రం చదివిన, తెలిసిన వారిని ఆశ్రయిస్తుంటారు. పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు.. అన్న సామెత చందంగా జీవితంలో పది కాలాల పాటు స్థిరంగా ఉండే ఏ పనినైనా కొన్ని నిబంధనలు పాటించి ముందుకు అడుగు వేస్తుంటారు.
ఇక ఇల్లు అవసరం ప్రతి మానవునికి జీవిత కాలం అవసరం కాబట్టి కొన్ని వాస్తు పద్ధతుల విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. ఇందులో భాగంగా వాస్తు శాస్త్రముకు సంబంధించి కొన్ని నిబంధనలు, నియమాలను(architecture elements) నిపుణుల వద్ద సేకరించి మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము.

మనము కొత్తగా ఇల్లు కొనేటప్పుడు వాస్తు విషయాలను తప్పక పాటించాలి. ముఖ్యంగా గాలి, వెలుతురు, నీరు మొదలగునవి మన ఇంటిలోనికి ఆహ్వానించే విధంగా మనము ఇంటి నిర్మాణం చేయాలి. మనము స్థలము కొనుగోలు చేసేటప్పుడు నలుచదరముగా గాని సమకోణ దీర్ఘ చతురస్రాకారముగా ఉన్న స్థలం గాని ఎంపిక చేసుకోవాలి. అది తూర్పు, ఉత్తరం పల్లంగా ఉండాలి. ఈశాన్యం పల్లంగా ఉన్న స్థలం చాలా మంచిది. ఇంటికి చుట్టు ప్రహరీ ఉండుట ఇంకా మంచిది.
ఇల్లు నిర్మాణం చేసే ముందు ఇంటికి చుట్టూ ఖాళీ స్థలం ఉంచుకోవాలి. తూర్పు, ఉత్తరాలలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంచుకోవడం చాలా మంచిది. ఈశాన్యం పెరిగిన స్థలం చాలా మంచిది. ఈశాన్యం ఎంత పెరిగినా అంత మంచిది. ఈశాన్యం కాకుండా ఏ మూల పెరిగినా దానిని తగ్గించే వీలు ఉంటేనే ఆ స్థలాన్ని తీసుకోవాలి.

స్థలము, గృహాలలోని గదులు తూర్పు భాగమునుకు పల్లముగా ఉండాలి. మనము వాడిన నీరు తూర్పునకు గానీ, ఈశాన్యానికి గానీ వెళ్లే విధంగా కట్టుకోవాలి. ఇంటికి ద్వారాలు తూర్పులోనూ, ఉత్తరములోనూ, ఈశాన్యాలలోనూ, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయవ్యంలో ఉంటే మంచిది. ఉత్తర వాయవ్యాలలో, తూర్పు ఆగ్నేయంలో , దక్షిణ నైరుతిలో మరియు పశ్చిమ నైరుతిలో ద్వారాలు ఉండకూడదు.
వంట గది నిర్మాణము ఈశాన్యభాగమున ఉండరాదు. ఈశాన్యం మూల పొయ్యి అసలు ఉండకూడదు. ఇంటిలో పొయ్యి ప్రధానంగా ఆగ్నేయంలో ఉండాలి. అలా వీలు కుదరనప్పుడు నైరుతి భాగములో పెట్టవచ్చు. మిగతా దిశలు పొయ్యికి పనికిరావు. ఇంటిలో ఈశాన్య భాగములో పూజా మందిరం నిర్మించడం చాలా మంచిది.
పడక గది నైరూతి భాగములో కట్టుకోవాలి. దక్షిణం వైపు తలవంచి నిదురించడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తల ఉంచి నిదురించ కూడదు. గొయ్యి లేకుండా ఉండేటటు వంటి మరుగుదొడ్డి ఆగ్నేయంలో నిర్మించుకోవడం చాలా మంచిది. సెప్టిక్ ట్యాంకులు తూర్పు, ఉత్తరలాలో కట్టుకోవచ్చును. లెట్రిన్లో తూర్పు ముఖంగానూ, పడమర ముఖంగానూ కూర్చోకూడదు. ఈ శాన్యములో మరుగుదొడ్డి అసలు ఉండకూడదు.

ఉత్తరం దిశ ఉన్న స్థలం దక్షిణం వైపు ఉన్న స్థలం కన్న పల్లంగా ఉండాలి. గుడిగోపురాల నీడలు ఇంటిపై పడకూడదు. శివాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో ఇళ్లు నిర్మాణం చేయకూదదు. ఇంటికి తూర్పు వైపున, దక్షిణం వైపున ద్వారం గల ఇళ్లు శుభదాయకంగా ఉండాయి. ఆ ఇంటిలో నివసించే వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగును.
ఇంటి నిర్మాణమునకు ముందు పునాది త్రవ్వకం ఈశాన్యం నుండి ప్రారంభించాలి. మన ఇంటికి తూర్పు వైపున ఉన్నస్థలం కలుపుకోవడం మంచిది. ఆగ్నేయం, నైరూతి, దక్షిణం ఉన్న స్థలాలను కలుపుకోకూడదు. తూర్పు భాగాన స్నానాల గది నిర్మించడం మంచిది. దక్షిణాన గొయ్యిలేని స్నానాల గది నిర్మంచుకోవడం ఎంతో శుభదాయకం. తూర్పు భాగాన గానీ, ఈశన్య భాగాన గాని బావి త్రవ్వించి, ఆ బావిలోని నీటితో ఇంటి నిర్మాణం చేయడం అన్ని విధాల మంచింది.