What is Agni Astra | భారతీయ సంప్రదాయ పద్ధతుల్లో రైతులకు వ్యవసాయంలో ఉపయోగపడే ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. కాకపోతే వీటి గురించి అవగాహన లేకపోవడంతో అత్యంత విషపూరితమైన క్రిమి సంహారక మందులు వాడాల్సి వస్తోంది. అగ్నిఅస్త్ర అంటే మన భారత సంప్రదాయంలో పురాతన సేంద్రియ ఎరువ(organic liquid)గా చెప్పుకుంటారు. అగ్నిఅస్త్ర(Agni Astra) అనేది పంటకు సేంద్రీయ పురుగు మందుగా, భూమికి, మొక్కలకు సహజ ఎరువగా సహాయ పడుతుంది. దీని వల్ల కాండం తొలిచే పురుగులు, కాయ తొలిచే పురుగులతో పాటు పంట మీద వాలే అన్ని రకాల పురుగులు నివారించడానికి ఎంతో దోహద పడుతుంది.
What is Agni Astra?
ముఖ్యంగా మన దేశంలో పండే పంటలకు అనగా కూరగాయల మొక్కలు,పండ్ల చెట్లకు, పూల మొక్క లకు ఇతర పెద్ద పంటలన్నింటికీ అగ్రిఅస్త్రను పిచికారీ(spray) చేయవచ్చు. తెగుళ్ల నివారణకు ఉపయోగపడే ఈ అగ్రి అస్త్ర సహజగా తయారు చేసుకునే ఎరువుగా చెప్పవచ్చు. కుండ తొలుచు పురుగు, ఆకు ముడత పురుగు,ఇంకా పండు తొలుచు పురుగు, కాండం తొలుచు పురుగుల నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుంది.
అగ్నిఅస్త్రను తయారు చేయు విధానం!
అగ్ని అస్త్రను తయారు చేయడానికి అవసరమైన సహజ పదార్థాలు ఏమిటంటే..10 లీటర్ల ఆవు మూత్రం, 1 కేజీ పొగాకు ఆకులు, 500 గ్రాముల పచ్చి మిరపకాయాల పేస్టు, లీటరు ఆవు మూత్రానికి 12.5 గ్రాముల వెల్లుల్లి పేస్టు , 5 కిలోల వేప ఆకుల చూర్ణం కావాల్సి ఉంటుంది. ముందుగా ఇంటి వద్ద కానీ, వ్యవసాయ పొలం వద్ద గానీ, పెద్ద కుండలో 10 లీటర్ల ఆవు మూత్రం పోయాలి. అందులో చిన్నగా కత్తిరించిన పొగాకు ఆకులను వేయాలి. అదే విధంగా పచ్చి మిర్చి పేస్టు, వేప ఆకులను వేయాలి. మొత్తం పదార్థాలు కలిపిన తర్వాత సుమారు 5 సార్లు మంటపై ఉడకపెట్టాలి. ఆ తర్వాత వచ్చిన ద్రావణాన్ని ఒక రోజంతా(24 గంటలు) పాటు పులియ పెట్టాలి.
ఎలా వాడాలి?
ఒక రోజు తర్వాత పులియ పెట్టిన ద్రావణాన్ని ఒక మెత్తటి గుడ్డ లో వడగట్టాలి. ఈ ద్రావణాన్ని పిల్లలకు దూరంగా ఉంచి నీడలో పెట్టి దానిపై దోమ తెర గానీ, ఏదైనా వైర్ మెష్ గానీ కప్పి ఉంచాలి. ఇలా చేయకపోతే దోమలు, ఈగలు వాలి గుడ్లు పెట్టే అవకాశం ఉంది. ఇలా తయారు చేసిన మందు పూర్తిగా అగ్నిఅస్త్రం గా మారడానికి 21 రోజులు పడుతుంది.

ఎప్పుడు ఉపయోగించాలి?
21 రోజుల తర్వాత తయారైన మందును పంటపై పిచికారీ చేయవచ్చు. 1 లీటరు ద్రావణాన్ని 50 లీటర్ల నీటిలో కలిపి పంటలపై స్ప్రే చేయవచ్చు. ఇలా 4 రోజులకు ఒకసారి గ్యాప్ తీసుకొని రెండు సార్లు పిచికారీ చేయవచ్చు. అదీ కూడా ఉదయం 6 నుంచి 8.30 లోపు, సాయంత్రం 4 గంటల నుంచి 6.30 గంటల లోపు పిచికారీ చేయాలి. ఒక ఎకరం పంటకు సుమారు 6 నుంచి 8 లీటర్ల అగ్నిఅస్త్రంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది. ఈ ద్రావణంలో మరే ఇతర రసాయనాలు, కెమికల్స్ కలపవద్దు. అగ్నిఅస్త్ర ద్రావణం పంటపైన 3 నెలల వరకు ఏ చీడ పీడ పురుగులు వాలకుండా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!