West Godavari Sub Inspectors | పశ్చిమ గోదావరి జిల్లా లో 10 మంది ఎస్సైలకు స్థాన చలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఆదేశాలు జారీ చేశారు. వారి వారి స్థాన చలనాలలు ఇలా ఉన్నాయి. ఏలూరు టూ టౌన్ ఎస్సైగా పని చేస్తున్న బత్తిన నాగబాబును పెద్దపాడు ఎస్సైగా బదిలీ చేసి, పెదపాడు లో పనిచేస్తున్న జ్యోతీ బసునీ విఆర్‌కు (West Godavari Sub Inspectors)తరలించారు.
చింతలపూడి ఎస్సైగా పనిచేస్తున్న స్వామిని అత్తిలి ఎస్సైగా బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న చెన్నారావును వీఆర్‌కు తరలించారు. కృష్ణా జిల్లా వీరవల్లి ఎస్సైగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంను చింతలపూడి ఎస్సైగా నియమించారు. ప్రస్తుతం విఆర్‌లో ఉన్న చావా సురేష్ దిశా ఎస్సైగా బదిలీ చేశారు. దిశగా ఎస్సైగా బదిలీ అయిన చావా సురేష్ ఏలూరు నగరంలోని మహిళా పోలీసు స్టేషన్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.
ఎస్సై టివిజి రాజు ప్రస్తుతం విఆర్ లో ఉండగా ఆయనను భీమవరం సీసీఎస్‌కు బదిలీ చేశారు. కొరివి రామకృష్ణ విఆర్‌లో ఉండగా ఆయనను గోపాలపురం కు బదిలీ చేశారు. వాసంశెట్టి సుబ్రహ్మణ్యం గోపాలపురంలో పనిచేస్తున్న ఆయనను తాడేపల్లిగూడెం ట్రాఫిక్‌కు కొద్దికాలం క్రితమే అటాచ్మెంట్ చేశారు. వేముల వెంకటేశ్వరరావు ప్రస్తుతం భీమవరం వన్ టౌన్లో పనిచేస్తూ ఉండగా ఆయనను గణపవరం బదిలీ చేశారు. మరికంటి వీరబాబు ప్రస్తుతం గణపవరంలోపనిచేస్తూ ఉండగా ఆయనను తణుకు పట్టణ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేవారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!