Weekly Current Affairs కింద తెలిపిన తెలుగు వీక్లి కరెంట్ అఫైర్స్ గతేడాది 2020 డిసెంబర్ 15 నుంచి 21 వరకు జరిగిన కొన్ని ప్రముఖమైన ఘటనలు, వ్యక్తులు, వార్తలు గురించి ప్రశ్నలు-జవాబుల వారీగా ఇవ్వడం జరిగింది. ఇవి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. గ్రూప్స్, సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారికి కూడా ఇవి (Weekly Current Affairs)దోహదపడతాయి.
1.టీ షర్టులు, జీన్స్, స్లిప్పర్లు ధరించడం నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం
జ.మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి- ఉద్దవ్ ఠాక్రే , గవర్నర్ – భగత్‌సింగ్ కొశ్యారి
2.సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
జ.మహారాష్ట్ర ప్రభుత్వం
3.నిర్ణీత కక్ష్యలోకి PSLV-C50 ని ప్రయోగించినది ఎప్పుడు? ఎక్కడ?
జ.2020 డిసెంబర్ 17న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో
4.ఇస్రో ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించారు?
జ.బెంగళూరు
5.మీటూ టూ స్లీప్ పేరుతో మహిళా ఉద్యమం ఎక్కడ జరిగింది?
జ.బీహార్‌లోని ముజఫర్‌పుర్‌లో
6.కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం ప్రత్యేక మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
జ.కోల్కత్తా(వెస్ట్‌బెంగాల్)
7.ఐటీ సంస్థ క్యాప్ జెమిని, సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్టులు సంయుక్తంగా దివ్యాంగుల స్వావలంభన కోసం ఓ యాప్ రూపొందించారు? దాని పేరు?
జ.క్యాప్ సారథి
8.గురుతేగ్ బహదూర్ జన్మదినం ఎప్పుడు?
జ. 1 ఏప్రిల్ 1621

9.యూపీలో మెగా లెదర్ పార్క్‌ను ఎక్కడ ప్రారంభించనున్నారు?
జ.కాన్పూర్ (రామైపూర్ గ్రాం)
10.ఇటీవల కేంద్ర ప్రభుత్వం పోటీ క్రీడగా దేనిని గుర్తించింది?
జ.యోగాసనాన్ని
11.Dak Pay యాప్ సేవలు ఏమిటి?
జ.ఇండియా పోస్ట్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారులు బ్యాంకింగ్ సేవలను నిర్వహించుకునేందుకు ఉపయోగపడుతుంది.
12.పెంపుడు జంతువుల ఉచిత అంత్యక్రియల దహనవాటిక ఎక్కడ ఉంది?
జ.ఢిల్లీలో
13.చెత్త ఇవ్వండి, భోజనం చేయండి..ఈ నినాదం ఏ రాష్ట్రానిది?
జ.మహారాష్ట్ర (ఠాణే జిల్లా, కళ్యాణ్ డోంబివ్లీ పురపాలక సంస్థ)
14.ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఏ వ్యాధి వెలుగులోకి వచ్చింది?
జ.మ్యూకర్మైకోసిస్ (Mucormycosis)
15.భారత్- బంగ్లాదేశ్ దేశాల మధ్య ఎన్ని ఒప్పందాలపై సంతకాలు జరిగాయి?
జ.ఏడు
16.అత్యాచార నిందుతులపై కెమికల్ క్యాస్ట్రేషన్ చట్టాన్ని నడిపి వార్తల్లో నిలిచిన దేశం?
జ.పాకిస్థాన్
17.చైనా 2000 కి.మీ గోడ ఏ దేశ సరిహద్దుల్లో నిర్మిస్తుంది?
జ.మయన్మార్
18.వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు పథకం ఎక్కడ ప్రారంభమైంది?
జ.తక్కెళ్లపాడు(కృష్ణా జిల్లా)
19.వైఎస్సార్ సుజలధార పథకానికి భూమి పూజ ఎక్కడ జరిగింది?
జ.పలాస(శ్రీకాకుళం జిల్లా)
20.ఆంధ్రప్రదేశ్‌లో మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమం పేరు?
జ.యాంటీ డ్రగ్ వీక్ (Anti Drug Week)

21.దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి, దేశంలోనే రెండవ కోతుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
జ.గండిరామన్న హరితవనం(నిర్మల్ జిల్లా)
22.తెలంగాణలో కామారెడ్డి జిల్లాకు ఏ అవార్డు వచ్చింది?
జ.వెబ్‌రత్న
23.ప్రముఖ రెజ్లర్ శ్రీపతి కాంచనాలె కు ఏ పురస్కారం ఇచ్చారు?
జ.హింద్‌కేసరి