way2news telugu telangana | ఈ రోజు వే2న్యూస్‌లో తెలంగాణ వార్తలు కింద ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సీఎం కేసీఆర్, మినిస్టర్ కేటిఆర్, మంత్రి హరీశ్‌రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వార్తలు అందించడం జరిగింది. ఇవి వే2న్యూస్ నుండి సేకరించబడినవి.
way2news telugu telangana
CBI విచారణ కోరాలి: బండి సంజయ్
రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతల అరాచకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పోలీసుల వేధింపుల వల్లే BJP కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సాయి గణేష్ వాంగ్మూలాన్ని పోలీసులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రామాయంపేటలో తల్లీకుమారుడు ఆత్మహత్య, వామనరావు దంపతుల హత్య, కోదాడ అత్యాచార ఘటనలపై సీఎం కేసీఆర్ సిబిఐ విచారణ కోరాలని సంజయ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ పట్ల ఎందుకీ వివక్ష: KTR
తెలంగాణపై PM నరేంద్ర మోడీ వివక్ష నిరాటకంగా సాగుతోందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గుజరాత్ జామ్‌నగర్‌లో సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ప్రారంభించాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కిషన్ రెడ్డి, ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ సర్కారులో మంత్రిగా ఉండి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు.
KGBVల్లో టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు
రాష్ట్రంలో 475 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో వెయ్యి టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం కోసం వాటిని ఒప్పందం ప్రాతిపదికన భర్తీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారానా? లేక ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు జరిపి ఎంపిక చేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని విద్యా శాఖ అధికారులు తెలిపారు.
త్రివిధ దళాధిపతులు నా బ్యాచ్‌మెట్స్: ఉత్తమ్
దేశ భద్రత లో కీలకమైన త్రివిధ దళాలకు తన బ్యాచ్మేంట్స్ నాయకత్వం వహించడం గర్వంగా ఉందని, కాంగ్రెస్ సీనియర్ నేత MP ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు. భారత సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, ఐఎఎఫ్ ఎయిర్ ఛీప్ మార్షల్ వివేక్ చౌదరి, నౌకాదళాధిపతి అడ్మిరల్ హరికుమార్, తాను 1979 నుంచి 1981 వరకు ఎన్డిఎలో 61 కోర్సుల్లో శిక్షణ పొందామని ఉత్తమ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
తర్వలోనే NIMZకు శంకుస్థాపన: హరీశ్‌రావు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఏర్పాటు చేయనున్న జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (NIMZ) కు అవసరమైన అన్ని రకాల అనుమతులు వచ్చాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నిమ్జ్‌కు త్వరలనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. నిమ్జ్‌లో పలు సంస్థలు పెట్టుబడులకు ముందు కొస్తున్నా యని, స్థానికులకు ఉపాధి కల్పించే సంస్థలకు ప్రోత్సహకాలు అందించేలా ప్రభుత్వం కొత్త పాలసీ తెచ్చిందని మంత్రి హరీష్ వెల్లడించారు.
మోతాదుకు మించి ఎరువులు వద్దు: CM KCR
అవసరానికి మించి ఎరువులు వాడితే ఏపుగా పెరగాల్సిన పంట దెబ్బతింటుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యా నించారు. విరివిగా ఎరువులు, పురుగుమందుల వాడకంతో భూములు దెబ్బతింటాయని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలని అన్నదాతలకు సూచించారు. వరిసాగులో వెదజల్లే విధానాన్ని మరింత ప్రోత్సహించడం ద్వారా రైతుకు అన్ని విధాల ఖర్చు తగ్గించవచ్చని ఈ పద్ధతిపై అన్నదాతలపై అవగాహన కల్పించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు(Rain)
తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయని తెలిపింది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ