way2news : న్యూస్ లో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికీ కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో మన ముందు వుంచుతుంది. అందుకనే వే2న్యూస్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ క్రింద తెలిపిన హెల్త్ సమాచారం way2news నుంచి సేకరించబడింది. మీకు ఉపయోగపడే ఆరోగ్య సూచనలు, సలహాలు తెలుసుకోండి.
way2news : పంచదార కలిపి తింటున్నారా?
మనలో చాలామందికి పెరుగులో షుగర్ కలిపి తినే అలవాటు ఉంటుంది కదా. ఇది రుచిగా ఉండటంతో పాటు ఇలా తింటే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు కొందరు. ఇలా ఎక్కువగా ఉత్తర భారతం లో తింటుంటారు. పెరుగులో పంచదార కలిపి తినడం మంచిది కాదంటున్నారు వైద్యులు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమంట. పెరుగు, పంచదార కలిపి తినడం వల్ల శరీరానికి అధిక క్యాలరీలు అందుతాయి.
దీంతో కొంత మందిలో విరేచనాలు, బరువు పెరుగుదలకు దారి తీస్తుంది. షుగర్ అధికంగా తినడం వల్ల మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా అసమతుల్యతకు గురవుతుందట. దీని వల్ల జీర్ణక్రియ సమస్య ఏర్పడుతుంది. పెరుగు, పంచదార కలిపి తినడం వల్ల వయసుతో సంబంధం లేకుండా మధుమేహం వ్యాధి వస్తుందట.
గుండెలు బ్రేకవుతున్న వేళ!
ఇటీవల గుండె ఆగిపోయి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. వయసుతో సంబంధం లేకుండా గుండె పోటుతో ప్రాణాలు విడవడం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇది ప్రస్తుతం యువతను కంగారు పెట్టిస్తున్న వార్త. మన శరీరంలో గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని తీసుకెళ్తేవి ధమనులు. వీటికి కొవ్వు అడ్డు పడినప్పుడు heart attack వస్తుంది. శరీర భాగాలకు కాకుండా మెదడకు వెళ్లే ధమనుల్లో రక్తం గడ్డకడితే heart stroke వస్తుంది.
శరీరంలో రక్త నాళాల్లో పగుళ్లు ఏర్పడతాయి. అందులో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీంతో గుండె కండరాలు బలహీనపడతాయి. దీన్ని మయోకార్డియల్ ఇన్ఫాక్ష్రన్ అని అంటారు. మధ్యపానం, ధూమపానం, ఒత్తిడి, హైపవర్ టెన్షన్, డయాబెటిస్ వంటివి మగవారకే ఎక్కువుగా వస్తుంటాయి. స్త్రీలలో సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజెన్ ధమనుల గోడలకు రక్త కణాలను, కొలెస్ట్రాల్ అంటుకోకుండా చేస్తుదని లండన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది.
health policy తీసుకుంటున్నారా?
అనారోగ్యం బారిన పడి లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే క్లిష్ట పరిస్థితుల్లో మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. చాలా కంపెనీలు జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తున్నాయి. ఈ insurance policy లు అన్ని అనారోగ్య సమస్యలకు వర్తించవు. బీపీ. షుగర్ వంటి సమస్యలు మాత్రమే కవరేజ్ క్లై చేసుకోవడానికి వీలుంటుంది.
తాజాగా ఇన్సూరెన్స్ రెగ్యలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్ఐవి, మానసిక వ్యాధులతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని, వారికి వర్తించే విధంగా పాలసీలు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రకమైన హెల్త్ పాలసీలకు వ్యాధి వచ్చిన తర్వాతయితే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. కానీ, పాలసీ తీసుకున్న తర్వాత హెచ్ఐవీ, మానసిక వ్యాధులు వస్తే తక్కువ ఖర్చుతో పాలసీలు తీసుకుని ఇన్సూరెన్స్ పరిధిలో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.
ఎక్కువ కాలం బతకాలని ఉందా?
మనిషి జీవిత కాలం 100 సంవత్సరాలు. ఇప్పటి జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణంగా ప్రస్తుత జీవన ప్రమాణ స్థాయి రేటు 70 ఏళ్లుగా ఉంది. మిగిలిన 30 ఏళ్ల జీవిత కాలాన్ని దురలవాట్ల కారణంగా తగ్గించుకున్నారు. ఆ చెటు అలవాట్లలో సరిగా నిద్రపోవడం ఒకటి. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్, నేషనల్ Health ఇంటర్వ్యూ సంస్థలు 2013-2018 మధ్య కాలంలో ఒక సర్వే నిర్వహించాయి.
ఈ సర్వేలో 1,72,321 మంది నిద్రపోతున్న సమయాన్ని పరిశీలించారు. పరిశోధనలో సరిపడా నిద్రపోయిన వారి సగటు జీవన ప్రమాణ స్థాయి దాదాపు 5 సంవత్సరాలు పెరిగిందని, నిద్రపోవడం వల్ల cancer, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గాయని పరిశోధకులు చెబుతున్నారు. మరిన్న విషయాలు way2news నుంచి సేకరించి అందించబడును.