waterpollution

waterpollution: పాత బావి నీరు తాగిన గ్రామ‌స్థుల‌కు అస్వ‌స్థ‌త.. అప్ర‌మ‌త్త‌మైన యంత్రాంగం!

Spread the love

waterpollution: వ‌త్స‌వాయి: కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం వ‌త్స‌వాయి మండ‌లం ఖ‌మ్మంపాడు గ్రామంలో తాగునీరు క‌లుషితం(waterpollution) అయ్యింది. ఈ నీరు తాగిన 30 మంది ప్ర‌జ‌లు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వారిలో ప‌లువురికి వాంతులు, విరేచ‌నాలు అయ్యాయి. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్య చికిత్స అందించారు. స‌మాచారం అందుకున్న వైద్య ఆరోగ్య‌శాఖ‌, పంచాయ‌తీ రాజ్ అధికారులు వెంట‌నే గ్రామాన్ని సంద‌ర్శించారు. ప్ర‌త్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి స‌ర్వే చేప‌ట్టారు. గ్రామానికి స‌మీపంలోని మున్నేరు నుంచి ర‌క్షిత తాగునీరు స‌ర‌ఫ‌రా అయ్యే పైపులైన్‌కు మ‌ర‌మ్మ‌తులు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గ్రామంలో పురాత‌న బావి నుంచి గ‌త వారం రోజులుగా తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్టు ప్ర‌జ‌లు తెలిపారు. ఈ క్ర‌మంలో బావినీరు క‌లుషితం కావ‌డం వ‌ల్లే ప్ర‌జ‌లు ఇబ్బందుల‌కు గురైన‌ట్టు అధికారులు భావిస్తున్నారు. బావిలోని నీటి న‌మూనాలు సేక‌రించి ల్యాబ్ కు పంపించిన‌ట్టు అధికారులు తెలిపారు.

వాట‌ర్ ట్యాంక్‌ను శుభ్రం చేయాలి: జ‌న‌సేన‌

కంభంపాడు గ్రామంలో పంచాయ‌తీ వాట‌ర్ ట్యాంక్‌లోని నీరు తాగి శుక్ర‌వారం సాయంత్రం కొంద‌రు గ్రామస్థులకు వాంతులు, విరోచ‌న‌లు అవ్వ‌డంతో జ‌న‌సేన జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు బాడీశ ముర‌ళీకృష్ణ స్పందించారు. వెంట‌నే ప్ర‌భుత్వం కంభంపాడు గ్రామంలో మెడిక‌ల్ క్యాంపు ఏర్పాటు చేయాల‌ని, వాట‌ర్ ట్యాంక్‌ను శుభ్రం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ట్యాంక్‌లోని నీటి శాంపిళ్ల‌ను ప‌రీక్ష‌ల‌కు పంపించాల‌ని కోరారు.

vasthavai news: రోడ్ల గుంత‌లు పూడ్పించిన వ‌త్స‌వాయి కానిస్టేబుల్ సుల్తాన్‌!

vasthavai news వ‌త్స‌వాయి: కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం వ‌త్స‌వాయి పోలీసులు ప‌లుగు పార చేత‌బ‌ట్టి శుక్ర‌వారం రాత్రి వ‌త్స‌వాయి-బోన‌క‌ల్లు వెళ్లే రహ‌దారిపై స్వ‌యంగా గుంత‌లు పూడ్చారు. Read more

cheating case: ప్ర‌భుత్వ లోన్లు పేరుతో మోసం పోలీసు స్టేష‌న్‌ను ఆశ్ర‌యించిన బాధితులు!

cheating case: జ‌గ్గ‌య్య‌పేట: ప్ర‌భుత్వ లోన్ల పేరుతో మోసం చేసిన సంఘ‌ట‌న కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం వ‌త్స‌వాయి మండ‌లం మాగొల్ల గ్రామంలో వెలుగు చూసింది. అదే Read more

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

pushpa lorry scene: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక మాఫియా ఆగ‌డాలు

pushpa lorry scene గ‌రిక‌పాడు: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక‌మాఫియా ఆగ‌డాలు ఏపీలో వెలుగు చూశాయి. ఏకంగా 11 ఇసుక లారీల‌ను ఆంధ్రా - తెలంగాణ స‌రిహ‌ద్దు Read more

Leave a Comment

Your email address will not be published.