Water Benefits for health: నీరు త్రాగకుండా ఎవరైనా ఉండగలరా? ఎవరూ ఉండలేరు కదా! మనకు ప్రాథమిక అవసరాల్లో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కొంత మంది నీటిని అదే పనిగా త్రాగుతూ కనిపిస్తారు. మరికొందరు నీటిని చాలా తక్కువగా తాగుతారు. అయితే శరీర తత్వాన్ని బట్టి రోజూ తగినన్ని నీళ్లు తీసుకుంటే పలు వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
మానవ శరీరంలో దాదాపు 60% వరకు నీరే ఉంటుంది. ప్రధానంగా మెదడు, గుండెలో 73% వరకు, ఊపిరితిత్తుల్లో 83% వరకు నీరే ఉంటుంది.ఇవే కాదు శరీరంలోని అనేక అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే నీరు తగినంతగా తాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నీటిని అధికంగా తాగితే కేవలం రెండు రోజుల్లోన్నే మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు. వేళ తప్పి భోజనం చేయడం, జంక్ ఫుడ్ ఎక్కువుగా తినడం, పరిమితికి మించి ఎక్కువ భోజనం తీసుకోవడం ఇలా కారణాలు ఏమున్నా కడుపులో గ్యాస్ సమస్య ఒక్కోసారి చాలా బాధకు గురిచేస్తుంది.
అయితే నీటిని తగినంత తీసుకుంటే రెండ్రోజుల్లో ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా నేడు అధిక శాతం బాధపడుతున్న వాధ్యుల్లో మధుమేహం(diabetes) ఒకటి. ఇందులో టైప్ 1, 2 అనే రెండు రకాలు ఉన్నాయి. రోజూ నీటిని తగినన్ని తాగితే వారం రోజుల్లో మధుమేహం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం హైబీపీ(high bp) సమస్య కూడా ఎక్కువుగానే ఉంది. దీని వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక నెల రోజుల పాటు నీటిని అధికంగా తాగితే మాత్రం హైబీపీ సమస్య బాధించదు. బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇలా అనేక రకాల క్యాన్సర్ల లలో రకాలు ఉన్నాయి. రోజూ నీటిని తగినన్ని నెలపాటు క్రమ పద్ధతిలో తాగితే క్యాన్సర్‌ను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఊపిరితిత్తులకు సంబంధించి క్షయ వంటి వ్యాధులు తగ్గుముఖం పట్టాలంటే మూడు నెలల పాటు రోజూ నీటిని క్రమ పద్ధతిలో తీసుకోవాలి. కేవలం అనారోగ్య సమస్యలు ఉన్నవారే కాదు, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా నీటిని అధికంగా తీసుకుంటే ఎన్నో ఆశ్చర్య కర ఫలితాలు కనిపిస్తాయి.

నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు?
1.ఉదయాన్నే పరిగడుపున నీళ్లు తాగడం వల్ల నోటి నుండి వచ్చే దుర్వాసన గణనీయంగా తగ్గించవచ్చు. ఉదయాన్నే 200 మిల్లీ లీటర్ల నీటిని 30 సెకన్లలోపు తాగేయాలి.
2.ఇక రాత్రి 7 గంటల నుండి 8 గంటలు పాటు నిద్రించిన తర్వాత శరీర సాధారణంగా తేలికపాటి డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని వల్ల తలనొప్పి వస్తుంది. దీనికి మెదడలో ఉండే మెనింజెస్ కారణం అని వైద్యులు చెబుతున్నారు. వీటిని నివారించేందుకు ఉదయాన్నే ఒక గ్లాసుడు తాగడం వల్ల ఫలితం ఉంటుంది.
3.జీర్ణక్రియకు నీరు చాలా సహాయ పడుతుంది. ఆహారంలో ఉండే ఫైబర్స్ జీర్ణం కావడానికి నీరు ఎంతో దోహద పడుతుంది. ఫైబర్స్‌ను మలవిసర్జన ద్వారా సులువుగా బయటకు వెళ్లేందుకు సహాయపడతాయి. మలబద్దకం కూడా తగ్గుతుంది.
4.ఉదయాన్నే వెచ్చని నీరు లేదా నిమ్మరసం కలుపుకుని లేదా గ్రీన్ టీ పొడి కలుపుకొని తాగవచ్చు. అది రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది.
5.నీరు ఒక శక్తివంతమైన యాంటీటాక్సిన్, ఇది శరీరం నుండి టాక్సిన్లను బయటకు తొలగించడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి శరీరానికి శక్తిని ఇస్తుంది.
6.నీళ్లు త్రాగడం వల్ల అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుతారు. అధిక బరువు ఉన్నవారు ఉదయాన్నే వెచ్చనీ నీటిని తాగినా మంచిదే, లేదంటే తేనె మరియు నిమ్మరసం కలుపుకుని తాగితే ఫలితం బాగా ఉంటుంది.
7.ప్రతి రోజూ నీరు తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మం యవ్వనవంతంగా కాంతివంతంగా కనిపిస్తుంది.