Water benefits for body : మనం ప్రాణంతో జీవిస్తున్నామంటే తీసుకుంటున్న ఆహారంతో పాటు తాగే నీరు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సృష్టిలో నీరు తాగకుండా 99.9% శాతంలో ఎక్కడో ఒక శాతం జీవులు ఉండవచ్చు. కానీ నీరు మానవునికి అత్యవసరమైన వనరు. నీరు లేకపోతే మానువుని మనుగడ సాధ్యం కాదు.
Water benefits for body : నీరు మన శరీరానికి చాలా అవసరమైనది. రోజు వారి మనం తీసుకునే నీరు మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. నీరు తీసుకోవడం తగ్గితే రకరకాల సమస్యలు తలెత్తుతాయి. అందుకనే డాక్టర్లు శరీరానికి సరిపడా నీటిని తాగాలని సూచిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న నేటి వాతావరణ కాలుష్యం ఫలితంగా నీరు కాలుష్యమైపోతుంది. ఈ కాలుష్యం నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి కాచి చల్లార్చిన నీరు హెల్త్‌కు చాలా మంచింది. నీటిని మనం తినే ఆహారంతో పాటు స్వీకరిస్తుంటాం. నీరు ఒక విధమైన ఔషధమే. ఎవరైనా బరువుతో బాధపడుతున్నప్పుడు వారు తగ్గాలనుకుంటే నీరు ఎక్కువుగా తాగాలి. దానిని వాటర్ థెరపీ అంటారు. ఒక పాత్రలో నీటిని తీసుకుని మూడోవంతు నీరు ఆవిరయ్యేలా చేసి, మిగిలిన నాల్గో వంతు భాగాన్ని చల్లార్చి తాగితే ఊబకాయం తగ్గుతుంది. అదే విధంగా లావు అవ్వాలని అనుకునేవారు ఒక పాత్రలో నీటిని తీసుకుని కేవలం నాలుగోవంతు మాత్రమే ఆవిరయ్యాక, మిగిలిన నీటిని చల్లార్చి తాగితే క్రమంగా లావు అవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Empty stomach drinking water
పడగడపున మంచినీరు తాగడం వల్ల అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారణిగా కూడా పనిచేస్తుందని వైద్యశాస్త్రం ధృవీకరించింది. నీటిని ఎక్కువుగా తాగనివారు ఒకసారి ఈ విషయాన్ని ఆలోచించాల్సిందే. ఉదయాన్నే నిద్రలేవగానే ఒకటిన్నర లీటరు మంచినీటిని తాగాలి. తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. పరగడపున ఖాళీ కడుపుతో మంచినీరు తాగడం వల్ల పెద్దపేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కొత్త రకం తయారీ శక్తిని, కండరాల కణాల వృద్ధిని పెంచుతుంది. పొద్దున్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వల్ల 24 శాతం శరీర మెటబాలిజానని పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రక్త కణాలను శుద్ధి చేయడం వల్ల శరీరంలో మలినాలు తొలుగుతాయి. దానిలో శరీర ఛాయ ప్రకాశిస్తుంది. ఈ గ్రంథుల వల్ల రోజువారీ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా ద్రువపదార్థాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్ దరి చేరకుండా పోరాడుతుంది.


Don’t drink water after meal
బాగా దాహం వేస్తున్నప్పుడు లేదా ఎండలో తిరిగి రాగానే చల్లటి నీళ్లు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. కొంత మంది ఇళ్ళల్లో ఫ్రిజ్‌లో బాటిళ్లలో నీళ్లు నింపి పెట్టుకుంటూ ఉంటారు. బయట వాతావరణంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఫ్రిజ్లోనే వాటర్‌ను తాగుతుంటారు. భోజనం చేసిన తర్వాత చల్లటి నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని జపాన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. భోజనం చేయగానే చల్లటి నీరు తాగితే అది భోజనంలోని నూనెలతో కలిసి ఆహారాన్ని జిగటగా ఉడే ఘన పదార్థాలుగా చేస్తుంది. ఫలితంగా ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లకుండా ఆహారనాళంలోని నుంచి కింద వరకూ అతుక్కుంటుంది. దీని వల్ల ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. చల్లటి నీరు తాగడం కొన్ని సందర్భాల్లో కొవ్వు పదార్థాలు అధికంగా ఉత్పత్తి కావడానికి కారణమవుతుంది. కేన్సర్ సోకడానికి ఇది కారణమవుతుంది. ఆహారం తీసుకోగానే చల్లని నీరు తాగవద్దని, గోరు వెచ్చని నీటిని తాగమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గోరు వెచ్చని నీటిని తీసుకుంటే అది పదార్థాల్లోని నూనెను కరిగించి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
Seven Glass Water Drink Per Day
రోజుకి ఏడు గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలో 200 కాలరీలు తగ్గుతాయట. ఆశ్చర్యంగా ఉంది కాదా! కానీ ఇది నిజం. ముఖ్యంగా డిటాక్సర్స్, డైటర్స్ నీళ్లు ఎంత ఎక్కువుగా తాగితే అంత మంచింది. శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో అదనంగా మరికొన్ని గ్లాసుల నీళ్లు తాగడం మంచిది కాదని తేలింది. దీనివల్ల కడుపు నిండుగా ఉండి ఆహారం మితంగా తింటాం. ఫలితంగా శరీరంలోని కాలరీలు తగ్గుతాయి. 2005 నుంచి 2012 సంవత్సరం వరకూ మొత్తం 18,300 మంది డయటరీ అలవాట్లను అధ్యయనకారులు పరిశీలించారు. మిగతా అంశాలతో పాటు క్లయింట్లు మంచినీళ్లు ఎంత తాగుతున్నారు. అలాగే తీపిలేని లిక్విడ్స్ అంటే కాఫీ, టీ వంటివి ఎంత తీసుకుంటున్నారు వంటి విషయాలను కూడా గమనించారు. వీటన్నింటిని బట్టి రోజులో నీటి వినియోగం ఎంత ఉందో లెక్కగడుతున్నారు. ఈ అధ్యయనంలో క్లయింట్లు రోజుకు 4.2 గ్లాసుల ప్లెయిన్ వాటర్ తీసుకుంటున్నట్టు వెల్లడైంది. వాళ్ల గరిష్ట కాలరీ ఇంటెక్ 2,157 . వీటిల్లో తీప్రి డ్రింకులు, కాఫీ, టీలు తాగడం వల్ల శరీరంలో 125 కాలరీలు చేరుతున్నాయి. కాలరీ – రిచ్ ఆహారం, పోషకాలు తక్కువుగా ఉండే ఫుడ్స్ అంటే స్నాక్స్, పేస్ట్రీస్, డిజర్టులు తినడం వల్ల శరీరంలోకి 432 కాలరీలు వచ్చి చేరుతున్నాయి.


అయితే మంచినీళ్లు ఎక్కువుగా తాగిన వాళ్లల్లో డెయిలీ కాలరీలు 68 నుంచి 205 వరకూ తగ్గుతున్నాయి. అలా అని ఎక్కువ నీరు తాగడం కూడా శరీరానికి మంచింది కాదు. నీరు ఎక్కువుగా తాగడం వల్ల శరీరంలో ఉండే పోషకాలు, న్యూట్రియింట్లు బయటకుపోయే ప్రమాదం ఉంది. శరీరం నిస్సహత్తువుగా మారుతుంది. శరీరంలోని ఫ్లూయిడ్స్ పలచబడతాయి. దీంతో శరీరంలో సోడియం ప్రమాణాలు పడిపోతాయి. కణాలు వాస్తాయి. చివరిగా స్పహ కోల్పోతాం. ఫిట్స్ వస్తాయి. కోమాలోకి పోయే ప్రమాదం ఉంది. అందుకే శరీర తీరు, డైట్, వయసు ఇతర విషయాలకనుగుణంగా వైద్యుని సూచనలతో నీరును తాగాలి. అందరికీ ఒకే రకమైన శారీరక లక్షణాలు, జీవక్రియ ఉండకపోవడం ఇందుకు కారణం.
Summer in Drinking Water
వేసవిలో నీళ్లు తాగకుండా ఎవరూ ఉండలేరు. బయట ఎండలు మండుతున్నాయి. ఈ ఎండలో ప్రయాణించాలంటే మంచినీళ్లు తరుచూ తాగుతూ ఉండాలి. అయితే శరీరంలో వేడి ఎక్కువుగా ఉన్నప్పుడు బాగా చల్లగా ఉండే నీళ్లు తాగడం, శరీరంపై జల్లుకోవడం అంత మంచిదికాదు. అధిక కూలింగ్‌తో ఉన్న డీఫ్రిజ్ వాటర్, ఐస్ క్యూబ్స్ వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు.వైద్యులు. అందుకే బయట ఎండను తట్టుకునేందుకు ముందుగానే శరీరాన్ని సన్నద్ధం చేయడం మంచింది. అందుకు వేసవికాలంలో బయట పనులు చేయాల్సి వచ్చినప్పుడు లేదా ప్రయాణాలు తప్పవన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందుగానే కడుపు పట్టినన్ని నీళ్లు తాగితే శరీరం బయట వేడిని తట్టుకునేందుకు సిద్ధమవుతుంది. నీటి శాతం తగ్గకుండా శరీరం ఉష్ణ, శీతలాలను సమతుల్యం చేసుకుని, వేసవి తాపాన్ని తట్టుకోగలుతుంది. అందుకే బయటకు బయలుదేరేటప్పుడు నీళ్లను తాగడంతో పాటు ఎప్పుడూ చల్లని నీటిని వెంట ఉండేలా చూసుకోవడం మంచింది.
Plastic bottel water


మనం బయటకు వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లడం పరిపాటి. దాహం వేసినప్పుడు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుతుంటాం. అయితే బాటిళ్లలో దొరికే నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరంమని ఓ అధ్యాయనంలో వెల్లడైంది. వాటర్ బాటిళ్లలో నిల్వ ఉండే బ్యాక్టీరియాలపై ట్రెడ్మిల్స్ రివ్యూ అనే పత్రిక పరిశోదన నిర్వహించింది. ముందుగా క్రీడా మైదానంలో ఆడగాళ్లు వాడుతున్న 12 సీసాలను పరిశీలించింది. ప్రతిదాంట్లో సగటున 3,13,499 సీఎఫ్‌యూ మేరకు బ్యాక్టీరియాలు ఉన్నాయట. వీటిలో అత్యధికంగా ఓ సీసాలో 9 లక్షల సీఎఫ్యూల మేరకు బ్యాక్టీరియాలు కనిపించాయట. ఈ లెక్కన మనం శుభ్రం చేయకుండా వాడే సీసాల్లో సూక్ష్మ క్రిములు ఏ స్థాయిలో ఉంటాయో ఒక్కసారి ఆలోచించింది. ఇలా బాటిళ్లలో ఉండే బ్యాక్టీరియాల్లో 90 శాతం హానికర క్రిములేనని ఈ పరిశోధన హెచ్చరించిస్తోంది.
Health benefits of water


ఈ భూమి మీదే కాదు… మన శరీంలోనూ నీటి శాతం ఎక్కువ. శరీర బరువులో సుమారు 60% నీరే. కణాలు, అవయవాలు, కణజాలాలన్నీ సరిగా పనిచేయడానికి నీరు తప్పనిసరి. కాబట్టే శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు తాగడం మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. అందువల్ల నీరు మనకు చేసే మేలు గురించి తెలుసుకుని ఉండటం అవసరం.
కణజాల రక్షణ: నీరు దాహాన్ని తీర్చడంతో పాటు మన శరీర ఉష్ణోగ్రతనూ నియంత్నిస్తుంది. కణజాలాల్లో తేమ తగ్గకుండా చూస్తూ వాటిని కాపాడుతుంది. కళ్లు, ముక్కు, నోరు ఎండిపోయినప్పుడు ఈ విషయం మనకు బాగా తెలుస్తుంది. ఇలాంటి సున్నతిమైన భాగాల్లోనే కాదు, ఎముకల్లో, మెదడులో తగినంత తేమ ఉండేలానూ చేస్తుంది. వెన్నుపామును కూడా కాపాడుతుంది. కీళ్లు ఒకదాంతో మరొటి రాసుకుపోకుండా చూస్తూ, వాటిని కుషన్‌లా ఉపయోగపడుతుంది.
వ్యర్థాల తొలగింపు: శ్వాస, మూత్రం, మల విసర్జన ద్వారా వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడానికి నీరు తోడ్పడుతుంది. పేగుల మాదిరిగానే కిడ్నీలు, కాలేయం కూడా వ్యర్థాలను తొలగించడానికి నీటిని ఉపయోగించుకుంటాయి. ఇది మలం గట్టిపడకుండా చేసి మలబద్ధకం బారినపడకుండా కాపాడుతుంది.
ఆహారం జీర్ణం కావడానికి: తిన్న ఆహారం జీర్ణం కావడం లాలాజలం నుంచే మొదలవుతుంది. ఇందులో ప్రధానమైన భాగం నీరే. దీనిలోని ఎంజైమ్‌లు ఆహారాన్ని విడగొడతాయి. ఆహారం సరిగా జీర్ణమైతేనే అందులోని ఖనిజాలు, ఇతర పోషకాలను శరీరం బాగా గ్రహించగలుతుంది. మలం ముద్దగా ఏర్పడటానికి, తేలికగా విసర్జన జరగటానికి తోడ్పడే పీచు జీర్ణం కావడానికి నీరు తోడ్పడుతుంది.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!