female robbers: బస్సుల్లోనూ, ఆటోల్లోనూ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కిలాడీ లేడీలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి తెలిపారు. వీరి విచారణలో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
female robbers: రద్దీగా ఉన్న బస్సుల్లోనూ, ఆటోల్లోనూ ప్రయాణిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చేసుకొని పర్సుల్లో బంగారు ఆభరణాలను చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కిలాడీ మహిళలను సిసిఎస్ మరియు లింగాల మనూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసినట్టు పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషీ తెలిపారు. శనివారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. వీరి వద్ద నుండి రూ.24 లక్షల విలువైన 473 గ్రాముల విలువల గల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్ఫోన్లు తో పాటు చోరీలకు పాల్పడుతూ అనంతరం తప్పించుకునేందుకు వినియోగించిన ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అక్షింత సంధ్య అలియాస్ దివ్యా అలియాస్ రాణి (35)ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ పట్టణం, బుధవారిపేట కాగా, ప్రస్తుతం ఎల్బినగర్ నాగోల్‌లో ఉంటున్నట్టు గుర్తించారు. బోయి కవిత (58) కర్నూల్ జిల్లా బుధవారిపేట కాగా ప్రస్తుతం ఎల్బినగర్ ప్రాంతలో మన్సూరాబాద్‌లో నివాసం ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో..
ఈ ఇద్దరు నిందితురాళ్ళు గతంలో టైలరింగ్ వృత్తి చేసేవారు. ఈ విధంగా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించి జల్సగా జీవించాలని ఆలోచించారు. ఇందులో భాగంగా నిందితురాళ్లు ఇరువురు వేర్వేరుగానే రద్దీగా ఉండే బస్సులు, ఆటోలను ఎంచుకునేవారు. ఒంటరిగా ప్రయాణించే హ్యాండ్ బ్యాగ్‌లు ధరించి ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి బ్యాగుల్లో బంగారు ఆభరణాలను చోరీ చేసేవారు. ఇలా చోరీకి పాల్పడుతూ ఇద్దరూ హైదరాబాద్‌కు మకాం మార్చారు. అనంతరం నిందితురాలు బోయ కవిత 2005 సంవత్సరం నుండి పటాన్ చెరువు, రాంగోపాల్‌పేట్, మేడిపల్లి, ఎల్బి నగర్, నల్గొంగ పట్టణం, నల్గొండ గ్రామీణం, గుర్రంపాడు పోలీస్ స్టేషన్ పరిధితో కలపుకోని మొత్తం 8 చోరీలకు పాల్పడంతో నిందితురాలిని పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మరో నిందితురాలు అకింతల సంధ్య 2014 సంవత్సరం నుండి 2019 వరకు మొత్తం 16 చోరీలకు పాల్పడింది. ఇందులో భువనగిరి ప్రాంతంలో 5 చోరీలకు పాల్పడగా, బీబీనగర్ మరియు దేవరకొండ ప్రాంతాల్లో మూడు చొప్పున ఆరు చోరీలకు , ఆలేరు, రాంచంద్రపురం, యాదగిరిగుట్ట, చింతపల్లి, ఎల్.బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పన 5 చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితురాళ్ళు ఇద్దరు పోలీసులకు పట్టుబడిన సమయంలో తమ పేర్లను తప్పుగా తెలియజేసేవారు.
జైలు నుంచి విడుదలైన ఇద్దరు కలిసి చోరీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒక కారును కొనుగోలు చేసి కారును నడిపేందుకు ఇద్దరు బంధువులను నియమించుకున్నారు. నిందితురాళ్లు గతలో చోరీలు చేసిన ప్రాంతాల్లో చోరీ చేస్తే పోలీసులకు చిక్కుతామని నిర్థారించు కున్నారు. కొనుగోలు చేసిన కారులో ఒక్కోక్కసారి ప్రయాణిస్తూనే మార్గ మధ్యలో కారు నుండి దిగి రద్దీగా ఉన్న బస్సులు లేదా ఆటోల్లో ఎక్కి హ్యాండ్ బ్యాగు ధరించి ఉన్న ఒంటరి మహిళ వద్ద ఆభరణాలతో పాటు డబ్బును చోరీ చేసేవారు. చోరీ అనంతరం ఈ కిలాడీ లేడీలు ఇరువురు బస్సు నుండి దిగి బస్సు వెనుకనే అనుసరిస్తూ వస్తున్న వారి కారులో ఎక్కి అక్కడి నుంచి తప్పించుకోని పోయేవారు. నిందితురాళ్లు తమను ఎవరూ గుర్తు పట్టని విధంగా శ్రీమంతుల తరహాలో ఖరీదైన చీరలను ధరించడంతో తమ వేషధారణ మారుస్తూ నిందితురాలు చోరీలకు పాల్పడేవారు.
ఈ క్రమంలో గతేడాది నుండి ఇప్పటి వరకు మొత్తం 11 చోరీలకు పాల్పడ్డారు. ఇందులో వరంగల్ పోలీస్ కమిషన్‌రేట్ పరిధిలోని హన్మకొండ, మట్వాడా, నర్సంపేట్, రెండు చొప్పున చోరీలకు పాల్పడగా, ఇంతేజా గంజ్, జనగాం, బచ్చన్నపేట్, లింగాల ఘణపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీలకు పాల్పడటంతో పాటు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో ఒక చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలపై దృష్టి సారించిన పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సెంట్రల్ ఇంఛార్జ్ డిసిపి పుష్పా సిసిఎస్ ఎస్.సి.పి బాబురావు పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లింగాల ఘన పూర్ ఎస్ఐ దేవేందర్‌లు దర్యాప్తు చేపట్టంతో నిందితురాళ్లు చోరీలకు పాల్పడిన ప్రదేశాల్లోని సిసి కెమెరాలతో పాటు పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోని దర్యాప్తు అధికారులు నిందితురాళ్లను గుర్తించారు.
పక్కా సమాచారంతోనే అరెస్టు!
నిందితురాళ్లు ఇద్దరు తమ అనుచరులతో కలిసి లింగాల ఘనపూర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో అరెస్టు రంగం సిద్ధం చేశారు. శనివారం నెల్లుట్ల బైపాస్ వద్ద బస్సుకోసం ఎదురుచూస్తున్నట్టుగా సమాచారం రావడంతో సిసిఎస్ ఇన్స్పెక్టర్లు, లింగాల ఘన్పూం ఎస్.వి తమ సిబ్బంది వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న వీరి అనుచరులు పోలీసులను గమనించి కారు వదిలి అక్కడి నుండి తప్పించుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు లేడీ కిలాడీలను పోలీసులు తమదైన శైలిలో విచారించగా వారు పాల్పడిన చోరీల గుట్టు బయటకు చెప్పి చోరీలను అంగీకరించారు.

కిలాడీ లేడీలను అరెస్టు చేసి భారీ మొత్తం బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా, ఘన్పూర్ ఎఎస్పీ వైభవ్ గైక్వాండ్, క్రైం ఎసిపి బాబురావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాసరావు, జనగాం రూరల్ ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్, లింగాల ఘణపూర్ ఎస్ఐ దేవేందర్, అసిస్టెంట్ ఆనాలటిక్ ఆఫీసర్ సల్మాన్ పాషా, సిసిఎస్ మహిళా ఎఎసై లు ఫర్వీన్, రాజేశ్వరి, ఎఎస్ఐ శివకుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రవికుమార్, అహ్మద్ పాషా, జంపయ్య కానిస్టేబుళ్లు మహమ్మద్ అలీ, వేణుగోపాల్, రాజశేఖర్, చంద్రశేకర్, నజీరుద్దీన్, మహిళా కానిస్టేబుళ్లు సంధ్య, నర్మదా, లామ్యాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి