Warangal cp tarun joshi వరంగల్: మత్తు పదార్థాల సేవించడంతో పాటు, వాటిని తరలించడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టాలని, నెలవారి నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీసు కమిషనర్ డా. తరుణ్ జోషి అన్నారు. ఈస్ట్ జోన్ పోలీసుల అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో (Warangal cp tarun joshi)నిర్వహించారు.
ఏసీపీలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ పరిధి(east zone)లో నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, రికవరీ, కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు వాటి స్థితి గతులపై పోలీసు కమిషనర్(Police Commissioner) కేసులు వారీగా సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రోడ్డు మార్గాల్లో పార్కింగ్ చేసి ఉన్న వాహనాల్లో కొన్ని ముఠాలు డీజిల్ చోరీల(Diesel theft gang)కు పాల్పడుతున్నట్టుగా పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇది దృష్టిలో ఉంచుకొని హైవేలపై తగు ముందస్తూ చర్యలు తీసుకోవడంతో పాటు, అధికారులు రోడ్డు ప్రమాదాల(road accident)కు గల కారణాలపై విశ్లేషణ చేసి రోడ్డు ప్రమాదాల కట్టడికి తగు రీతిలో చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు స్టేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించాలి. అలాగే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసు(missing case)లకు పరిష్కరించేందుకు గాను అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంటుందని, మిస్సింగ్ కేసుల్లోని వ్యక్తుల ఆచూకి కనుగొని వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించాలని, పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి సంబంధిత నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, ముఖ్యంగా కేసులు దర్యాప్తు చేసే సమయంలో అధికారులు ఎస్.ఓ.పిని అనుసరించాలని తెలిపారు.


నేరస్తుల నేరాలను కోర్టులో నిరూపించే విధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టు సమర్పించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబర్చాలని, నేరాలను కట్టడి చేయడంతో పాటు నేరస్తులను గుర్తించడంలో కీలకంగా నిలుస్తున్న సిసి కెమెరాల(cc camera) ఏర్పాటుపై అవగాహన కల్పించాలని వరంగల్ పోలీసు కమిషనర్ అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో ఎసిపిలు ఫణీందర్, నరేష్ కుమార్, శివరామయ్య, తిరుమల్, కరుణాసాగర్ రెడ్డితో పాటు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.
- Company IPO: కంపెనీ ఐపిఓలను ఎందుకు జారీ చేస్తుంది?
- Technical Analysis: స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ అంటే ఏమిటి?
- trailing stop loss:ట్రైలింగ్ స్టాప్‌లాస్ ఎలా ఉపయోగించాలి? | stock market
- stock market cycle: స్టాక్ మార్కెట్ సైకిల్, స్టేజెస్
- Munugode By Elections 2022: నా త్యాగం మునగోడు అభివృద్ధికి శ్రీకారమంటున్న రాజగోపాల్ రెడ్డి!