Warangal CP | Trafficకు సంబంధించిన నియమ, నిబంధనలు అవగతమయ్యే విధంగా వాహనదారుల్లో అవగాహన పెంపొందించాలని వరంగల్ పోలీసు ట్రాఫిక్ పోలీసు అధికారులకు పోలీసు కమిషనర్ డా.తరుణ్ జోషీ సూచించారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రాఫిక్ స్టేషన్లకు చెందిన Police అధికారులతో వరంగల్ పోలీస్ కమిషనర్(Warangal CP) సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.
Tri City పరిధిలోని ప్రధాన రోడ్డు మార్గాల్లో వాహనాల క్రమబద్ధీకరణ, రోడ్డు ప్రమాదాల నివారణ, కీలక వాహన రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలతో పాటు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై తీసుకోవాల్సిన చర్యలపై లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ అదనపు DCP పుష్పారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన Police Commissioner ట్రాఫిక్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు కమిషనర్ అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.
ఇందులో ముఖ్యంగా అధికారులు ఠాణాలకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందని, అధికారులు రోడ్లపై విధులు నిర్వహించడం ద్వారా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించేందుకు సంకోచిస్తారని అన్నారు.