Waltair Veerayya: వాళ్లిద్ద‌ర్నీ స్క్రీన్‌పై చూడ‌గానే అభిమానులు ఏమ‌న్నారంటే?

movie news

Waltair Veerayya: మెగస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజ ర‌వి తేజ క‌లిసి హీరోలుగా న‌టించిన చిత్రం వాల్తేరు వీర‌య్య‌. ఈ సినిమాపై ఇద్ద‌రి హీరోల అభిమానులు చాలా భారీ ఎత్తున ఆశ‌లు పెంచుకొని ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికీ పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను చూసిన అభిమానులు సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Waltair Veerayya: స్వ‌యం కృషితో ఎదిగిన హీరోలు

చిరంజీవి, ర‌వితేజ తొలిసారిగా క‌లిసి న‌టించిన సినిమా వాల్తేరు వీర‌య్య‌ Waltair Veerayya. ఈ సినిమా బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తుంది. ద‌ర్శ‌కుడు బాబీ గురించి చెప్పాలంటే మెగ‌స్టార్‌కు చాలా పెద్ద ఫ్యాన్ అని ఇటీవ‌ల ఫ్రీ-రిలీజ్ ఫంక్ష‌న్‌లో అభిమానుల ఎదుట తెలిపారు. తాను చిన్న‌ప్ప‌టి నుంచి మెగ‌స్టార్ సినిమాల‌ను చూసి పెరిగాన‌ని, ఇప్పుడు అభిమాన హీరోతోనే సినిమా తీయ‌డం జ‌న్మధ‌న్య‌మైన‌ట్టు ఉంద‌ని సంతోషం వ్యక్తం చేశాడు. వాల్తేరు వీర‌య్య సినిమాను ఒక వైపు అభిమానిగా, మ‌రో వైపు ద‌ర్శ‌కుడిగా ఆలోచించి తీశాన‌ని తెలిపారు.

మెగ‌స్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజ ర‌వితేజ Megastar Chiranjeevi, Maas Maha Raja Raviteja, అంటేనే మొట్ట మొద‌టిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తుకు వ‌చ్చేది? ఎటువంటి బ్యాక్‌బోన్ లేకుండా స్వ‌యంకృషితో రావ‌డం. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు టాప్ హీరోలుగా నిల‌బ‌డ్డారంటే క‌ష్ట‌ప‌డి న‌టించి, వాళ్ల న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకోవ‌డ‌మేన‌ని చెప్ప‌వ‌చ్చు. కొన్ని ద‌శాబ్ధాల నుంచి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సినిమాలు తీస్తూ సూప‌ర్ హిట్‌ల‌ను అందుకుంటున్న చిరంజీవి, ర‌వితేజ‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత ఉందో ఎలా ఆరాధిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

కానీ వాల్తేరు వీర‌య్య సినిమాలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌ను చూసిన ఇద్ద‌రి హీరోల అభిమానులు మాత్రం సంతోషాన్ని ఆపుకోలేక పోతున్నారు. ఈ సినిమాలో పూన‌కాలు లోడింగ్ పాట‌ Poonakaalu Loading, లో చిరంజీవి, ర‌వితేజ స్టెప్పుల‌ను చూసి నిజంగా అభిమానుల‌కు పూన‌కాలు వ‌చ్చిన‌ట్టేన‌ని అంటున్నారు. ఎన్నో సినిమాల‌కు సూప‌ర్ హిట్ సాంగ్స్‌ను, సంగీతాన్ని అందించి త‌న‌దైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు వీర లెవ‌ల్లో సంగీతాన్ని అందించారు. నిజంగా ఆ మ్యూజిక్ వింటే ప్రేక్ష‌కుల‌కు వైబ్రేష‌న్స్ వ‌చ్చిన‌ట్టు ఉన్నాయి.

మెగ‌స్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజ ర‌వితేజ‌ను అభిమానులు ముద్దుగా అన్న‌య్య ఆప్యాయంగా పిలుచుకుంటారు. అలానే వారిద్ద‌రూ అభిమానుల విష‌యంలో అంతే ప్రేమ‌ను చూపిస్తూ హ‌త్తుకుంటారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో ఎంతో మంది హీరోలు ఉన్న‌ప్ప‌టికీ క‌ష్ట‌ప‌డి పైకి ఎదిగిన హీరోలు మాత్రం చేతి వ్రేళ్ల‌పై లెక్క పెట్ట‌వ‌చ్చు. అలాంటి హీరోల్లో చిరంజీవి, ర‌వితేజ మొద‌టి స్థానంలో ఉన్నారు. రెండ్రోజుల కింద‌ట వైజాగ్‌లో వాల్తేరు వీర‌య్య సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేశారు.

ఆ ఫంక్ష‌న్‌లో కొన్ని వేల మంది అభిమానులు హాజ‌ర‌య్యారు. సినిమా ట్రైల‌ర్ , సాంగ్స్ చూసిన అభిమానులు సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందా అని ఎదురు చూస్తున్నారు. DSP అందించిన మ్యూజిక్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక స్టోరీ కూడా చాలా కొత్త‌గా ఉండ‌టంతో ఆస‌క్తి నెల‌కొంది. ఈ సంక్రాంతి పండుగ‌కు బ‌రిలో ఉన్న సినిమాలు చాలా ఉన్న‌ప్ప‌టికీ వాల్తేరు వీర‌య్య సినిమా కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఈ Waltair Veerayya సినిమా ఈ నెల 13న ప్రేక్ష‌కుల ఎదుట సంద‌డి చేయ‌నుంది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *