walking tips to lose weight శారీరక వ్యాయమం, సాధారణ నడక మన శరీరంపై చూపే ప్రయోజనాలు గమనిస్తే నిజంగానే ఆశ్చర్యమేస్తోంది. నడక ప్రారంభించిన నిమిషం నుంచి 5 నిమిషాల్లోపు గమనిస్తే, శరీర కణాల్లోంచి శక్తిని ఉత్పత్తి చేసే రసాయనాలు విడుదలవుతాయి. గుండె నిమిషానికి 70 నుండి 100 సార్లు కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. నడక వేగం పెంచి కొలదీ శరీరంలోని రక్త ప్రసరణ వేగం పెరిగి కండరాలకు ఉత్తేజాన్ని కలుగ జేస్తుంది. చేతులు, కాళ్లలోని జాయింట్లలో ఉన్న బిగువును తగ్గి లూబ్రికేటింగ్ ద్రవాన్ని విడుదల కారణంగా అవయవాల కదలిక (walking tips to lose weight) తేలిగ్గా ఉంటుంది.
నడకతో కెలోరీలు ఖర్చు!
నడక ప్రారంభించిన కొద్ది నిమిషాల్లో శరీరం తేలిగ్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. నడక ఆపేసిన రోజున శరీరం బిగదీసుకున్నట్టుగా మనం గనమిస్తాం. 1 నిమిషం శరీరం విశ్రాంతి తీసుకోవడంతో పోల్చుకుంటే నడుస్తున్న కొలదీ నిమిషానికి మన శరీరం 5 కెలోరీలను ఖర్చు చేస్తుంది. శరీరంలోని కార్బొహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు కరిగించేందుకు గాను శరీరానికి తగినంత వ్రమ ఇవ్వవలసి ఉంది. నడక వేగం ప్రారంభించిన 6 నుంచి 10 నిమిషాలలోపు గుండెవేగం పెరిగి నిమిషానికి 6 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. రక్తపోటు కూడా కొద్దిగా పెరుగుతుంది. రక్తనాళాల పరిణామం పెరిగి కండరాలకు మరింత రక్తాన్ని ఆక్సిజన్‌ను అందిస్తుంది.


కండరాలకు తగిన శక్తి విడుదల!
11 నుంచి 20 నిమిషాల్లో శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ, చర్మం దగ్గరిలోని రక్తనాళాల ప్రసారం మరింత పెరిగి వేడిని కలుగజేస్తుంది. బ్రిస్క్ వాక్ చేస్తున్న కొద్దీ, నిమిషానికి మన శరీరం 7 కేలరీలను బర్న్ చేస్తుంది. ఎపినీఫ్రైన్, గ్లుకజోన్ హోర్మోన్‌లు కండరాలకు తగిన శక్తిని విడుదల చేస్తాయి. 21 నుంచి 45 నిమిషాల నడకలో శరీరంలోని టెన్షన్‌లు తొలగిపోయి శక్తిగా ఉంటుంది. మెదడులోని ఎండార్ఫిన్స్ విడుదలతో మంచి రసాయనాలు విడుదలై శరీరానికి ఉత్తేజాన్ని, సంతోషాన్ని కలుగజేస్తాయి.
శరీరంలోని కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. 46 నుంచి 60 నిమిషాల కాలంలో కండరాలు కొద్దిగా అలసినట్టు అనిపిస్తుంది. శరీరంలోని కార్పొహైడ్రేట్స్ నిల్వలు తగ్గడం ప్రారంభమై శరీరంలోని అధికంగా ఉన్న కొవ్వు నిదానంగా తగ్గడంతో శరీరం తేలిగ్గా ఉన్నట్టు అనుభూతి చెందుతాం. శరీరంలోని జరిగే ఈ మార్పులన్నీ సాధారణ నడకవలన జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


walking tips to lose weight
1.బరువును సమంగా ఉంచుతుంది.
2.ఎవరైనా నడక చేయవచ్చు
3.నడకకు ఎటువంటి పరికరాలు అవసరం లేదు.
4.ఉత్సాహంగా ఉండేందుకు చాలా తేలికైన ఉపాయం
5.కృంగుబాటుని, అతిశయోక్తిని తగ్గిస్తుంది.
6.ఒత్తిడి లేని వ్యాయామం ఇదే
7.శరీరంలో కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది.
8.బీపిని నియంత్రణలో ఉంచుతుంది.
9.కొన్ని క్యాన్సర్ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.
10.షుగరు వ్యాధి ఉన్నవారికి ముఖ్యంగా బాగా పనిచేస్తుంది.
11.మన మానసిక స్థితిని బలపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.
12.ఎముకలను గట్టిగా దృఢంగా చేస్తుంది.
13.గుండె పోటు సమస్య రాకుండా కాపాడుతుంది.
14.శరీర కండరాలను సమతులంగా చేస్తుంది.
15.దీనికి ఖర్చు పెట్టే అవసరమూ లేదు.
- srirama navami : రామ చరితం గురించి మీకు తెలుసా?
- general knowledge 2022 : జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, జవాబులు
- Teenmar mallanna : తీన్మార్ మల్లన్నను ఎక్కడికి తీసుకెళ్లారు
- obesity meaning in telugu: ఒబెసిటీ అంటే ఏమిటి?
- patanjali coconut oil: పతంజలి కొబ్బరి నూనె విశేషాలు!