Vrushaba Rasi 2023

Vrushaba Rasi 2023: వృష‌భ రాశి వారి ఫ‌లాలు 2023 లో ఎలా ఉన్నాయి?

Special Stories

Vrushaba Rasi 2023: రానున్న నూత‌న సంవ‌త్స‌రం ఇంకా ఒక నెల రోజులు స‌మ‌యం ఉంది. 2023 సంవ‌త్స‌రంలో అంతా మంచి జ‌ర‌గాల‌ని, మంచి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. ఇలాంటి స‌మ‌యంలో కొంద‌రు వారి రాశి ఫ‌లాల‌ను ప‌రీక్షించుకుంటుంటారు. గ‌డిచిన ఏడాది ఎలా ఉంది?. ఇప్పుడు నూత‌న సంవ‌త్స‌రం ఎలా ఉండ‌బోతోందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. కాబ‌ట్టి వారి రాశి ఫ‌లాల‌ను ప‌ట్టి వారు చేసే ప‌నుల‌ను, కార్య‌క్ర‌మాల‌ను స‌రిదిద్దుకుంటుంటారు.

కొంత మందికి 2022 సంవ‌త్స‌రం పెద్ద‌గా క‌లిసి రాక‌పోవ‌చ్చు. వ్యాపారం చేసేవారికి, ఉద్యోగాలు, ఇత‌ర ప‌నులు చేసేవారికి ఇబ్బందులు ఎదురై ఇబ్బంది ప‌డి ఉండ‌వ‌చ్చు. న‌ష్టాల‌ను, బాధ‌ల‌ను ఎదుర్కొనే ఉంటారు. అలాంటి వారికి మ‌రి నూత‌న సంవ‌త్స‌ర‌మైన 2023 ఏమి ఆహ్వానం ప‌ల‌క‌బోతోందో ఆస్ట్రాల‌జీ (Astrology) జ్యోతిష్యులు చెబుతున్నారు. కొంద‌రు వారికి తెలిసిన ఆస్ట్రాల‌జీ (Astrology) పండితుల‌ను సంప్ర‌దిస్తున్నారు. 2023 నూత‌న సంవ‌త్స‌రం గురించి వారి రాశి ఫ‌లాల‌ను అడిగి తెలుసుకుంటున్నారు.

ప్ర‌తి ఒక్క మ‌నిషి జీవితాన్ని నిర్ధేశించేది మాత్రం కాలం. ఇది జ‌గ‌మెరిగిన‌ స‌త్యం, కాబ‌ట్టి కాలం ఎలా ఉంటే మ‌న జీవితంలో మ‌నం అలా ఉంటాం అని అంద‌రూ న‌మ్మాల్నిందే. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఒక ప్లాన్ వేసుకొని ఈ స‌మ‌యానికి అది అయిపోవాలి, ఇది అయిపోవాల‌ని క‌ల‌లు కంటుంటారు. మ‌నం అనుకున్న ప్లాన్ అమ‌ల‌వ్వ‌డం ఒట్టి భ్ర‌మ అంటున్నారు జ్యోతిష్యులు. కాబ‌ట్టి ప్లాన్ చేయాల్సింది ప్ర‌కృతి మాత్ర‌మే. ప్ర‌కృతి ఎలా చేస్తే మ‌న భ‌విష్యుత్తు అలా ముందుకు వెళ్లిపోతుంది. కావున దానిని ముందుగానే అంచ‌నా వేయ‌డానికి దోహ‌ద‌ప‌డేదే ఆస్ట్రాల‌జీ.

ఇక 2023 నూత‌న సంవ‌త్స‌రం రాశుల ప‌రంగా ప‌రిశీలిస్తే ఆరు రాసుల‌ వారికి బాగుంటుంద‌ని, మిగిలిన ఆరు రాశుల వారికి కాస్ట క‌ష్టంగా ఉండ‌బోతోంద‌ని ఆస్ట్రాల‌జీ నిపుణులు చెబుతున్నారు. ప్ర‌తి ఏడాది ఈ 12 రాశుల‌లో ఆరు రాశులు బాగుంటే, మిగిలిన ఆరు రాశులు క‌ష్టంగా ఉంటాయ‌ని అంటున్నారు. ఈ ఏడాది కూడా అదే జ‌ర‌గ‌బోతోంద‌ని చెబుతున్నారు. ఇప్పుడు వృషభ రాశి (Vrushaba Rasi 2023) ఫ‌లాల గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

Vrushaba Rasi 2023: వృష‌భ రాశి వారి ఫ‌లాలు

వృష‌భ రాశి వారికి 2023లో జ‌న‌వ‌రి 26 నుంచి చాలా అద్భుతంగా ఉండ‌బోతోంది. ఈ రాశి వారికి ఉన్న క‌ష్టాల‌న్నీ తొలిగిపోబోతున్నాయి. వృషభ రాశి వారికి రానున్న ఆరు సంవ‌త్స‌రాలు గోల్డెన్ డేస్ రాబోతున్నాయ‌ట‌. మేష‌రాశి వారైన వీరికి 10వ స్థానంలో శ‌నిగ్ర‌హం ప్ర‌వేశిస్తుంది. శ‌ని ప‌ద‌వ స్థానంలోకి వ‌స్తే వృషభ రాశి వారికి కొన్ని మైన‌స్ పాయింట్లు, ప్ల‌స్ పాయింట్లు ఉన్నాయ‌ని ఆస్ట్రాల‌జీ నిపుణులు చెబుతున్నారు.

మైన‌స్ పాయింట్లు ఏమిటంటే ముఖ్యంగా ఉద్యోగంలో మార్పులు రాబోతున్నాయ‌ట‌. ఉద్యోగం పోవ‌డం లాంటివి జ‌ర‌గవ‌చ్చ‌ని కానీ ఎలాంటి బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. కాబ‌ట్టి గ్రహాల మార్పు అనుకూలించ‌డంతో ఈ రాశి వారు మ‌రింత ఉన్న‌త స్థానంలోకి చేరేందుకు ఈ ఏడాది అనుకూలంగా ఉండ‌బోతుంద‌ట‌. చ‌రిత్ర‌లో ఎంతో మంది ప్ర‌ముఖులు ఇలా ఎదిగిన వారే అని ముఖ్యంగా సినీ ప్ర‌ముఖులు ఇలా అప్‌గ్రేడ్ అయ్యార‌ని చెబుతున్నారు.

వృష‌భ రాశి (Vrushaba Rasi 2023) వారికి శ‌నిగ్ర‌హం రెండున్న‌ర సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇప్పుడు 11వ స్థానానికి వ‌స్తున్నాడు. కాబ‌ట్టి శ‌ని ప‌ద‌కొండ‌వ స్థానానికి వ‌స్తే అదృష్టం వ‌రించ‌బోతుంద‌ట‌. అలాగే గురుగ్ర‌హం వృష‌భ రాశి వారికి 11వ స్థానంలో ఉన్నాడ‌ని, కాబ‌ట్టి 2023లో విప‌రీత‌మైన ఆర్థిక లాభాలు పొందే అవ‌కాశం ఈ రాశి వారికి ఉందంట‌. కాబ‌ట్టి వ్యాపారాలు చేసే వారికి, కొత్త‌గా పెట్టేవారికి ఇది చాలా అనుకూల స‌మ‌యం అంట‌.

వ్యాపారాలు చేసే వారు కాస్త అప‌గ్రేడ్ అయితే 2023లో మంచి ప్లానింగ్ చేసి ట్రాక్‌లో ప‌డితే రాబోయే 5 సంవ‌త్స‌రాలు ఎలాంటి ఆట‌కం లేకుండా ముందుకు సాగిపోతుంటారు. ఆస్తిపాస్తులు అమ్ముకున్న వారికి ఆ డ‌బ్బుల‌ను రొటేట్ చేస్తూ ఉంటే లాభాలు పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంటున్నారు. కానీ ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించొద్ద‌ని అంటున్నారు. ఎలాంటి ఒప్పందాలు, మాట‌లు ఇవ్వ‌ద్ద‌ని జ్యోతిష్యులు చెబుపుతున్నారు. ఎందుకంటే వారికి ఉన్న విశిష్ట‌త‌, పేరు ప్ర‌ఖ్యాత‌లు ఇలాంటి వాటి వ‌ల్లే వెళ్లే అవ‌కాశం ఉంద‌ట‌. మొత్తంగా వృష‌భ రాశి వారికి ఎలాంటి డోకా లేదంట‌.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *