Vruschika Rasi 2023: రాబోయే నూతన సంవత్సరం ఇంకా 30 రోజుల సమయం ఉంది. 2023 సంవత్సరంలో అంతా మంచి జరగాలని, మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో కొందరు వారి రాశి ఫలాలను పరీక్షించుకుంటుంటారు. గడిచిన ఏడాది ఎలా ఉంది?. నూతన సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారి రాశి ఫలాలను పట్టి వారు చేసే పనులను, కార్యక్రమాలను సరిదిద్దుకుంటుంటారు.
కొంత మందికి 2022 సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు. వ్యాపారం చేసేవారికి, ఉద్యోగాలు, ఇతర పనులు చేసేవారికి ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు. నష్టాలను, బాధలను ఎదుర్కొనే ఉంటారు. అలాంటి వారికి మరి 2023 సంవత్సరం ఏమి ఆహ్వానం పలకబోతోందో ఆస్ట్రాలజీ (Astrology) జ్యోతిష్యులు ఇప్పటికే చెప్పేస్తున్నారు. కొందరు వారికి తెలిసిన ఆస్ట్రాలజీ పండితులను సంప్రదించి నూతన సంవత్సరం గురించి వారి రాశి ఫలాలను తెలుసుకుంటున్నారు.
ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నిర్ధేశించేది మాత్రం కాలం. కాబట్టి కాలం ఎలా ఉంటే మన జీవితంలో మనం అలా ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్లాన్ వేసుకొని ఈ సమయానికి అది అయిపోవాలి, ఇది అయిపోవాలని కలలు కంటారు. మనం అనుకున్న ప్లాన్ అమలవ్వడం ఒట్టి భ్రమ అంటున్నారు జ్యోతిష్యులు. కాబట్టి ప్లాన్ చేయాల్సిన ప్రకృతి. ప్రకృతి ఎలా చేస్తే మన భవిష్యుత్తు అలా ముందుకు వెళ్లిపోతుంది. కావున దానిని ముందుగానే అంచనా వేయడానికి దోహదపడేదే ఆస్ట్రాలజీ.
ఇక 2023 నూతన సంవత్సరం రాశుల పరంగా పరిశీలిస్తే నాలుగైదే రాశుల వారికి బాగుంటుందని, మిగిలిన ఆరు రాశుల వారికి కాస్ట కష్టంగా ఉండబోతోందని ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏడాది ఈ 12 రాశులలో ఆరు రాశులు బాగుంటే, మిగిలిన ఆరు రాశులు కష్టంగా ఉంటాయని అంటున్నారు. ఈ ఏడాది కూడా అదే జరగబోతోందని చెబుతున్నారు.
అయితే 2023లో జనవరి 26 నుంచి గ్రహాలు మారుతున్నాయని, శని, గురు గ్రహాలు మాత్రమే ఏడాదికి ఒకసారి మారుతాయని అంటున్నారు. మిగిలిన గ్రహాలు ఒక నెలకు, మూడునెలలకు, ఆరు నెలలకు ఒకసారి మారతాయని చెబుతున్నారు. కాబట్టి గురుగ్రహం 12 నెలలకు ఒకసారి మారుతుంటాడు. శనిగ్రహం రెండున్నర సంవత్సరాలకొక్కసారి మారుతుంటాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం శనిగ్రహం మారుతున్నాడు. ఇప్పుడు Vruschika Rasi 2023 లో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.
Vruschika Rasi 2023: వృశ్చిక రాశి వారి ఫలాలు
వృశ్చిర రాశి వారికి 2023 సంవత్సరంలో ఫైనాన్షియల్‌గా సూపర్‌గా ఉండబోతోంది. ఈ రాశి వారు తల్లిదండ్రులలో ఎవరైనా ఉంటే వీరి పిల్లలకు, వీరి నుండి కలిసి వచ్చే అవకాశం ఉందంట. కాబట్టి వీరి పిల్లలకు జనవరి 27, 2023న వారి చేతుల్లో ఒక రూ.100, రూ.500 కానీ పెట్టి, దీవించమంటున్నారు ఆస్ట్రాలజీ పండితులు. వృశ్చిక రాశి వారు వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుందట. ముఖ్యంగా బంగార వ్యాపారం, విద్యా సంస్థలు ఉన్నవారికి బాగుంటుందంటున్నారు. ఉద్యోగాలు చేసే వారికి కూడా ఈ ఏడాది కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇక ఈ వృశ్చిక రాశి (Scorpio) వారికి కుటుంబ కలహాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందట. ముఖ్యంగా అన్నదమ్ముల గొడవలు, ఇతరులతో గొడవలు, పోలీసు కేసులు అవ్వడం, తల్లికి అనారోగ్యం ఉండటం ఇవ్వన్నీ ఇబ్బంది పెట్టే అంశాలు అంటున్నారు జ్యోతిష్యులు. ఇవి తప్ప మిగతా అన్ని రోజులూ అంతా బాగుంటుందని చెబుతున్నారు. వృశ్చిక రాశివారికి 2022 వరకు శనిగ్రహం అనుకూలంగా ఉందట. ఇప్పుడు శనిగ్రహం అనుకూలంగా లేడని పేర్కొంటున్నారు.
ఈ రాశి వారి ఇంట్లో కుటుంబ కలహాలు అత్తా-కోడళ్ల తగాదాలు, భార్యతో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి ఈ రాశి వారు సైలెంట్‌గా ఉండి, వాదోపవాదాలకు దిగకుండా ఉంటే చాలా మంచిది అని అంటున్నారు. ముఖ్యంగా ఎదుట వ్యక్తికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని చెబుతున్నారు. ఇక వీరికి అనురాధ నక్షత్రం కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎక్కువ ఊహాజనిత ఆశలు పెంచుకోకుండా ఉంటే మంచిది అంటున్నారు. ఎందుకంటే ఎవరూ సహాయం చేసేవారు ఉండకపోవచ్చని, కాబట్టి పెద్దగా వీరికి ప్రమాదం ఏమీ లేదని పేర్కొంటున్నారు.
అన్నీ శుభపరిణామాలే!
Vruschika Rasi 2023: ఇక 2023 సంవత్సరంలో వృశ్చికరాశి వారు టాప్ 10లో 4వ స్థానంలో ఉండబోతున్నారట. అంతగా బాధపడే అంశాలు ఏమీ లేవని, జాగ్రత్తగా ఉంటే అంతా మంచే జరుగు తుందని చెబుతున్నారు. వీరికి గురుగ్రహం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫైనాన్షియల్‌గా, కెరీర్లో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతున్నారు. వీరికి విశాఖ నక్షత్రం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు అయ్యే అవకాశం ఈ ఏడాది మెండుగా ఉందంట.
ముఖ్యంగా న్యాయ విభాగంలో పని చేసేవారికి ఉన్నత స్థాయికి ఎదుగేందుకు ఈ ఏడాది కలిసి రాబోతుంది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడే వారికి కచ్చితంగా మంచి ఫలితాలను అందుకోబోతున్నారట. ఇక 2023లో వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు, అక్టోబర్ 14 నుంచి నవంబర్ 14 వరకు, ఫిబ్రవరి 14 నుంచి మార్చి 14 వరకు వీరికి కలిసి వచ్చే శుభపరిణామమైన గడియలంట. కాబట్టి వృశ్చిక రాశి వారు కంగారు పడాల్సిన పనిలేదని అంతా మంచే జరుగుతుందని ఆస్ట్రాలజీ పండితులు చెబుతున్నారు.