VRA ల స‌మ్మెకు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ మ‌ద్ద‌తు

VRA: వీఆర్ఏల జెఎసి ఆధ్వ‌ర్యంలో గ‌త నాలుగు రోజుల నుండి అర్బ‌న్‌, Khammam రూర‌ల్ మండ‌ల త‌హ‌శీల్దార్ కార్యాల‌యం ఎదుట చేస్తున్న దీక్ష‌ల‌కు మ‌ద్ద‌తుగా Bahujana స‌మాజ్ పార్టీ(BSP) మ‌హిళా జిల్లా క‌న్వీన‌ర్‌, జోన‌ల్ క‌న్వీర్ వ‌ర‌కాల విజ‌య‌కుమారి, జిల్లా నాయ‌కుడు ఒగ్గు బాబురావు రిటైర్డ్ ఎస్సైలు ప‌లికి దీక్షా శిబిరంలో పాల్గొని మాట్లాడారు.

త‌మ దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాల‌ని, VRA ల‌కు పే స్కేలు హామీల‌ను నిల‌బెట్టుకోవాల‌ని, వారి యొక్క న్యాయ‌బ‌ద్ధమైన కోరిక‌ల‌ను తీర్చాల‌ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట‌ను నెర‌వేర్చ‌కుండా సీఎం KCR కాల‌యాప‌న చేస్తున్నార‌ని, వీఆర్ఏల‌ను చిన్న చూపు చూడ‌టం మీకు త‌గ‌ద‌ని అన్నారు.అర్హ‌త క‌లిగిన VRA ల‌కు ప్ర‌మోష‌న్లు క‌ల్పించాల‌ని, 55 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వీఆర్ఏ వార‌సుల‌కు ఉద్యోగాలు క‌ల్పించాల‌ని, ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, పెన్ష‌న్ల సౌక‌ర్యం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధ‌న‌లో బ‌హుజ‌న బిడ్డ‌లు వీఆర్ఏల త‌ర‌పున బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ అండ‌గా ఉండి పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా రూర‌ల్ మండ‌ల అధ్య‌క్షులు చాంద్‌మియ‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వీర‌య్య‌, Treasurer నాగ‌రాజు, ఉపాధ్య‌క్షులు రామారావు, గాలి సువ‌ర్ణ‌, అర్బ‌న్ మండ‌ల అధ్య‌క్షులు రాఘ‌వ‌రావు, ఛార్లెస్‌, ర‌మేష్‌లు మాట్లాడారు.

Khammam దీక్ష‌లో పాల్గొన్న VRA లు

త‌మ డిమాండ్ల ప‌ట్ల ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ నాయ‌కులు విజ‌య‌ల‌క్ష్మి, ఉమారాణి, సుజాత‌, శ్రీ‌దేవి, రాధిక‌, శ్రావ‌ణి, ఉపేంద్ర‌మ్మ‌, క‌ళావ‌తి, సులోచ‌నా, ర‌జియా, జ‌నార్థ‌న్‌, విన‌య్ కుమార్‌, కుక్క‌ల రాములు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *