Pension : ల‌బోదిబో మంటున్న ల‌బ్ధిదారులు

Pension : ఒక‌టో తారీఖు పంపిణీ చేయాల్సిన పింఛ‌నీ డ‌బ్బుల‌ను తీసుకుని ఓ వాలంటీర్ క‌నిపించ‌కుండా పోయాడు. అధికారులు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వ‌స్తుంది. దీంతో ల‌బ్దిదారులు ఆందోళ‌న చెందుతున్నారు.


Pension : ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేయాల్సిన సొమ్ముతో ఓ వాలంటీరు ప‌రార‌య్యాడు. ఈ సంఘ‌ట‌న అనంత‌పురం జిల్లా కొత్త చెరువు మండ‌లంలోని జ‌రిగింది. ఒక‌టో తేదీన పింఛ‌న్లు పంపిణీ చేసేందుకు గ్రామ స‌చివాల యాల‌కు చెందిన కార్య‌ద‌ర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆయా క్ల‌స్ట‌ర్ల‌కు చెందిన వాలంటీర్ల‌కు శుక్ర‌వారం డ‌బ్బులు అందించారు. 43 మంది ల‌బ్దిదారుల‌కు పింఛ‌న్లు పంపిణీ చేసేందుకు బైరాపురం పంచాయ‌తీకిచెందిన ఒక‌టో క్ల‌స్ట‌ర్ వాలంటీరు మ‌ధుసూద‌న్ రెడ్డి రూ.1,05,500 తీసుకున్నాడు. డ‌బ్బులు తీసుకున్న‌ప్ప‌టికీ శ‌నివారం సాయంత్రం వ‌ర‌కు డ‌బ్బులు పంపిణీ కాక‌పోవ‌డంతో ల‌బ్ధిదారులు అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మ‌ధుసూద‌న్ రెడ్డికి అధికారులు ఫోన్ చేయ‌గా స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. దీంతో కుటుంబ స‌భ్యుల‌ను సంప్ర‌దించ‌గా ఇంటికి రాలేద‌ని చెప్పారు. దీంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మ‌ధుసూద‌న్ రెడ్డి డ‌బ్బులు తీసుకుని ప‌రారైన‌ట్టు ఈవోఆర్డీ న‌టరాజ్ ధ్రువీక‌రించారు.

చ‌ద‌వండి :  TTD Budget 2021-2022 : వెంక‌న్న స‌న్నిధిలో భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *