vizag latest news in telugu| visakhapatnam news: స‌ర‌దా కాస్త ప్రాణాల‌మీద‌కు..!

vizag latest news in telugu|visakhapatnam news: స‌ర‌దా కాస్త ప్రాణాల‌మీద‌కు..! విశాఖ‌ప‌ట్ట‌ణం : విశాఖ‌ప‌ట్ట‌ణం  ప‌రిధిలో పెను ప్ర‌మాదం నుంచి త‌ప్పించు కున్నారు యువ‌కులు. విష‌యానికి వస్తే యార‌డాలో తీరంలో ఆది వారం ఆట‌వి డుపుగా వెళ్లిన ఏడుగురు యువ‌కులు స‌ముద్రంలో ఈత కొడుతున్నారు. అదే స‌మ‌యంలో అల‌ల తాకిడి ఎక్కువ అవ్వ‌డంతో వారిలో ముగ్గురు యువ‌కులు కొట్టుకుపోయారు.

vizag latest news in telugu

అనంత‌రం పిట్ల కొండ వ‌ద్ద రాళ్ల‌ల్లో యువ‌కులు చిక్కుకున్నారు. మిగిలిన స్నేహితులు అప్ర‌మ‌త్త‌మై వెంట‌నే న్యూ పోర్ట్ పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన రెవెన్యూ, రెస్కూ, అగ్నిమాప‌క సిబ్బంది, గ‌జ ఈత‌గాళ్లు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. యువ‌కుల‌ను ర‌క్షించేందుకు అధికార యంత్రాంగం విశ్వ‌ప్ర‌య‌త్నం చేసింది. ఎట్ట‌కేల‌కు అర్థ‌రాత్రి ఒంటిగంట‌న్న‌ర స‌మ‌యంలో న‌గ‌రానికి చెందిన కొండ న‌వీన్‌(20), భీశెట్టి య‌శ్వంత్ (20), కె.శ్ర‌వ‌ణ్‌(20) ను గ‌జ ఈత‌గాళ్లు ర‌క్షించి ఒడ్డ‌కు తీసుకొచ్చారు. వారికి పోలీసులు కౌన్సిలింగ్‌తో హెచ్చ‌రించి పంపించారు. ప్రాణాల‌తో తీరానికి యువ‌కులు చేర‌డంతో స్నేహితులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *