Vitamins Tablets | విటమిన్, మినరల్ మాత్రలు కేవలం సంతృప్తి కోసం తప్పితే వాటితో పెద్దగా ప్రయోజనం గానీ, హానిగానీ ఉండదని ఓ అధ్యాయనం తేల్చింది. టోరంటో విశ్వవిద్యాలం, సెయింట్ మైఖేల్ ఆసుపత్రి పరిశోధ కులు దీన్ని చేపట్టారు. జనవరి, 2012 – అక్టోబర్, 2017 మధ్య మల్టీ విటమిన్, విటమిన్-డి, కాల్షియం, విటమిన్-సి (Vitamins Tablets) మాత్రలను వాడిన హృద్రోగుల ఆరోగ్య పరిస్థితిని వారు సమీక్షించారు. ఈ సప్లిమెంట్ల వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం లేకపోయిందనీ, గుండెపోటు, ముందస్తు మరణాలను నిలువరించలేకపోయాయని వారు విశ్లేషించారు.
”ఈ మాత్రలతో ఎలాంటి ప్రమాదం లేదు. ప్రయోజనాలూ పెద్దగా ఉండవు. అయితే, పోలీక్ యాసిడ్, విటమిన్-బితో కూడి ఫోలిక్ యాసిడ్ మాత్రలతో హృద్రోగ ముప్పు కొంత తగ్గుతుందని మాత్రం గమనించాం. ఔషధాలపై ఆధారపడం కంటే, ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ను భర్తీ చేసుకోవడం ఉత్తమం.” అని పరిశోధనకు నేతృత్వం వహించిన డా.డేవిడ్ జెన్కిన్స్ చెప్పారు.
hearing problem: ఇక వినపడదండి!
చాలా మంది 30 ఏళ్ల లోపు కుర్రాళ్లు నిత్యం భారీ శబ్దంతో సంగీతం వింటున్నారనీ, వీరికి భవిష్యత్తులో వినికిడి సమస్య వచ్చే ప్రమాదముందని అమెరికాలోని సెంట్రల్ మిడిల్ సెక్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ పీడి యాట్రిక్ ఆడియాలజిస్ట్, పరిశోధకుడు రాస్బిన్ సయీద్ అంటున్నారు. సెల్ఫోన్లు, హెడ్ ఫోన్స్, ఇతరత్రా సౌండ్ పరికరాల ద్వారా పెద్ద శబ్ధంతో పాటలు వినడం, జంబోజెట్ విమాన శబ్ధంతో సమానం. చెవి లోపలి శబ్దగ్రాహక అవయవం కోక్లియా చాలా సున్నితమైనది. భారీ శబ్ధాల వల్ల దీని పనితీరు దెబ్బతిని, వినికిడి సమస్య తలెత్తుతుంది.

ఒక్క బ్రిటన్‌లోనే ప్రస్తుతం 11 మిలియన్ మంది యువత ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, హెచ్చుస్థాయిలో నిత్యం పాటలు వినేవారిలో 40% మందిని భవిష్యత్తులో వినికిడి సమస్య వేధించవచ్చు. అని హెచ్చరిస్తున్నారు సయీద్.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!