Vitamins Health Effects | విటమిన్లు, ఖనిజాల్ని టాబ్లెట్స్ రూపంలో వేసుకోవడం మంచిదే. కానీ డాక్టర్ల సలహా లేకుండా కొందరు తమ సొంత నిర్ణయాలతో కొని, వేసేసుకుంటారు. ఇది మంచిది కాదు. వీటిని అవసరానికి మించి వాడితే లాభం కన్నా నష్టమే ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా క్యాల్షియం, విటమిన్-ఎ విషయంలో చాలా(Vitamins Health Effects) జాగ్రత్తగా ఉండాలి.
Calcium
ఎముకల నిర్మాణంలో వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో క్యాల్షియం కీలక పాత్ర వహిస్తుంది. అందుకే ఎముకల క్షీణతను నివారించడానికి డాక్టర్లు వయసు మీరిన వారికి పెద్ద మొత్తంలో క్యాల్షియం టాబ్లెట్లను వాడమంటారు. అయితే రోజుకి 1000-1200 మి.గ్రా. క్యాల్షియం తీసుకునేవారికి గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. క్యాల్షియం మన ఎముకల్లో చేరడానికి విటమిన్ డి తోడ్పడుతుంది. ఇది తగినంత లేకపోతే అదనపు క్యాల్షియం రక్తనాళాల్లో ఉండిపోయి, రక్త సరఫరాకు అడ్డు పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు.
క్యాల్షియం ఎక్కువైతే కండరాల నొప్పి, కడుపు నొప్పి, మూత్ర పిండాల్లో రాళ్లు, మూడ్ మారిపోవట వంటి సమస్యలు ఎదురవుతాయట! అందుకే సాధ్యమైనంత వరకూ ఆహారంలోనే తగినంత క్యాల్షియం ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి క్యాల్షియాన్ని శరీరం గ్రహించడం తేలిక అంటున్నారు నిపుణులు. వెన్న తీసిన పాలు, పెరుగు, తాజా ఆకుకూరలు, పప్పులు, బీన్స్, fish, నువ్వుల్లో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది.
Vitamin A
ఇది కంటి చూపును మెరుగపర్చడానికి తోడ్పడుతుంది. Skin, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలన్నా ఇది అవసరమే. అంతే కాదు మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందాలంటే ఇదే కీలకం. విటమిన్ ఎ లోపంతో రేచీకటి, శ్వాస సమస్యలు, కళ్ల చుట్టూ ఉన్న చర్మం పొడిబారటం, చర్మంపై పొలుసులుగా ఏర్పడటం జరుగుతుంది. అయితే కొవ్వులో కరిగిపోయే Vitamin ఎ మోతాదు ఎక్కువైతే మాత్రం శరీరంలో కొవ్వు అంతా పోగుపడిపోయేలా, వెలుపలకు రాకుండా చేస్తుంది.


అంతే కాదు ఇది ఎక్కువైనప్పుడు విటమిన్ డికి వ్యతిరేకంగా పనిచేసి, ఎముకలు క్షీణించిపోయే ప్రమాదమూ ఉంది. అందువల్ల ఆహారంలోనైనా, Tablets రూపంలోనైనా ప్రతి రోజూ విటమిన్ ఎ 5,000 IU కన్నా మించకుండా చూసుకోవాలని నిపుణులు(Vitamins Health Effects) హెచ్చరిస్తున్నారు. నారింజ, క్యారెట్లు, చిలకడదుంపలు, బొప్పాయి, ఆకు కూరలు, గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ A పుష్కలంగా లభిస్తుంది. క్రమం తప్పకుండా మన ఆహారంలో ఇవి ఉండేలా చూసుకుంటే చాలు, టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు.