Vitamin Q | కళ్ల పక్కన గీతలు కనిపిస్తున్నాయా? నుదుటి మీద గీతలు ఉన్నట్టు గమనించారా? నవ్వితే మూతికిరువైపులా వలయాలు ఏర్పడుతున్నాయా, అయితే అవి వయసు పైబడుతున్న సంకేతాలు అని తెలుసుకోవాలి. ఈ చిహ్నాలను విటమిన్ క్యు(శాస్త్రీయ నామంః Coenzyme Q10) అనే యాంటీ ఎజింగ్తో సరి చేసుకోవచ్చు.
Vitamin Q గురించి తెలుసుకుందాం!
క్యు విటమిన్ సహాజంగా, మానవుల ప్రతి కణంలోనూ ఉంటుంది. ప్రతి కణంలో కొవ్వును, చక్కెరను శక్తిగా మార్చే, పవర్ హౌస్ లా పనిచేసే mitochondria పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. విటమిన్ క్యు కృత్రిమంగా దొరికే మందు కాదు. రకరకాల మాంసాహారాల్లోను, పాలకూర, సోయా చిక్కుడు, వేరు శనగవంటి ఆహార పదార్థాల లోను విటమిన్ క్యు పుష్కలంగా ఉంటుంది. కణాల పెరుగుదల, నిర్వహణలో యాంటీ ఏజింగ్ వృద్ధాప్యలక్షణాలను తగ్గించడం అనే శాస్త్రీయ వ్యవస్థకు మద్దతునిచ్చే ఘనమైన పోషక పదార్థం ఇది. వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి కలిగి ఉంటుంది కాబట్టి దీనిని సూపర్ న్యూట్రియెంట్ అంటారు. ఈ మ్యాజిక్ vitamin క్యు, విటమిన్ ఇ, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్ల చురుకుదనాన్ని పెంచుతుంది. యాంటీ ఏజింగ్‌కు వ్యతిరేకంగా పోరాడటమే కాక ఈ న్యూట్రియెంట్ వలన ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి.
cancer చికిత్స దుష్ఫరిణామాలను దరిచేరనివ్వదు. బ్లడ్ ప్రెషర్(BP) తక్కువ చేస్తుంది. గుండె జబ్బుల నుండి బాధపడే రోగులకు ఉపశమనం కలుగజేస్తుంది. చిగుళ్ల వ్యాధి నుండి కాపాడుతుంది. mygrain తలనొప్పికి ఉపయోగకారి అని నిరూపించబడింది. జపాన్ వంటి దేశాలలో ప్రజలు, ఆరోగ్యంగా, ఉండటానికి తరుచుగా విటమిన్ క్యును ఆశ్రయిస్తారు. మీరు కూడా మీలోని శక్తిని బయటకు తేవాలంటే రోజు ఆహారంలో విటమిన్ క్యును భాగం చేసుకోండి.