విటమిన్ డి తక్కువుగా ఉండటం సర్వ సాధారణం. మరీ తక్కువుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా సప్లిమెంట్ రూపంలో విటమిన్-డి తీసుకోవాలి. నార్మల్ అయితే సప్లిమెంట్స్ మానేయాలి. ఎముకలకు కావాల్సిన క్యాల్షియంను శోషించుకోవడానికి, కండరాలు బలహీనం కాకుండా రక్షించుకోవడానికి విటమిన్-డి తోడ్పడుతుంది. శరరీంలో Vitamin-D తక్కువైతే, నీరసం, నడుపు నొప్పి, జుట్టు రాలడం జరుగుతాయి. అయితే Vitamin-D ని ఎండ నుంచి వచ్చే కాంతిని ఉపయోగించుకుంటూ సాధారణంగా శరీరమే తయారు చేసుకుంటుంది.
Vitamin-D పెరగాలంటే ఏం తినాలి?
గుడ్డులో పసుపు సొన, ఆర్గాన్ మీట్స్, ఆయిల్స్, ఛీజ్, పన్నీర్, నెయ్యి, వెన్న మొదలైన వాటిలో Vitamin-D ఉంటుంది. ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజూ ఒక గుడ్డు పూర్తిగా తీసుకుంటే విటమిన్-డి లోపం రాదు. అలాగే ప్రతి రోజూ శరీరానికి సూర్యరశ్మి తగిలేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా ఇంటి పట్టున ఉండేవారికి ఈ లోపం అధికంగా ఉండవచ్చు. ఎండలో నడవడం, వ్యాయామం చెయ్యడం,రన్నింగ్ లాంటివి చేస్తే Vitamin-D లోపాన్ని అధిగమించవచ్చు. పైగా ఎముకలు బలంగా తయారవుతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.