Vitamin A deficiency disease విటమిన్ – ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. ఇది లోపించిన వారిలో వివిధ రకాల జబ్బులు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 5 లక్షల మంది చిన్నారులు విటమిన్ ఎ లోపంతో అంధత్వానికి గురవుతున్నారు. 230 మంది పిల్లలు వ్యాధి నిరోధక శక్తి కోల్పోయి వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. విటమిన్-ఎ సమృద్ధిగా లభించిన పిల్లలకంటే, విటమిన్ – ఎ లోపం ఉండే చిన్నారుల్లో వివిధ సమస్యలతో మరణించే అవకాశం 20 నుంచి 30 శాతం(Vitamin A deficiency disease) అధికం.
బీటాకెరోటిన్(beta carotene) అనే పదార్థం ద్వారా విటమిన్ – ఎ లభిస్తుంది. ప్రకృతిలో దొరికే కేరట్, క్యాబేజీ, బొబ్బాయి, మునగ, పచ్చని ఆకుకూరల్లో ఇది సమృద్ధిగా లభిస్తుంది. పాలు, వెన్న, మీగడ, గుడ్లు, చేపల్లో కూడా పుష్కలంగా లభిస్తుంది. శరీరంలోని చర్మాన్ని, వివిధ అవయావాల్లో ఉండే మ్యూకజ్ మెంబ్రేన్ అనే పలుచని పొరను రక్షించడంలో బాగా తోడ్పడుతుంది. విటమిన్ – ఎ లోపిస్తే శరీరంలో ప్రధానంగా దెబ్బతినేవి కళ్లు.


తొలిదశలో కంటిలోని తెల్లగుడ్డు ఎండిపోయినట్లవుతుంది. నల్ల గుడ్డు ప్రకాశం కోల్పోతుంది. నల్ల గుడ్డు ద్వారా కాంతి కిరణాలు రెటీనాకు స్పష్టంగా చేరవు. కళ్ళలో ఇసుక ఉన్నట్టు అనిపిస్తుంది. దీంతో కళ్లు దురద పుడతాయి. రుద్దుకోవాలనిపిస్తుంది. రుద్దుకుంటే కళ్లు ఎర్రబడతాయి. కాంతిని సరిగ్గా చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. తీవ్ర దశలో నల్లగుడ్డు పూర్తిగా క్షీణించిపోతుంది. దీనినే కెరటోమలేసియా అంటారు. ఈ దశలో పూర్తి అంధత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కంటిలోని రోడోప్సిన్ అనే పదార్థం తగ్గడం వల్ల పిల్లల్లో రేచీకటి వస్తుంది.
విటమిన్- ఎ లోపించిన పిల్లలకు గాయాలు త్వరగా మానవు. దంతాలు రావడంలోనూ లోపాలుంటాయి. ఏడాదిలోపు చిన్నారులకు ప్రతిరోజూ వెయ్యి అంతర్జాతీయ యూనిట్ల విటమిన్ – ఎ అవసరం అవుతుంది. బడికిపోయే వయస్సు వచ్చేటప్పటికీ రోజుకు ఐదువేల అంతర్జాతీయ యూనిట్ల విటమిన్-ఎ అవసరం అవుతుంది. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు తీసుకోవడం వల్ల విటమిన్ – ఎ లోపం రాకుండా ఉంటుంది. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా పోలియో, బూస్టర్, డిపిటి వంటి టీకాలతో పాటు విటమిన్ – ఎ ద్రవాన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. విటమిన్ – ఎ ద్రవం ఇప్పించడం ద్వారా లోపాన్ని అధిగమించవచ్చు.


తమ పిల్లలకు లోపం రాకూడదని కొందరు విటమిన్-ఎ మందులు ఇస్తుంటారు. ఇది ప్రమాదకరం ఎందుకంటే ఆహారం ద్వారా విటమిన్-ఎ పొందితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ మందుల ద్వారా అవసరానికి మించి తీసుకుంటే హైపర్ విటమిన్-సి అనే జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ. దీని వల్ల పిల్లల్లో తలనొప్పి, వాంతులు, చర్మం ఊడిపోవడం, వెంట్రుకలు రాలిపోవడం, పెదవులు చీలడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక వేళ విటమిన్-ఎ లోపిస్తే, మందుల ద్వారా పొందాలనుకున్నప్పుడు అది వైద్యుల పర్యవేక్షణంలోనే జరగాలి.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?