Viscosity

Viscosity: ర‌క్తం వేగాన్ని నియంత్రించుకోవాల‌న్నా, స‌ముద్రంలో కెరటాలు తాకిడి త‌గ్గాల‌న్నా స్నిగ్థతే కార‌ణం!

Share link

Viscosity | ద్ర‌వాలు, వాయువులు ఎప్పుడూ అధిక పీడ‌నం నుంచి అల్ప‌పీడ‌నం వైపు ప్ర‌వ‌హిస్తుంటాయి. అందువ‌ల్ల వీటిని ప్ర‌వాహినులు అని అంటారు. ప్ర‌వాహినుల పొర‌ల్లో ఉన్న అణువుల మ‌ధ్య సంసంజ‌న బ‌లాలు ప‌నిచేసి అవి ప‌ర‌స్ప‌రం ఆక‌ర్షించుకుంటాయి. కాబ‌ట్టి ఒక పొర వేగాన్ని దాని కింద ఉన్న మ‌రొక పొర వ్య‌తిరేకిస్తుంది. అందువ‌ల్ల ఆ పొర‌ల వేగం తగ్గుతుంది. ప్ర‌వ‌హినుల పొర‌ల మ‌ధ్య‌లో ఉన్న నిరోధ‌క బ‌లాల‌ను స్నిగ్థ‌త బ‌లాలు లేదా స్నిగ్థ‌త(Viscosity) అని అంటారు.

స్నిగ్థ‌త(Viscosity) ఉదాహ‌ర‌ణ‌లు

వ‌ర్ష‌పు చినుకులు, పారాచూట్ వేగం త‌గ్గ‌డానికి కార‌ణం వాతావ‌ర‌ణంలో వాయుపొర‌ల మ‌ధ్య‌లోని స్నిగ్థ‌త బ‌లాలు ఉండ‌ట‌మే అని చెప్ప‌వ‌చ్చు. స‌ముద్రంలో ఉవ్వెత్తున లేచిన కెర‌టాలు తీరాన్ని చేరేస‌రికి స్నిగ్థ‌త వ‌ల్ల క్షీణించిపోతాయి. ర‌క్తం త‌న వేగాన్ని తానే నియంత్రించుకోవ‌డానికి ఈ ధ‌ర్మం బాగా ఉప‌యోగ‌ప డుతుంది. స్నిగ్థ‌త‌ను ఉప‌యోగించి తెల్ల ర‌క్త క‌ణాలు,ఎర్ర‌ర‌క్తకణాల‌ను వేరు చేయ‌వ‌చ్చు. బంగార‌పు క‌ణాల నుంచి మ‌ట్టి క‌ణాల‌ను వేరు చేయ‌డానికి కూడా ఈ ధ‌ర్మం ఉప‌యోప‌డుతుంది. మ‌న‌కు ల‌భిస్తున్న ద్ర‌వ ప‌దార్థాల్లో ఎక్కువ స్నిగ్థ‌త ఉన్న ప‌దార్థం గ్రీజు. కాబ‌ట్టి దీన్ని యంత్ర భాగాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నివారించ‌డానికి స్నేహ‌క‌తైలంగా ఉప‌యోగిస్తారు. గ్రీజు త‌ర్వాత ఎక్కువుగా స్నిగ్థ‌త ఉన్న ప‌దార్థం Honey అని చెప్ప‌వ‌చ్చు.

స్నిగ్థ‌త‌తోనే వేగం నియంత్ర‌ణ‌

వ‌స్తువు భారం ఎటువంటి యాన‌కం లేని శూన్య‌ప్ర‌దేశంలో ఎక్కువుగా ఉండ‌టానికి కార‌ణం స్నిగ్థ‌త బ‌లాలు లేక‌పోవ‌డ‌మే అని అర్థం. భూమిపై ఉన్న ప్ర‌తి వ‌స్తువుపైనా భూమి గురుత్వాక‌ర్ష‌ణ బ‌లం స‌మానంగా ప‌నిచేస్తుంది. రాయి, దూది రెండింటినీ ఒకే ఎత్తులో ఉంచి కిందికి జార‌విడిచిన‌ప్పుడు రాయి ముందు నేల‌ను చేరుతుంది. కార‌ణం రాయితో పోల్చిన‌ప్పుడు Cottonపై వాతావ‌ర‌ణం Viscosity బ‌లాలు ఎక్కువ‌గా ప‌నిచేయ‌డ‌మే. ఈ రెండింటిని శూన్యంలో జార‌విడిచిన‌ప్పుడు ఒకేసారి కిందికి వ‌స్తాయి. ద్ర‌వాల‌ను వేడిచేసిన‌ప్పుడు వాటి అణువుల మ‌ధ్య ఉన్న సంసంజ‌న బ‌లాలు త‌గ్గిపోవ‌డం వ‌ల్ల స్నిగ్థ‌త కూడా త‌గ్గుతుంది. వాయువుల‌ను వేడి చేసిన‌ప్పుడు వాటి అణువుల చ‌ల‌నం పెరిగి అవి ఒక‌దానికొకటి ద‌గ్గ‌ర‌గా వ‌స్తాయి. కాబ‌ట్టి స్నిగ్థ‌త పెరుగుతుంది.

SubstanceViscosity(mPa.s)Temperature(c)
Benzene0.60425
Water1.001620
Mercury1.52625
Whole Milk2.1220
Dark Beer2.5320
Olive Oil56.226
Honey2000-1000020
Ketchup5000-2000025
Peanut Butter10-10
Pitch2.3X1010-13(variable)
Dehydration: ఎండాకాలంలో డీహైడ్రేష‌న్ ఎఫెక్ట్‌కు ప‌డితే ఏం చేయాలో తెలుసా?

Dehydration | ఎండాకాలంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఏవో ఒక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూనే ఉంటారు. కార‌ణం వాతావార‌ణంలో వేడి శ‌రీర ధ‌ర్మ‌ప్ర‌క్రియ‌ల్లో అవ‌రోధాన‌ల‌ను సృష్టిస్తోంది. అందుకే అనేక Read more

Hard water: మ‌న ఇంటిలో వాడుకునే హార్డ్ వాట‌ర్ స‌మ‌స్యల‌ నుండి బ‌య‌ట‌ప‌డేదెలా?

Hard water | నీరు ఇది మ‌నం నిత్య‌వ‌స‌ర వ‌న‌రు. 24 గంట‌లూ ప్ర‌తి జీవికి అవ‌స‌ర‌మ‌య్యే ఆహారంలో ఒక భాగం. మ‌నం ఇళ్ల‌లో ఉద‌యాన్నే నిద్ర Read more

7 Glasses Water: రోజుకు 7 గ్లాసులు నీరు తాగాల్సిందే లేకుంటే త‌ప్ప‌దు ప్ర‌మాదం!

7 Glasses Water | రోజుకి ఏడు గ్లాసుల నీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో 200 కాల‌రీలు త‌గ్గుతాయ‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా. కానీ ఇది నిజం. Read more

raw coconut water: summer drink కొబ్బ‌రి నీళ్లు కాక‌పోతే మ‌రేమిటి?

raw coconut water | ఎండ‌లు మండిపోతున్నాయి. వేస‌వి రాక‌ముందే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మండే ఎండ‌ల‌కు ఉష్ణోగ్ర‌త‌ల్లో మార్పులు రావ‌డం, అనారోగ్యాల‌కు గుర‌య్యే ప్ర‌మాదం లేక‌పోలేదు. Read more

Leave a Comment

Your email address will not be published.