Virata Parvam Official Teaser : సురేష్ ప్రొడక్షన్లో వేణు వుడుగుల డైరెక్షన్లో వస్తున్న ఉద్యమ చిత్రం Virata Parvam Official Teaser గురువారం విడుదలైంది. రాణా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల అంచనాలను మరింత ఎక్కువ చేశాయి. మావోయిస్టు వీరుడు రవన్న యధార్థ కథ అనుసారం వస్తున్న ఈ చిత్రం టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. అగ్రనేత పాత్రలో హీరో రానా దగ్గుబాటి మావోయిస్టు డ్రెస్‌లో అదరగొట్టారు. మావోయిస్టులకు, పోలీసులకు అడవుల్లో జరిగే ఎదురు కాల్పులు ఈ సినిమాలో ప్రత్యక్షంగా కనిపించబోతున్నాయి. భారతక్క పేరుతో ప్రముఖ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
“ఆధిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు!
తారతమ్య గోడలనే పెకిలించగ ఎన్నినాళ్లు!
దున్నేటోడి వెన్నువిరిచి భూస్వాములు ధనికులైయిరి!“

విరాటపర్వం సినిమా టీచర్ పరిశీలిస్తే హీరో రానా దగ్గుబాటి ఓ డైలాగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ డైలాగ్ వింటే వెంట్రుకలు నిక్కరపొడిచేలా ప్రతి ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తుంది. హీరో రానా దగ్గుబాటితో ప్రేమలో పడిన హీరోయిన్ సాయిపల్లవి అద్భుతమైన నటన ఈ సినిమాతో చిరస్థాయిలో నిలిచే అవకాశం ఉంది. తన అరణ్య (హీరో పేరు) కోసం తన ప్రేమ కోసం అడవులకు ప్రయాణమవుతుంది. అక్కడ అడవుల్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, మావోయిస్టులు పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూస్తుంది. తన ప్రియుడు నడిచిన ఉద్యమ బాటలో ప్రియురాలు నడవడం, ఆ ఉద్యమానికి సపోర్టుగా ఉంటూ ఆమె తన ప్రియుడు కు అభిమానిగా పడిపోయాను అంటూ ఒక డైలాగ్ చెబుతుంది. ఈ డైలాగ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఇప్పటి వరకు రానా దగ్గుబాటి ఎంచుకున్న సినిమా కథలన్నీ ప్రత్యేక యధార్థ కథలే ఉన్నాయి.
” ప్రియమైన అరణ్య..నీకు నేను అభిమాని అయిపోయాను.
నీ కవిత్వం చదువుతుంటే
నాలో ఏదో తెలియని భావోద్వేగం రగులుతోంది.
మీరాభాయి కృష్ణుడు కోసం
కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను వదిలేసి
ఎలా వెళ్లిపోయిందో!
అలానే నేను నీకోసం వస్తున్నాను.“

Virata Parvam Official Teaser : డైరెక్టర్ వేణు తీస్తున్న విరాటపర్వం సినిమాతో తన కెరీర్ మలుపుతిరిగే అవకాశం ఉంది. ఈ సినిమా అంతా సహజమైన పాత్రలతో తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకులను, దగ్గుబాటి అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక సినిమాలో హీరో రానా, హీరోయిన్ సాయిపల్లవి జోడీ బాగుందని నెటిజన్లు, అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రానా వాయిస్ కూడా బాగుందని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్కా అంటున్నారు. ముఖ్యంగా ఎర్రజెండా కామ్రేండ్లు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఎదురుచూడటం గమనర్హం. సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను అందించిన సురేష్ బొబ్బిలికి 100 కి 100 మార్కులు పడ్డాయి. ఈ సినిమా అమరవీరుడు మావోయిస్టు అగ్రనేత కామ్రేడ్ రవన్నకు అకింతమయ్యే సినిమాగా చిరస్థాయిలో నిలిచిపోనున్నది. ఈ సినిమా ఏప్రిల్ 30, 2021న విడుదల కానుంది.
Movie: | Virata Parvam |
Cast : | Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Naveen Chandra. |
Writen & Director : | Venu Udugula |
Producer : | Sudhakar Cherukuri |
Banner : | Suresh Productions, SLV Cinemas |
Presented by : | Suresh babu |
Music : | Suresh Prasad |
Stunts : | Peter Hein, Stefan Richter |
Choreography : | Raju Sundaram & Prem Rakshith |
Pro : | Vamsi – Sekhar |
Executive Producer : | Vijay Kumar Chaganti |
Virata Parvam Release Date : | 30 April 2021 |
Youtube video link: | Virata Parvam Official Teaser |
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!