Viral Video: బుల్లెట్ బండి సాంగ్‌ స్టాఫ్ న‌ర్స్‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు..చ‌ర్య‌లు ఏ విధంగా తీసుకుంటారంటూ స‌ర్కార్‌కు ప్ర‌శ్న‌!

0
15

Viral Video: బుల్లెట్ బండి పాట‌..ఈ ప‌దిహేను రోజుల నుండి ఓ ట్రెండింగ్ క్రియేట్ చేసింది..సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తున్న పాట‌గా కూడా గుర్తింపు పొందింది. ఈ పాట మొద‌ట్లో ఎవ‌రూ అంత‌గా ప‌ట్టించుకోకున్నా, ఓ పెళ్లి కూతురు డాన్స్ చేయ‌డంతో ప్రాచుర్యంలోకి మ‌రింత‌గా వ‌చ్చింది. ఈ డాన్స్ త‌ర్వాత రాజ‌న్న సిరిసిల్ల జిల్లా తంగ‌ళ్ల‌ప‌ల్లి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో ఓ న‌ర్స్ నృత్యం చేయ‌డం అంద‌ర‌న్నీ ఆక‌ట్టుకుంది.

కానీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో చేయ‌డం వివాదానికి దారి తీయ‌డం, వెంట‌నే జిల్లా వైద్యాధికారి సుమ‌న్ రావ్ క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు మోమో జారీ చేయ‌డం ఇట్టే జ‌రిగిపోంది. కానీ స్టాఫ్ న‌ర్స్ ర‌జ‌నీ ఓ అణ‌గారిన సామాజిక వ‌ర్గానికి చెందిన పేదింటి అమ్మాయి. ఉద్యోగం ప‌ట్ల క‌మిట్ మెంట్‌, నిబ‌ద్ధ‌త‌ను వైద్య సిబ్బందే అభినందిస్తారు. ప‌దేళ్ల‌కు పైగా అవుట్ సోర్సింగ్ విభాగంలో ప‌నిచేసి ఈ మ‌ద్యే కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన విధులు నిర్వ‌హిస్తోంది.

క‌రోనా స‌మ‌యంలో కూడా క‌ష్ట‌ప‌డి ప్రాణాల‌కు తెగించి ప‌ని చేసింది. క‌రోనా బారిన ప‌డి కోలుకుంది. ఐన త‌న ఆత్మ‌స్థైర్యాన్ని వ‌దులుకోలేదు. ఆస్ప‌త్రిలో సిబ్బందితో కానీ, రోగుల‌తో కానీ ఎప్పుడూ న‌వ్వుతూ న‌వ్విస్తూ చ‌లాకీగా ఉంటుంది. పంద్రాగ‌ష్టు రోజున స‌ర‌దాగా చేసిన డ్యాన్స్ వీడియో తోటి మిత్రుల‌కు షేర్ చేసుకోవ‌డంతో అది కాస్త సోష‌ల్ మీడియాకు ఎక్కి వైర‌ల్(Viral Video) అయ్యింది.

ఉద్యోగం కోల్పోయే ప‌రిస్థితి వ‌చ్చింది. మోమోల విష‌యం కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో వేల మంది నెటిజ‌న్లు స్టాఫ్‌న‌ర్స్ ర‌జినికే మ‌ద్ద‌తు ప‌లికారు. చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని వేడుకుంటున్నారు. ఎంతో మంది లంచాలు తింటూ, ప్రభుత్వానికి చెడ్డ‌పేరు తీసుకురాగా త‌ప్పులేదు కానీ.. జెండా వంద‌నం రోజు స‌ర‌దాగా చేసిన డ్యాన్స్ పొర‌పాటున సోష‌ల్ మీడియాలో ఎక్కింద‌ని మొద‌టి త‌ప్పుగా మ‌న్నించాల‌ని
రాత‌పూర్వ‌కంగా అధికారుల‌కు సంజాయిషీ ఇచ్చింది.

దీంతో అదికారులు సైతం వెన‌క్కి త‌గ్గారు. నేడో రేపో అధికారికంగా ర‌జినీని క్ష‌మిస్తూ మోమోలు వెన‌క్కి తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లో భాగంగా మాత్రం అన్ని పీహెచ్‌సీల‌కు ప‌లు ఆదేశాలు జారీ చేశారు. ఈ విష‌య‌మై మంత్రి కేటీఆర్‌కు కూడా నెటిజ‌న్లు స్టాఫ్ న‌ర్స్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని వంద‌ల కొద్ది మెస్సేజ్‌ల‌తో విజ్ఞ‌ప్తి చేశారు.

వైర‌ల్ అయిన స్టాఫ్ న‌ర్స్ బుల్లెట్ బండి సాంగ్ వీడియో ఇదే!

Latest Post  Online class : చెట్టు కింద చ‌దువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచ‌న‌కు జేజేలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here