viral news of kejriwal దేశంలో అనేక రాష్ట్రాలు అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులకు గురవుతున్న వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషి ఆర్థిక స్థితి గతులపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఇక దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కూడా కోవిడ్ ప్రభావం తీవ్రంగానే ఉంది. అయితే ఢిల్లీ సీఎం మాత్రం దేశంలోనే అప్పులేని రాష్ట్రంగా తన రాష్ట్రాన్ని నిలబెట్టడం ఇప్పుడు రాజకీయాల్లోనే చర్చనీయాశంగా మారింది. ఢిల్లీ సీఎంకే అది ఎలా సాధ్యమైందనే వార్త కూడా ఇప్పుడు వైరల్‌గా (viral news of kejriwal)మారింది.
అప్పు లేని రాష్ట్రంగా ఢిల్లీ!
ఒక్క పైసా కూడా అప్పు లేని రాష్ట్రంగా దేశ రాజధాని ఢిల్లీ గుర్తింపు పొందిందంట. ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్రం అప్పుల ఊబిలోనే ఉంది. ఎప్పుడైతే సీఎం కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టి తన భుజాన వేసుకున్నారో అప్పటి నుండి ఢిల్లీని అప్పుల ఊబిలో నుండి బయటకు తీసుకొచ్చి తన పాలన సమర్థతను చాటుకున్నారట. ఢిల్లీ రాష్ట్రంలోని ప్రస్తుతం అన్ని వ్యాధులకూ ప్రజలకు వైద్య సేవలు, 200 యూనిట్ల వరకూ కరెంట్ బిల్లులు ఉచితంగా అందిస్తున్నారు. అన్ని పాఠశాలలూ సర్వాంగ సుందరవనంగా తీర్చిదిద్దారు. ఢిల్లీలో ఉన్న స్కూళ్లు చూస్తే కార్పొరేట్ పాఠశాలలు కూడా చాలవంట. అంత అద్భుతంగా పాలన ఉందంటూ సీఎం కేజ్రీవాల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఢిల్లీ రాష్ట్రంలో కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి మనీష్ సిసోడియాలు సైతం ఎప్పుడూ ఏదో ఒక పాఠశాలను పర్యవేక్షిస్తూనే ఉంటారట. పాఠశాలలను పర్యవేక్షించే టప్పుడు ప్రధానోపధ్యాయులకు ఎదురుగా ఉంటే సీట్లోని మాత్రమే వారు కూర్చుంటారట. అక్కడ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయునితో పాటు ఎస్టేట్ మేనేజర్ అనే వేరొక ప్రధానోపాధ్యాయులు ఉంటారట. పాఠశాలకు అవసరమయ్యే వసతులు, నిర్వహణ, వివిధ ఏర్పాట్లు, మరమ్మతలు ఈ ఎస్టేట్ మేనేజరే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. కేవలం ప్రధానోపాధ్యాయునిపై అకాడమిక్ బాధ్యతలు మాత్రమే ఉంటాయట.
అయితే కేజ్రీవాల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాలు అప్పులు చేసి సంక్షేమ పథకాలు పేరిట పప్పు బెల్లాలు పంచుతున్నాయని ఈ విధానం బ్యాడ్ పాలిటిక్స్ సూచిక అని స్పష్టం చేశారు. మంచి సమర్థతతో, చక్కటి అవగాహనతో డిల్లీ ప్రజలను అభివృద్ధి పథం వైపు మళ్లిస్తూ ఉన్న కేజ్రీవాల్‌కు దేశంలో ఎంతో పేద ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీ నాయకులు సైతం ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!