Vinukonda Subrahmanyam: మంగ‌ళి వృత్తి అంటే అంత చిన్న‌చూపా? మోహ‌న్‌బాబుపై ఫైర్‌

Vinukonda Subrahmanyam: దేశంలో కానీ, ప్ర‌పంచంలో కానీ రూ.5 ల‌క్ష‌ల విలువైన హెయిర్ స్టైల్‌కు సంబంధిన వ‌స్తువులు ఉండ‌వ‌ని వినుకొండ సుబ్ర‌మ‌ణ్యం అన్నారు. హీరో మోహ‌న్‌బాబు మంగ‌ళి వృత్తి దారుడు నాగ శ్రీ‌నుపై దొంగ‌త‌నం నింద వేసి రూ.5 ల‌క్ష‌లు విలువ చేసే మేక‌ప్ కిట్టులు తీసుకెళ్లాడ‌ని ఆరోపించారు. దీంతో నాగ శ్రీ‌ను తాను ఏ దొంగ‌త‌నం చేయ‌లేదని పేర్కొంటూ, త‌న కుల వృత్తిదారుల‌ను క‌లిసి జరిగిన విష‌యం వివ‌రించారు.

నాగ శ్రీ‌నుపై దూర్భాష‌లాడిన హీరో మోహ‌న్‌బాబుపై వినుకొండ సుబ్ర‌మ‌ణ్యం (Vinukonda Subrahmanyam)ఫైర్ అయ్యారు. మంగ‌ళి వృత్తి చేసే వారంటే అంత చిన్నచూపా..ఎవ‌రి కులం వారికి గొప్ప‌ది.. .నీ కులం నీకు గొప్పంది. ఈ స‌మాజంలో వృత్తులు చేసుకునే ప్ర‌తి ఒక్క‌రికీ కులం ఉంద‌ని, వారి కులాన్ని వారు ఆరాధిస్తార‌ని సుబ్ర‌మ‌ణ్యం ప్రెస్‌మీట్‌లో మెహ‌న్ బాబుపై ప్ర‌శ్న‌లు వ‌ర్షం కురిపించారు.

త‌మ మంగ‌ళి సోద‌రుడిపై హీరో మోహ‌న్‌బాబు దొంగత‌నం నింద వేయ‌డంపై ఆయ‌న ఫైర్ అయ్యారు. మోహ‌న్‌బాబు హీరో కావ‌చ్చ‌ని, అంత మాత్రాన విలువ‌ల్లేకుండా ఎవ‌ర్ని పడితే వార్ని దూషించ‌డం క‌రెక్టు ప‌ద్ధ‌తి కాద‌ని తెలిపారు. మోహ‌న్‌బాబు ఇంట్లో కెమెరాలు ఉంటాయి అని, దొంగ‌త‌నం జ‌రిగిందా? లేదా? అనేది తెలుసుకోవ‌చ్చుగా అని పేర్కొన్నారు. వేమ‌న శ‌త‌కం చెప్పిన‌ట్టు ఎన్ని య‌జ్ఞాలు చేసినా మంత్ర జ‌లం క‌న్నా..మంగ‌ళి జ‌లం మెచ్చు అనే విధంగా, మంగ‌ళి వారి జ‌లం వ‌ల్లే ఉన్న రోగాల‌న్నీ మాయ‌మ‌వుతాయ‌ని, క‌త్తెరించే ట‌ప్పుడు జ‌ల్లే నీళ్లే అమూల్యంగా భావిస్తార‌ని అన్నారు.

రెండ్రోజులు, మూడ్రోజులు స్నానాలు చేయ‌కుండా, దుమ్ము ప‌ట్టుకుపోయిన శ‌రీరాల‌ను ఇంట్లో వారు ఛీద‌రించుకుంటే మంగ‌ళి వారు వారిని శుభ్రం చేసి, చాక‌లి వారు వారి బట్ట‌లు శుభ్రం చేసి అందిస్తార‌ని అన్నారు. అలాంటి మంగ‌ళి వృత్తి వారిని, ఇత‌ర కులాల వారిని దూషించ‌డం మంచిది కాద‌ని అన్నారు.

Share link

Leave a Comment